Unstoppable With NBK : దెబ్బలు పడతాయ్ రాజా.. కిస్సిక్ పాటకి నటసింహం బాలయ్య, నవీన్ పోలిశెట్టి స్టెప్స్ వేస్తే
అల్లు అర్జున్ పాటకు నటసింహం బాలయ్య డ్యాన్స్ చేస్తే.. బాలయ్య పక్కన ఆ పాటలో నర్తించిన శ్రీలీల కూడా ఉంటే.. ఆ కిక్ ఎలా ఉంటుందో తెలియాలంటే తాజాగా వచ్చిన అన్‌స్టాపబుల్ న్యూ ఎపిసోడ్ ప్రోమో చూడాల్సిందే..
Unstoppable With NBK S4 New Promo : నటసింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న ‘అన్‌స్టాపబుల్ విత్ NBK’.. టాప్ ప్లేస్‌లో దూసుకెళుతోందనేది అందరికీ తెలిసిందే. ఆహా ఓటీటీలో మూడు సీజన్లను సక్సెస్‌పుల్‌గా ముగించుకున్న ఈ షో.. ఇప్పుడు నాల్గవ సీజన్‌కు చేరుకుంది. ఈ నాల్గవ సీజన్‌లో కూడా ఆల్రెడీ 5 ఎపిసోడ్స్ పూర్తయ్యాయి. ఇప్పుడు 6వ ఎపిసోడ్ ప్రీమియర్‌కు రెడీ అవుతోంది. ఈ లోపు ప్రోమోలతో ఈ ఎపిసోడ్‌పై హైప్‌ని తెచ్చే ప్రయత్నాలను ఆహా చేస్తోంది. అందులో భాగంగా 6వ ఎపిసోడ్ స్పెషల్ ప్రోమోని ఆహా టీమ్ విడుదల చేసింది. ఈ ఎపిసోడ్‌కు డ్యాన్సింగ్ బ్యూటీ శ్రీలీల, నవ్వుల రారాజు నవీన్ పోలిశెట్టి గెస్ట్‌లుగా వస్తున్నట్లుగా ఇప్పటికే ఓ స్మాల్ గ్లింప్స్‌ని వదలగా.. ఇప్పుడొచ్చిన ప్రోమో మరింతగా ఈ ఎపిసోడ్‌పై హైప్‌ని పెంచుతోంది.
Also Read : సినిమాల నుంచి తప్పుకుంటున్న 12th Fail హీరో... వాళ్ల కోసమే ఈ షాకింగ్ నిర్ణయమట
ఈ ప్రోమోని పరిశీలిస్తే.. ముందుగా నటసింహం బాలయ్య.. నవీన్ పోలిశెట్టికి వెల్‌కమ్ చెప్పగా.. బాలయ్య ఫొటోతో ప్రత్యక్షమైన నవీన్.. ‘మీరు ఎమ్మెల్యే.. నేను ఎమ్మేల్యే అంటూ మీరు మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ.. నేను మెంబర్ ఆఫ్ లాస్ట్ బెంచ్ అసోసియేషన్’ అని చెప్పి తన కామెడీ పంచ్‌ని ప్రదర్శించాడు. మరో గెస్ట్ శ్రీలీల పేరు చెప్పగానే.. ఆమె వీణతో దర్శనమిచ్చింది. ఆమెని చూసి ‘కుర్చీ మడతబెట్టి’ పాటని ట్రై చేద్దామంటూ నవీన్.. పాట పాడుతుంటే.. ‘నా వీణ భరించలేకపోతుంది’ అంటూ శ్రీలీల పొట్టచెక్కలయ్యేలా నవ్వుతూ చెప్పింది.
మీ ఇద్దరి జర్నీలో ఎన్నో అడిషన్స్ ఇచ్చి ఉంటారు కదా.. అని బాలయ్య అడిగిన ప్రశ్నకు.. చిప్స్ యాడ్‌లో సిక్స్ ప్యాక్ లేదని నన్ను తీసేశారంటూ నవీన్ మరో పంచ్ పేల్చాడు. శ్రీలీల ఫొటో ఒకటి చూపిస్తే.. అది నా ఓణీల ఫంక్షన్ అప్పటి ఫొటో అని శ్రీలీల అంటే.. వెంటనే నవీన్ ‘ఒక తోటలో.. ఒక కొమ్మలో’ అంటూ పాట అందుకున్నాడు. డాక్టర్ ఎమ్‌బిబిఎస్ శ్రీలీల అని బాలయ్య అంటే.. ఎమ్‌బిబిఎస్‌లో మూడు మెయిన్ సబ్జెక్ట్స్. ఫస్ట్ ఇయర్ ‘కుర్చీ మడతబెట్టి’, సెకండ్ ఇయర్ ‘జింతాక’, థర్డ్ ఇయర్ ‘కిస్సిక్’.. అంటూ నవీన్ కామెడీ పండించాడు. ఆ తర్వాత శ్రీలీలకు నవీన్ ఇచ్చిన ఎలివేషన్‌కు ‘ఆ అబ్బా..’ అన్నది శ్రీలీల.
<
Jai Balayya, Jathiratnam oke stage meeda🔥
— ahavideoin (@ahavideoIN) December 2, 2024
Ee " leela" nu apedevarika!😍#UnstoppableWithNBK Season 4, Episode 6 premieres on Dec 6. #UnstoppableS4 #naveenpolishetty @sreeleela14 @NaveenPolishety #nandamuribalakrishna #Aha #Unstoppable #sreeleela pic.twitter.com/gbblHYovvp
>
ఆ తర్వాత అసలు ఘట్టం మొదలైంది. బాలయ్య కిస్సిక్ అంటే.. శ్రీలీల ‘కిస్సిక్’ పాట స్టెప్పును వారిద్దరికి నేర్పింది. రియల్ లైఫ్‌లో చిట్టి దొరికిందా? అని బాలయ్య ప్రశ్న. ‘జాతిరత్నాలు’ కోర్టు సీన్ గుర్తొస్తుంది అంటూ నవీన్.. ఇలా సాగుతున్న ఈ ఎపిసోడ్‌లో ‘ఒక డేట్‌కి వెళదామని అనుకున్నావనుకో.. ఏ యాక్టర్‌ని తీసుకుని వెళతావ్’ అని బాలయ్య అడిగితే.. ‘మీరు నిజంగా ఇది నన్నే అడుగుతున్నారా సార్’ అంటూ శ్రీలీల అనగానే బాలయ్య ఇచ్చిన పంచ్ మాములుగా లేదు. నవీన్ ఆల్రెడీ డేట్ అంటూ బాలయ్యతో ముద్దు పెట్టించుకున్నాడు. అక్కడి నుండి ‘దెబ్బలు పడతాయ్ రాజా.. దెబ్బలు పడతయ్ రో’ అంటూ బాలయ్య, నవీన్, శ్రీలీల.. ‘పుష్ప 2’ పాటకు వేసిన స్టెప్స్.. ఎప్పుడెప్పుడు ఈ ఎపిసోడ్ వస్తుందా? అని ఈగర్‌గా వెయిట్ చేసేలా చేస్తున్నాయి.
Also Read: 'దసరా' దర్శకుడికి అవకాశం ఇస్తున్న చిరంజీవి - మెగా మాస్ మూవీ లోడింగ్?