By: ABP Desam | Updated at : 15 Mar 2022 05:34 PM (IST)
ప్రభుత్వంపై మండిపడ్డ బీజేపీ ఎమ్మెల్యేలు
హైకోర్టు చెప్పినప్పటికీ సభలోకి తమను అనుమతించకపోవడంపై బీజేపీ ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రాజాసింగ్, రఘునందన్‌రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పీకర్ ఏకపక్షంగా వ్యవహరించారని మండిపడ్డారు. బడ్జెట్ సందర్భంగా తాము ఎలాంటి ఆటంకం కలిగించలేదన్న నేతలు.. ఎందుకు సస్పెండ్ చేశారో అర్థం కాలేదన్నారు.
ఇందిరా పార్క్ వద్ద దీక్ష
ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఈ నెల 17 న ఇందిరా పార్క్ వద్ద రాజ్యాంగ పరిరక్షణ దీక్ష చేస్తామన్నారు బీజేపీ శాసనసభ్యులు. తెలంగాణ బీజేపీ కార్యాలయంలో ప్రెస్‌మీట్ పెట్టిన ఎమ్మెల్యేలు రాజసింగ్, ఈటల రాజేందర్, రఘునందన్ రావు.. ప్రభుత్వం తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అసెంబ్లీలో ఎలాంటి ఆందోళన చేయకపోయినా తమ ముగ్గుర్ని సస్పెండ్ చేశారని.. ఇదే విషయాన్ని స్పీకర్‌కు చెప్పినా పట్టించుకోలేదన్నారు.
కోర్టు సూచన కూడా పట్టించుకోలేదు
అసెంబ్లీ సస్పెన్షన్ వ్యవహారం లో కోర్టు ఆదేశాలతో స్పీకర్ ను కలిసేందుకు అసెంబ్లీ సెక్రెటరీ ఛాంబర్లో వేచి ఉన్న #RRR
— 🅼🅱🅺 (@MBK5BJP) March 15, 2022
ప్రజా సమస్యల పై పోరాడుతున్నా #BJP MLA ల సస్పెన్షన్ ని ఎత్తి వేసి ప్రశ్నించే గొంతులకి న్యాయం చేస్తారని ఆశిద్దాం.@Eatala_Rajender @RaghunandanraoM @TigerRajaSingh pic.twitter.com/Hyd5PgjC4i
దేశంలో, రాష్ట్రంలో ఉన్న రాజకీయ పదవులు, బాధ్యతలు అన్నీ అంబేడ్కర్ అందించిన ఫలాలే అన్న ఈటల రాజేందర్ ఆ పదవులు అడ్డుపెట్టుకొని అడ్డగోలుగా వ్యవహారిస్తున్నప్పుడు కోర్టులు జోక్యం చేసుకుంటాయన్నారు. తమ విషయంలో కూడా స్పీకర్ చైర్ కి విలువ ఇస్తూ కోర్టు సూచన చేసిందన్నారు. కానీ ఆ స్పూర్తిని తుంగలో తొక్కారని మండిపడ్డారు. స్పీకర్ తన గౌరవాన్ని నిలుపుకోలేకపోయారని విమర్శించారు.
నిరంకుశ ధోరణి
స్పీకర్, ప్రభుత్వం అనుసరించే ఈ పద్దతి నిరంకుశత్వానికి దారి తీస్తుందన్నారు మాజీ మంత్రి ఈటల. తాను పాతికేళ్లలో చాలా మంది స్పీకర్లను, సీఎంలను చూశానన్న రాజేందర్... ఇలాంటి నిరంకుశ ధోరణి ఎప్పుడూ చూడలేదన్నారు. 2008 నుంచి 2014 వరకు శాసన సభ పక్ష నేతగా ఉండి గౌరవం తీసుకొచ్చానని గుర్తు చేశారు. తమ సస్పెన్షన్ పై సభ అభిప్రాయం మళ్లీ తెలుసుకోమని కోరినా స్పీకర్ స్పందించలేదని ఆరోపించారు.
నార్త్ కొరియా గుర్తుకు వస్తుంది
తెలంగాణలో ప్రభుత్వం చేపట్టే విధానాలు చూస్తే నార్త్ కొరియా గుర్తు వస్తుందని ఘాటు విమర్శలు చేశారు రాజేందర్. అక్కడ రాజు మాట్లాడుతూ ఉన్నప్పుడు చప్పట్లు కొట్టలేదని ఒక సభ్యున్ని కాల్చి చంపారని.. ఇక్కడ కూడాలా అలాంటి సీన్స్ చూస్తున్నామన్నారు. ఆస్ట్రియా బృందం అసెంబ్లీ వ్యవహారాలు పరిశీలిస్తున్న టైంలో బీజేపీ లీడర్ల సస్పెన్షన్ దురదృష్టకర సంఘటనగా
అభివర్ణించారు.
