తెలంగాణలో మే 13న 17లోక్ సభ స్థానాలకు ఒక అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి. డిసెంబర్‌లో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కచ్చితంగా మెజార్టీ సీట్లు సాధించి తెలంగాణలో బల నిరూపణ చేసుకోవాలని బీజేపీ ప్రచారం చేసింది. అధికారం కోల్పోయిన బీఆర్‌ఎస్ కూడా లైఫ్ అండ్ డెత్ అన్నట్టు పోరాడింది. త్రిముఖ పోరులో తెలంగాణ ఓటర్లు ఎటు మొగ్గారో ఏబీపీ సీఓటర్ ఎగ్జిట్ పోల్ ఓ అంచనా వేసింది. తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ 7 నుంచి 9 స్థానాలు కైవశం చేసుకుంటుందని తేల్చింది తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ కూడా 7 నుంచి 9 మధ్య ఎంపీ సీట్లు గెల్చుకోనుంది. తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఘోరంగా విఫలం కానుందని సర్వే చెబుతోంది. తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఘోరంగా విఫలం కానుందని సర్వే చెబుతోంది.