News
News
X

YS Avinash Reddy: నేడు రెండోసారి సీబీఐ విచారణకు అవినాష్ రెడ్డి, కీలక పరిణామం జరిగే అవకాశం!

వివేకానంద రెడ్డి హత్య కేసులో మధ్యాహ్నం మూడు గంటలకు హైదరాబాద్ లోని సీబీఐ కార్యాలయంలో అవినాష్ రెడ్డి విచారణ హాజరుకానున్నారు. 

FOLLOW US: 
Share:

మాజీ ఎంపీ, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నేడు సీబీఐ విచారణకు ఎంపీ అవినాష్ రెడ్డి హాజరు కానున్నారు. ఈ కేసు విచారణ తెలంగాణకు బదిలీ అయ్యాక కేంద్ర దర్యాప్తు సంస్థ అధికారులు అవినాష్ రెడ్డిని నేడు రెండోసారి విచారణ చేయబోతున్నారు. వివేకానంద రెడ్డి హత్య కేసులో మధ్యాహ్నం మూడు గంటలకు హైదరాబాద్ లోని సీబీఐ కార్యాలయంలో అవినాష్ రెడ్డి విచారణ హాజరుకానున్నారు. 

వివేకానంద రెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డి పాత్ర కీలకంగా ఉందని సీబీఐ భావిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో A2 గా ఉన్న నిందితుడు సునీల్ యాదవ్ బెయిల్ పిటిషన్ విచారణ సమయంలో సీబీఐ వేసిన కౌంటర్ పిటిషన్‌లో ఈ సంచలన విషయాలు వెల్లడించింది. హత్య జరిగిన రోజు నిందితులంతా భాస్కర్ రెడ్డి ఇంట్లో ఉన్నట్లు గుర్తించామని కౌంటర్ పిటిషన్‌లో సీబీఐ పేర్కొంది. ఫోరెన్సిక్ రిపోర్ట్ లో కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసిందని అందులో వివరించారు. 

హత్య కుట్ర మొత్తం అవినాష్ కి ముందే తెలుసు అని సీబీఐ పేర్కొంది. ఘటనా స్థలంలో సాక్షాలను, ఆధారాలను చెరిపివేయడంలో అవినాష్ పాత్ర ఉందని సీబీఐ తెలిపింది. అవినాష్ రెడ్డి తో పాటు తండ్రి భాస్కర్ రెడ్డి ప్రమేయానికి సంబంధించి సీబీఐ ఓ అంచనాకు వచ్చింది. నేడు విచారణ ముగిసిన తర్వాత కీలక పరిణామం చోటుచేసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. హత్య కోసం 40 కోట్ల డీల్ వ్యవహారంపై నేడు అవినాష్ ను సీబీఐ సుదీర్ఘంగా ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది.

సీబీఐ దాఖలు చేసిన కౌంటర్ పిటిషన్‌లో ఏముందంటే.. 

View Pdf

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాబాయి అయిన వైఎస్‌ వివేకానంద రెడ్డిని అవినాశ్‌ రెడ్డే చంపించారని, అందుకు సాక్ష్యాలన్నీ ఉన్నాయని కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) తేల్చి చెప్పింది. వివేకానంద రెడ్డి హత్య విషయంలో నేరుగా పాల్గొన్న యాదాటి సునీల్‌ యాదవ్‌ (A2) బెయిల్‌ పిటిషన్ కు కౌంటర్ గా తెలంగాణ హైకోర్టులో సీబీఐ పిటిషన్‌ వేసింది. ఈ పిటిషన్ లో ఎన్నో సంచలన విషయాలను దర్యాప్తు సంస్థ బహిర్గతం చేసింది. తమ విచారణలో భాగంగా తేలిన విషయాలను సీబీఐ ఆ పిటిషన్‌లో వివరించింది. హత్యకు సంబంధించి రూ.40 కోట్లతో ఒప్పందం కుదరడంలో సునీల్ యాదవ్ కీలకంగా వ్యవహరించాడని తెలిపింది.

సీబీఐ వెల్లడించిన వివరాల ప్రకారం.. వివేకానందరెడ్డిని అవినాశ్‌ రెడ్డి అడ్డు తొలగించుకోవాలని అనుకోవడానికి, తన ఎంపీ సీటుకు అడ్డు రావడమే కారణమని సీబీఐ పేర్కొంది! వైఎస్ వివేకాను చంపేందుకు దేవిరెడ్డి శివశంకర్‌ రెడ్డి (A5)తో కలిసి అవినాశ్‌ రెడ్డి, ఆయన తండ్రి వైఎస్‌ భాస్కర్‌ రెడ్డి కుట్ర పన్నారని వివరించింది. ఆ ప్లానును దేవిరెడ్డి శివశంకర్‌ రెడ్డి అమలు చేశారని తేలిందని వెల్లడించారు. ఆ సమయంలో వివేకానందరెడ్డితో విభేదిస్తున్నవారిని ఏకతాటిపైకి తెచ్చారని వివరించింది.

