Ram Gopal Varma News Today: రాంగోపాల్ వర్మకు హైకోర్టులో స్వల్ప ఊరట- సోమవారం వరకు అరెస్టు చేయొద్దని ఆదేశం
AP High Court On RGV Case: సోషల్ మీడియాలో అసభ్యకరమైన కామెంట్స్ పెట్టారన్న కేసులో ఆర్జీవీకి స్వల్ప ఊరట లభించింది. కేసు విచారణను హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది.
RGV Case Updates: దర్శకుడు రాంగోపాల్ వర్మకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. వచ్చే సోమవారం వరకు అరెస్టు చేయొద్దని పోలీసులను ఆదేశించింది కోర్టు. సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన పోస్టుల విషయంలో నమోదైన కేసులుపై ఆర్జీవీ కోర్టును ఆశ్రయించారు. కేసులు కొట్టేయాలని, ముందస్తు బెయిల్ ఇవ్వాలని పిటిషన్లు వేశారు. వీటిపై విచారణ చేపట్టిన కోర్టు ఆయనకు స్వల్ప ఊరట కల్పించింది. తదుపరి విచారణ వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.
వైసీపీకి అనుకూలంగా రెండు సినిమాలు తీసిన రామ్‌గోపాల్ వర్మ ఆటైంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేష్‌పై అససభ్యకరమైన కామెంట్స్ పెట్టారని ప్రకాశం జిల్లా సహా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో కేసులు నమోదు అయ్యాయి. రాంగోపాల్ వర్మపై చర్యలు తీసుకోవాలని కార్యకర్తలు ఫిర్యాదులు చేశారు.
టీడీపీ ఫిర్యాదుల మేరకు బీఎన్ఎస్ఎస్ లోని వివిధ సెక్షన్‌ల కింద కేసులు పెట్టారు. దీంతో ఆయనకు పోలీసుుల ఇప్పటికే రెండుసార్లు నోటీసులు ఇచ్చారు. విచారణకు రావాలని పోలీసులు పిలుస్తుంటే తనకు షూటింగ్స్ ఉన్నాయని నేరుగా విచారణకు రావడం కుదరదని ఆర్జీవీ చెబుతున్నారు. గత వారంలో ఆయన్ని అరెస్టు చేస్తారంటూ విస్తృతంగా ప్రచారం జరిగింది.
అరెస్టు ఖాయమంటూ ప్రచారం జరగడంతోపాటు ఆర్జీవీ భయపడిపారిపోయారన్న ప్రచారం సాగింది. అయితే తాను ఎవరికీ భయపడి పారిపోలేదని తాను చట్టానికి కట్టుబడి ఉంటానంటూ మీడియాకు చెబుతున్నారు ఆర్జీవీ. షూటింగ్‌లో కోసం తరచూ బయటకు వెళ్తుంటానని అందుకే పోలీసులకు అందుబాటులో ఉండటం లేదని అన్నారు. అవసరమైతే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరవుతానని లాయర్ ద్వారా పోలీసులుకు చెప్పారు.
తనపై నమోదు అయిన కేసులు కక్షపూరితంగా పెట్టారని ఇందులో మెరిట్ లేదని ఆర్జీవీ కోర్టును కూడా ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు వారం రోజులు అరెస్టు చేయొద్దని పోలీసులు ఆదేశించింది.
పోలీసుల విచారణకు హాజరుకాని రాంగోపాల్ వర్మ ఛానల్ స్టూడియోలు దిరుగుతూ ఇంటర్వ్యూలు మాత్రం ఇస్తున్నారు. అసలు కేసులో తనను అరెస్టు చేసే శక్తి లేదని చెబుతున్నారు. తాను ఎవరికీ భయపడటం లేదని అసలు పోలీసులు తన ఇంటికి ఇంత వరకు రాలేదని అన్నారు. ఇదో రాజకీయ కుట్రపూరిత కేసులుగా అభివర్ణించారు.