Republic Kolleru : "రిపబ్లిక్" సినిమాపై కొల్లేరు ప్రజల ఆగ్రహం ! అసలు వివాదం ఏమిటంటే ?
"తెల్లేరు"లో సాగుతున్న ఆక్రమణలు, అక్వా సాగులో విపరీత పరిణామాలు రిపబ్లిక్ సినిమా కథలో భాగం. అయితే అది "కొల్లేరు"ను ఉద్దేశించే చెప్పారంటూ అక్కడి ప్రజలు ఆందోళన బాట పట్టారు .
సాయి ధర్మతేజ్ రిపబ్లిక్ సినిమా విడుదలై వారం రోజులు అవుతోంది. హఠాత్తుగా ఈ సినిమాపై కొత్త వివాదం ప్రారంభమయంది. కొల్లేరు గురంచి సినిమాలో తప్పుగా చూపించారని ముఖ్యంగా అక్కడ కొల్లేరును ఆవాసంగా చేసుకుని ఉపాధి పొందుతున్న ఓ సామాజికవర్గాన్ని కించ పరిచారంటూ వారు రోడ్లపైకి వచ్చారు. హఠాత్తుగా ఏలూరు కలెక్టరేట్ ముందు ధర్నాకు దిగారు. సినిమా నిర్మాత, దర్శకుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కొల్లేరు వివాదంతో రాజకీయ పార్టీలకు సంబంధం లేదని ... కొల్లేరు గురించి తప్పుగా చిత్రీకరిస్తే అందరం ఒక్కటేనని అక్కడి ప్రజలు నినాదాలిచ్చారు. కొల్లేరుపై చూపించిన సన్నివేశాల్ని తొలగించకపోతే సుప్రీం కోర్టుకు వెళ్తామని హెచ్చరించారు. రిపబ్లిక్ చిత్ర ప్రదర్శన నిలిపివేయకపోతే ఆందోళన చేస్తామని ఏపీ ఫారెస్ట్ కార్పొరేషన్ డైరెక్టర్ పల్లెం ప్రసాద్ కూడా హెచ్చరికలు జారీ చేశారు.
Also Read : ఆడపడుచుల చప్పట్లు, కోలాటాలతో పాటలు పాడే దృశ్యం ఓ అద్భుతం..మెగాస్టార్ ట్వీట్ వైరల్
రిపబ్లిక్ సినిమా పూర్తిగా కొల్లేరు అంశం చుట్టూనే తిరుగుతుంది.అయితే ఇలాంటి వివాదాలు చోటు చేసుకుంటాయన్న ఉద్దేశంతోనే సినిమా దర్శకుడు దేవా కట్టా ..కొల్లేరు పేరును ఎక్కడా ప్రస్తావించలేదు. తెల్లేరుగా చెబుతూ కథ నడిపించారు. అందుకే సినిమా విడుదలైన ఐదు రోజుల వరకూ పట్టించుకోలేదేమో కానీ హఠాత్తుగా కొల్లేరు పరిరక్షణ సమితి పేరుతో ఆందోళలు ప్రారంభించారు. కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో మొత్తం 9 మండలాల్లో కొల్లేరు సరస్సు విస్తరించి ఉంది. దాదాపు లక్ష ఎకరాల్లో ఉన్న కొల్లేరు సరస్సు ఆసియాలోనే అతి పెద్ద మంచి నీటి సరస్సులలో ఒకటి. రెండు జిల్లాల్లో కలిపి 122 గ్రామాలు ఉన్నాయి. ఈ సరస్సు అనేక రకాల చేపలకు నిలయం. ఆ చేపల మీద ఆధారపడి వడ్డీలు అనే సామాజికవర్గం ఎక్కువగా జీవనోపాధి పొందుతూ ఉంటుంది. ఈ సినిమా తెల్లేరు చుట్టూ జరిగిన వివాదాలు, అక్కడ ప్రకృతి విధ్వంసాన్ని ప్రస్తావించడంతో చిత్రంలో కొల్లేరు ప్రజల జీవనశైలిని దెబ్బతీసే విధంగా కొన్ని సన్నివేశాలు ఉన్నాయని అక్కడి ప్రజలు ఆరోపిస్తున్నారు.
Also Read : సూపర్ స్టార్ మహేశ్ బాబు కుమార్తె సితార వెండితెర ఎంట్రీ...ఏ సినిమాతో అంటే...
మంచినీటి సరస్సు అయిన కొల్లేరులో అక్వా వల్ల కాలుష్యం పెరుగుతోందన్న ఆరోపణలు చాలా కాలంగా ఉన్నాయి. కొల్లేరు ప్రాంతంలో వ్యవసాయం సాధ్యం కాదని తేలడంతో చేపలు, రొయ్యల సాగుకు అనుమతి ఇచ్చారు. అదే అదనుగా విపరీతంగా ఆక్రమణలు చోటు చేసుకున్నాయన్న ఆరోపణలు ఉన్ాయి. 2006లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం ఆపరేషన్ కొల్లేరులో ఆక్రమణల తొలగించారు. పర్యవరణానికి ఇబ్బందికరమని తొలగించడం వివాదాస్పదం అయింది. అప్పట్నుంచి వివాదం సాగుతూనే ఉంది. ఆ అంశం రాజకీయంగా కూడా సున్నితమైనది.
Also Read: రెహమాన్ 'బతుకమ్మ' సాంగ్.. లాంచ్ చేసిన కల్వకుంట్ల కవిత
సాధారణంగా సినిమాలపై వచ్చే వివాదాలు ఆ సినిమా పబ్లిసిటీకి పనికి వస్తాయి. సినిమా విడుదలైన కొద్ది రోజుల తర్వాత ఈ వివాదం బయటకు రావడంతో రిపబ్లిక్ సినిమాకు మరింత ప్రచారం లభిస్తుంది. అసలు పేరును కొల్లేరుగా ప్రస్తావిచంకపోవడంతో న్యాయపరంగానూ సినిమాకు ఎలాంటి చిక్కులు రావని నిపుణులు అంచనా వేస్తున్నారు.
Also Read: రెహమాన్ 'బతుకమ్మ' సాంగ్.. లాంచ్ చేసిన కల్వకుంట్ల కవిత
Also Read: ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channelసబ్‌స్క్రైబ్ చేయండి