ఉద్యమ ద్రోహులతో
భవిష్యత్‌లో చప్పట్లు కొట్టలేదని కూడా సస్పెండ్ చేసే అవకాశం ఉందని ఈటల ఎద్దేవా చేశారు. ఉద్యమ నాయకుణ్ని ఉద్యమాన్ని తూలనాడిన వారితో సస్పెండ్ చేయించి మరింత అవమానపరిచారన్నారు. సీఎం కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేసినట్టు ఉందన్నారు. రాజ్యాంగాన్ని మార్చాలి అని సీఎం కోరడం ఇందుకేనేనో అనిపిస్తోందన్నారు. చైనాలో ప్రభుత్వాన్ని ఎవరైనా విమర్శిస్తే వాళ్లు మాయమయ్యేవారని కేసిఆర్ చెప్పేవారని... ఇక్కడ కూడా అలాంటివి చేద్దాం అనుకున్నట్టున్నారని మండిపడ్డారు.అంబేడ్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి తానే చక్రవర్తి, తానే రాజులాగా పాలన చేస్తారేమో అని ఆందోళన వ్యక్తం చేశారు.
మూల్యం చెల్లించుకోక తప్పదు
కేసీఆర్ చేస్తున్నదానికి మూల్యం చెల్లించుకోక తప్పని హెచ్చరించారు ఈటల రాజేందర్. అంతిమ న్యాయనిర్ణేతలు ప్రజలేనని వాళ్లే బుద్ది చెబుతారన్నారు. అహంకారాన్ని పూడ్చిపెట్టే రోజులు దగ్గరే ఉన్నాయని వార్నింగ్ ఇచ్చారు.సిగ్గుతో తల దించుకునే పరిస్థితి కేసిఆర్ తీసుకువచ్చారన్నారు. ఇవన్నీ ప్రజానీకం గుండెలో పెట్టుకొని సరైన సమయంలో కర్రుకాల్చి వాతపెడతారని అభిప్రాయపడ్డారు.
నవ్వుకునే రోజు వస్తుంది
హైకోర్టు ఉత్తర్వులు, తమ అభ్యర్థన పూర్తిగా పరిశీలించిన తరువాత తిరస్కరిస్తున్నట్టు స్పీకర్ చెప్పారని.. అయితే సభలో చర్చ జరిపి నిర్ణయం తీసుకోవాలని కోరినా వినిపించుకోలేదన్నారు మరో ఎమ్మెల్యే రఘునందన్‌రావు. చాలా దురదృష్టకరం, ప్రజాస్వామ్య చరిత్రలో నల్ల రోజు. స్పీకర్ ఉదేశపూరకంగానే మౌనంగా వ్యవహరించారని మండిపడ్డారు. తనకు వచ్చిన డైరెక్షన్ మేరకే పని చేస్తున్నారన్నారు. కచ్చితంగా మిమ్మల్ని చూసి నవ్వుకునే రోజు వస్తుందని నాడు వాజ్‌పేయీ చెప్పిన మాటలు గుర్తు చేశారు రఘునందన్.
Rains in AP Telangana: తీవ్ర వాయుగుండం - నేడు ఆ జిల్లాల్లో భారీ వర్షాలు, ఎల్లో అలర్ట్ జారీ చేసిన IMD
తెలంగాణ బీజేపీకి మరింత సినీ జోష్- పార్టీలో చేరనున్న జయసుధ!
అనూప్, కళ్యాణ్ మాలిక్, మిక్కీ జే మేయర్‌కు సంగీత దర్శకుడు థమన్ ఛాలెంజ్!
Nature Index Rank: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీనే నెంబర్ వన్ - నేచర్ ఇండెక్స్ ర్యాంకులో టాప్
Mlc Kavita : పెద్దలకు రూ.10 లక్షల కోట్ల రుణమాఫీ, పేదలకు మాత్రం పింఛన్ ఇవ్వకూడదా? - ఎమ్మెల్సీ కవిత
Liger Team At Mumbai : వాళ్ళిద్దరి బాండింగ్ అలాంటిది - ముంబైలో లవ్లీ 'లైగర్' జోడీ
Harsha Kumar Son Case : యువతితో అసభ్య ప్రవర్తన, మాజీ ఎంపీ హర్ష కుమార్ కుమారుడిపై కేసు నమోదు
Mahesh Babu: ఆ మహేష్ బాబును మళ్లీ చూడలేమా? ఈ ప్రయోగాలు మరే హీరో చేయలేడు!
Tirumala News : శ్రీవారి భక్తులకు టీటీడీ అలర్ట్, తిరుమల యాత్ర వాయిదా వేసుకోవాలని విజ్ఞప్తి