అన్వేషించండి

Telangana Formation Day: వర్షంలోనే తెలంగాణ దశాబ్ధి వేడుకలు, హాజరైన గవర్నర్, సీఎం - ప్రత్యేక ఆకర్షణగా క్రాకర్స్ షో

Celebrations at Tankbund : తెలంగాణ రాష్ట్ర అవిర్భావ ఉత్సవాల్లో భాగంగా ట్యాంక్‌బండ్‌పై నిర్వహించిన సంబురాలు అంబరాన్నంటాయి. ఈ వేడుకల్లో వానను సైతం లెక్క చేయకుండా గవర్నర్, ముఖ్యమంత్రి పాల్గొన్నారు.

Telangana Formation Day : తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి నేటితో  పదేళ్లు పూర్తి అయింది. ఈ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తెలంగాణను ఇచ్చిన పార్టీ కూడా కావడంతో అధికారంలోకి వచ్చిన తరువాత తొలిసారి రాష్ట్ర అవతరణ ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ అధినేత్రి సోనియా, మాజీ సీఎం కేసీఆర్ సహా పలువురు ప్రముఖులు, ఉద్యమకారులకు ఆహ్వానాలను పంపించారు.  అయితే అనారోగ్యం కారణంగా సోనియా వేడుకలకు హాజరు కావడం లేదని ప్రకటించిన సంగతి తెలిసిందే.   అలాగే ఈ కార్యక్రమంలో తాము పాల్గొనబోమని కేసీఆర్  ప్రకటించారు. 

ట్యాంక్ బండ్ పై అంబరాన్నంటిన సంబరాలు
తెలంగాణ రాష్ట్ర అవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి  ట్యాంక్‌బండ్‌పై నిర్వహించిన సంబురాలు అంబరాన్నంటాయి. ఈ వేడుకలకు విశిష్ట అతిథిగా రాష్ట్ర గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌ హాజరయ్యారు. గవర్నర్‌తో కలిసి సీఎం రేవంత్‌రెడ్డి, పలువురు రాష్ట్రమంత్రులు, సీఎస్‌ శాంతి కుమారి పాల్గొన్నారు. ఈ సమయంలో  ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను వారు పరిశీలించారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి  కళాకారులు తరలివచ్చారు. వారు తెలంగాణ చరిత్ర, సంస్కృతిని చాటిచెప్పేలా 17 రకాల కళలను ప్రదర్శించారు. నేడు ఆవిష్కరించిన జయ జయహే తెలంగాణ రాష్ట్ర గీతానికి ఐదు వేల మంది ట్రైనీ పోలీసులతో నిర్వహించిన ఫ్లాగ్‌ వాక్‌ అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. ఈ కార్యక్రమాలను వీక్షించేందుకు ప్రజలు  భారీగా తరలిరావడంతో ట్యాంక్‌బండ్‌ పరిసరాలు కిక్కిరిపోయాయి. వేడుకలు జరుగుతున్న తరుణంలో వాన పడడంతో సాంస్కృతిక కార్యక్రమాలకు ఆటంకం ఏర్పడింది.

 

వానను సైతం లెక్క చేయకుండా భారీగా వీక్షకులు
 ఓ వైపు నగరంలో భారీగా వాన పడుతున్నా వేడుకలను చూసేందుకు ప్రజలు భారీగా తరలి వచ్చారు. దీంతో ట్యాంక్ బండ్ జనసంద్రంగా మారింది.  ప్రేక్షకుల కోసం ప్రభుత్వం భారీగా ఏర్పాట్లు చేసింది. కళాకారులు తెలంగాణ కళారూపాలను  ప్రదర్శిస్తున్నారు. సాయంత్రం 6:30 గంటల నుంచి సాంస్కృతిక కార్యక్రమాలు మొదలయ్యాయి. కార్నివాల్, లేజర్ షో, ఫుడ్, గేమింగ్ స్టాల్స్  జనాలకు ఆకట్టుకుంటున్నాయి. వానలో తడుస్తూ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్, సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షిస్తున్నారు. 8:50 నిమిషాల నుంచి పది నిమిషాల పాటు ట్యాంక్ బండ్ పై క్రాకర్స్ షో ప్రదర్శించారు. తెలంగాణకు సంబంధించిన ముఖ్యమైన హస్తకళలు, ప్రత్యేక ఉత్పత్తులు, వివిధ రకాల ఫుడ్ స్టాల్స్ ట్యాంక్ బండ్‌పై ఏర్పాటు చేశారు.  వేడుకలకు వస్తున్న వారికోసం 80కి పైగా ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేశారు.  రాత్రి 7.30 నిమిషాలకు లేజర్ షోను అద్భుతంగా నిర్వహించారు.

