ఏపీ లోక్‌సభలో ఎవరు గెలవచ్చనే సర్వే ఫలితాలను ఏబీపీ సీ ఓటర్ నిర్వహించింది. మే 13న జరిగిన పోలింగ్ రోజున ఓటర్లను అడిగి తెలుసుకుంది. ఆ ఫలితాలను ఏడో దశ పోలింగ్ ముగిసిన తర్వాత ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 25 లోక్ సభ స్థానాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఒంటరిగా 25 ఎంపీ స్థానాల్లో పోటీ చేసింది. ఏపీ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి కూటమిగా పోటీ చేశాయి. ఏపీ ఎన్నికల్లో టీడీపీ 17 స్థానాల్లో పోటీ చేస్తే బీజేపీ ఆరు స్థానాల్లో జనసేన రెండు స్థానాల్లో పోటీ చేశాయి. ఏబీపీ సీ ఓటర్ సర్వే నిర్వహించి ఎగ్జిట్ పోల్‌లో కూటమికి ఎక్కువ సీట్లు వస్తున్నట్టు అంచనా ఏపీలో ఎన్డీఏ కూటమికి 21 నుంచి 25 స్థానాలు వస్తున్నట్టు సర్వేలో తేలింది. ఏపీలో వైసీపీకి నాలుగు సీట్లు వస్తే రావచ్చు లేకుంటే లేదని అంచనా వేసింది. కాంగ్రెస్‌కు 3.3 ఓటు శాతం మాత్రమే వస్తుందని సర్వే తేల్చింది.