అలా సన్నిహితంగా ఉంటున్నా ఆయనపై కోపం ఉన్న ఎర్ర గంగిరెడ్డి (A1), వివిధ కారణాలతో వివేకాపై ఆగ్రహంగా ఉన్న యాదాటి సునీల్‌ యాదవ్‌ (A2), డ్రైవర్‌ షేక్‌ దస్తగిరి (A4 - అప్రూవర్‌), ఉమా శంకర్‌ రెడ్డిలను కూడగట్టి, వీరితోనే ప్రత్యక్షంగా హత్యలో పాల్గొనేలా చేశారని సీబీఐ వెల్లడించింది. వజ్రాల పేరుతో సునీల్ యాదవ్ విలువైన రాళ్ల వ్యాపారం చేసేవాడని, వద్దని వివేకానంద రెడ్డి హెచ్చరించడంతో ఆయనపై సునీల్ కోపం పెంచుకున్నాడని పేర్కొంది. గంగిరెడ్డితో కలిసి వివేకా హత్యకు ప్లాన్ చేశారని కౌంటర్‌ పిటిషన్ లో తెలిపింది. హత్యకు సంబంధించి రూ.40 కోట్లతో ఒప్పందం కుదరడంలో సునీల్ యాదవ్ కీలకంగా వ్యవహరించాడని సీబీఐ తెలిపింది. 

హత్యకు ముందు నిందితులందరూ అవినాష్ రెడ్డి ఇంట్లోనే

వివేకానంద రెడ్డిని హత్య చేసిన రోజు నిందితులందరూ వైఎస్ భాస్కర్ రెడ్డి ఇంట్లోనే ఉన్నట్లుగా సీబీఐ తన కౌంటర్‌లో తెలిపింది. వివేకా హత్యకు కదిరి నుంచి గొడ్డలి తీసుకురావడానికి వెళ్లిన దస్తగిరి రాక కోసమే సునీల్‌యాదవ్‌ అవినాష్‌ రెడ్డి ఇంట్లో ఎదురు చూస్తున్నట్లు తేలిందని తెలిపింది. వివేకా హత్య ఘటన వెలుగులోకి రావడానికి కొంత సమయం ముందు (2019 మార్చి 15 తెల్లవారుజామున) నిందితులు శివశంకర్‌రెడ్డి, ఉమాశంకర్‌రెడ్డి తదితరులు అవినాష్‌రెడ్డి ఇంట్లో ఉన్నారని పేర్కొంది.

View Pdf

Published at : 24 Feb 2023 08:17 AM (IST) Tags: CBI Enquiry Kadapa MP MP Avinash Reddy Vivekananda reddy Murder Case

సంబంధిత కథనాలు

Teenmar Mallanna Arrest: తీన్మార్ మల్లన్న అరెస్ట్, క్యూ న్యూస్ ఆఫీసులో పలు డివైజ్ లు సీజ్ - బండి సంజయ్ మండిపాటు

Teenmar Mallanna Arrest: తీన్మార్ మల్లన్న అరెస్ట్, క్యూ న్యూస్ ఆఫీసులో పలు డివైజ్ లు సీజ్ - బండి సంజయ్ మండిపాటు

Ambedkar Statue: 125 అడుగుల భారీ అంబేద్కర్ విగ్రహ పనులు వేగవంతం, ఏప్రిల్ 10 డెడ్ లైన్

Ambedkar Statue: 125 అడుగుల భారీ అంబేద్కర్ విగ్రహ పనులు వేగవంతం, ఏప్రిల్ 10 డెడ్ లైన్

Kavitha ED Enquiry: ముగిసిన కవిత ఈడీ విచారణ, మూడోసారి సుదీర్ఘంగా ప్రశ్నించిన అధికారులు - 22న విచారణ లేదు

Kavitha ED Enquiry: ముగిసిన కవిత ఈడీ విచారణ, మూడోసారి సుదీర్ఘంగా ప్రశ్నించిన అధికారులు - 22న విచారణ లేదు

1,540 ఆశా వ‌ర్క‌ర్ల పోస్టుల భ‌ర్తీకి ప్ర‌భుత్వం అనుమ‌తి, వివరాలు ఇలా!

1,540 ఆశా వ‌ర్క‌ర్ల పోస్టుల భ‌ర్తీకి ప్ర‌భుత్వం అనుమ‌తి, వివరాలు ఇలా!

TSPSC : పేపర్ లీకేజీ కేసు సీబీఐ కి వెళ్తుందా ? ఎవరేం వాదించారంటే ?

TSPSC :  పేపర్ లీకేజీ కేసు సీబీఐ కి వెళ్తుందా ? ఎవరేం వాదించారంటే ?

టాప్ స్టోరీస్

Happy Ugadi Wishes in Telugu 2023:మీ బంధుమిత్రులకు ఈ కొటేషన్స్ తో శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేయండి

Happy Ugadi Wishes in Telugu 2023:మీ బంధుమిత్రులకు ఈ కొటేషన్స్ తో శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేయండి

Rangamarthanda Movie Review - 'రంగమార్తాండ' రివ్యూ : ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం హీరోలుగా కృష్ణవంశీ తీసిన సినిమా

Rangamarthanda Movie Review - 'రంగమార్తాండ' రివ్యూ : ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం హీరోలుగా కృష్ణవంశీ తీసిన సినిమా

Ugadi Recipes: ఉగాదికి సింపుల్‌గా చేసే నైవేద్యాలు ఇవిగో, రుచి అదిరిపోతుంది

Ugadi Recipes: ఉగాదికి సింపుల్‌గా చేసే  నైవేద్యాలు ఇవిగో, రుచి అదిరిపోతుంది

Roja Fires on TDP Party: శవాల నోట్లో తులసి తీర్థం పోసినట్లు - టీడీపీ సంబరాలపై మంత్రి రోజా ఘాటు వ్యాఖ్యలు

Roja Fires on TDP Party: శవాల నోట్లో తులసి తీర్థం పోసినట్లు - టీడీపీ సంబరాలపై మంత్రి రోజా ఘాటు వ్యాఖ్యలు