70నిమిషాల నృత్య ప్రదర్శన
వేదికపై 70 నిమిషాల పాటు కళాకారులు వివిధ సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు ప్రదర్శించారు. స్టేజ్​ షో అనంతరం జాతీయ జెండాలతో ట్యాంక్​బండ్‌ పై ఆ చివర నుంచి ఈ చివర వరకు భారీ ఫ్లాగ్​వాక్ నిర్వహించనున్నారు.​ ఈ వాక్ లో సుమారు ఐదు వేల మంది పాల్గొన్నారు.  ఫ్లాగ్‌వాక్​ జరుగుతున్నంత సేపు జయ జయహే తెలంగాణ ఫుల్​వర్షన్ గీతం ఆలపించనున్నారు. ఈ వేదికపై సీఎం రేవంత్‌రెడ్డి.. కవి అందెశ్రీ, సంగీత దర్శకుడు కీరవాణికి సన్మానం చేయనున్నారు.  

ట్రాఫిక్ డైవర్షన్
ట్యాంక్ బండ్ వైపునకు వెళ్లే వాహనాలను పోలీసులు దారి మళ్లించారు.  ట్యాంక్ బండ్ పై సుమారు 1.5 కిలోమీటరు పొడవున కళారూపాల ప్రదర్శన ఏర్పాటు చేశారు. 

టాప్ హెడ్ లైన్స్

BRS Leaders Kannepalli Visit: కన్నెపల్లి మోటార్లు వెంటనే ఆన్ చేయాలి.. లేకపోతే సీఎం ఇంటిని ముట్టడిస్తాం- బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
కన్నెపల్లి మోటార్లు వెంటనే ఆన్ చేయాలి.. లేకపోతే సీఎం ఇంటిని ముట్టడిస్తాం- బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
TGPSC AEE ఎగ్జామ్ వాయిదా వేయండి: సీఎం రేవంత్‌కు హరీష్ రావు లేఖ
TGPSC AEE ఎగ్జామ్ వాయిదా వేయండి: సీఎం రేవంత్‌కు హరీష్ రావు లేఖ
బీఆర్ఎస్ ఎల్‌నీనో వ్యాఖ్యలపై కాంగ్రెస్ కౌంటర్.. KCR ఫాంహౌస్‌లో అద్భుత దీపం ఉందా? అంటూ విమర్శలు
బీఆర్ఎస్ ఎల్‌నీనో వ్యాఖ్యలపై కాంగ్రెస్ కౌంటర్.. KCR ఫాంహౌస్‌లో అద్భుత దీపం ఉందా? అంటూ విమర్శలు
Hyderabad Crime News: మహిళల వాష్‌రూమ్‌లో రహస్యంగా ఫోన్, వీడియోలు రికార్డ్.. కవాడిగూడ పవర్ గ్రిడ్‌ ఆఫీసులో కలకలం
మహిళల వాష్‌రూమ్‌లో రహస్యంగా ఫోన్, వీడియోలు రికార్డ్.. కవాడిగూడ పవర్ గ్రిడ్‌ ఆఫీసులో కలకలం

వీడియోలు

IND vs NZ 2nd T20 Match Preview | స్టార్ బ్యాటర్‌కు గాయం, తుది జట్టులో కీలక మార్పులు!
Amit Mishra about Virat | కోహ్లీ నన్ను మోసం చేశారు.. అమిత్ మిశ్రా సంచలన వ్యాఖ్యలు
World's First Mixed-Gender Cricket Tournament | ఒకే క్రికెట్ మ్యాచ్‌లో అమ్మాయిలు, అబ్బాయిలు
Harbhajan Singh Comments On Greg Chappell | గ్రేగ్ చాపెల్‌పై భజ్జీ తీవ్ర ఆరోపణలు
Arshdeep Singh Football-Style Run Out vs NZ | అర్ష్‌దీప్ సింగ్ కళ్లు చెదిరే రనౌట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
SEC Serious On Vidadala Raniji Incident: చిలకలూరిపేట ఘటనపై ఎస్‌ఈసీ సీరియస్.. ఎస్‌ఐ ప్రియాంకపై సస్పెన్షన్ వేటు.. విచారణకు ఆదేశం!
చిలకలూరిపేట ఘటనపై ఎస్‌ఈసీ సీరియస్.. ఎస్‌ఐ ప్రియాంకపై సస్పెన్షన్ వేటు.. విచారణకు ఆదేశం!
Telugu Duo Tilak ,Nitish Brilliance: ఓటమి కోరల్లోంచి టీమిండియాను గెలిపించిన‌ తెలుగు కుర్రాళ్ళు.. కివీస్ గడ్డపై తిలక్ , నితీష్  మెరుపు ఛేజింగ్
ఓటమి కోరల్లోంచి టీమిండియాను గెలిపించిన‌ తెలుగు కుర్రాళ్ళు.. కివీస్ గడ్డపై తిలక్ , నితీష్  మెరుపు ఛేజింగ్
Sonia Gandhi Rajiv Love Story: రాజీవ్ గాంధీతో లవ్ స్టోరీ అలా మొదలైంది.. సోనియా గాంధీ స్వయంగా చెప్పిన కథ
రాజీవ్ గాంధీతో లవ్ స్టోరీ అలా మొదలైంది.. సోనియా గాంధీ స్వయంగా చెప్పిన కథ
బీఆర్ఎస్ ఎల్‌నీనో వ్యాఖ్యలపై కాంగ్రెస్ కౌంటర్.. KCR ఫాంహౌస్‌లో అద్భుత దీపం ఉందా? అంటూ విమర్శలు
బీఆర్ఎస్ ఎల్‌నీనో వ్యాఖ్యలపై కాంగ్రెస్ కౌంటర్.. KCR ఫాంహౌస్‌లో అద్భుత దీపం ఉందా? అంటూ విమర్శలు
AP Local Body Elections: ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు రికార్డు నామినేషన్లు.. జగన్ ఆరోపణలకు ప్రభుత్వం కౌంటర్!
ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు రికార్డు నామినేషన్లు.. జగన్ ఆరోపణలకు ప్రభుత్వం కౌంటర్!
Piyush Goyal: పర్యావరణాన్ని నాశనం చేసింది మీరే.. యూరప్ నేతలకు క్లైమేట్ క్లాస్ పీకిన పీయూష్ గోయల్!
పర్యావరణాన్ని నాశనం చేసింది మీరే.. యూరప్ నేతలకు క్లైమేట్ క్లాస్ పీకిన పీయూష్ గోయల్!
Fauzi Chandrabose : 'ఫౌజీ'లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ - పాత్రలో ఒదిగిపోయిన నటుడు... బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా?
'ఫౌజీ'లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ - పాత్రలో ఒదిగిపోయిన నటుడు... బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా?
US Iran Tensions: ఇరాన్‌పై మరో ఎపిక్ ఫ్యూరీకి కాలుదువ్వుతున్న ట్రంప్.. ఇంటర్నెట్ కేబుళ్లను కత్తిరిస్తామని ఇరాన్ హెచ్చరిక
ఇరాన్‌పై మరో ఎపిక్ ఫ్యూరీకి కాలుదువ్వుతున్న ట్రంప్.. ఇంటర్నెట్ కేబుళ్లను కత్తిరిస్తామని ఇరాన్ హెచ్చరిక
Embed widget