News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Uppal BRS: ఉప్పల్‌లో టికెట్ పంచాయితీ! ఎమ్మెల్సీ కవిత వద్దకు ఇద్దరు నేతలు, ఆయనకు టికెట్ ఇవ్వొద్దని రిక్వెస్ట్

ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి, బొంతు రామ్మోహన్ తామిద్దరిలో ఒకరికి టికెట్ ఇచ్చేలా చూడాలని ఎమ్మెల్సీ కవితను కోరారు.

FOLLOW US: 
Share:

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం బీఆర్ఎస్ అధిష్ఠానం ఎమ్మెల్యే అభ్యర్థుల పేర్లు ఖరారు ఖరారు చేసి జాబితా విడుదల చేయనున్న వేళ రాజకీయాలు ఊపందుకుంటున్నాయి. టికెట్ ఫలానా వారికి ఇవ్వబోతున్నారనే వదంతుల నేపథ్యంలో గతంలో బేదాభిప్రాయాలు ఉన్నవారు కలిసిపోతున్నారు. తాజాగా ఉప్పల్ నియోజకవర్గంలో ఇలాంటి పరిణామమే జరిగింది. ఉప్పల్‌లో బి.లక్ష్మా రెడ్డికి బీఆర్ఎస్ టికెట్ ఇస్తారనే ఊహాగానాలు బలంగా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో స్థానిక నేతలు, ప్రస్తుత ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ ఒక్కటయ్యారు. వీరిద్దరూ కలిసి ఎమ్మెల్సీ కవితను కలిశారు.

ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి, బొంతు రామ్మోహన్ తామిద్దరిలో ఒకరికి టికెట్ ఇచ్చేలా చూడాలని ఎమ్మెల్సీ కవితను కోరారు. వేరే వారికి టికెట్ ఇవ్వవద్దని కోరారు. అయితే, ఈ విషయాన్ని తాను అధిష్ఠానానికి తీసుకెళ్తానని కవిత హామీ ఇచ్చినట్లుగా సమాచారం. 

ఆగస్టు 21న సోమవారం స్వయంగా సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ వేదికగా అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తారని సమాచారం ఉన్న సంగతి తెలిసిందే. తొలి జాబితాలో భాగంగా 80 మంది వరకూ ఎమ్మెల్యే అభ్యర్థుల పేర్లు ప్రకటించే అవకాశం ఉంది. దీంతో కొంత మంది సిట్టింగుల్లో ఆందోళన నెలకొంది. వీరిలో ఉప్పల్ సిట్టింగ్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డిని మార్చాలని బీఆర్ఎస్ అధిష్ఠానం ఆలోచిస్తున్నట్లుగా సమాచారం.

ఉప్పల్ లో సిట్టింగ్‌ ఎమ్మెల్యేకు టికెట్‌ ఇస్తే ఓటమి తప్పదని అభిప్రాయాలు రావడంతో మార్చాలని అధిష్ఠానం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇదే నియోజకవర్గంలో బీఆర్ఎస్ సీనియర్‌ నాయకుడు బండారి లక్ష్మా రెడ్డి ఈసారి ఎమ్మెల్యే టికెట్‌ తనకే వస్తుందని ధీమాగా ఉన్నారు. ప్రతి రోజు వివిధ కాలనీల్లో సందర్శిస్తూ వారి మద్దతును కూడగట్టుకుంటున్నారు.

ఒక్కోసారి ఒక్కొక్కరు గెలుపు

2009లో ఏర్పడిన ఉప్పల్ నియోజకవర్గంలో ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీ అభ్యర్థి కూడా వరుసగా గెలవలేదు. 2009లో తొలిసారి కాంగ్రెస్ అభ్యర్థి బండారి రాజిరెడ్డి విజయం సాధించగా, 2014 లో బీజేపీ అభ్యర్థి ఎన్‌వీఎస్ఎస్ ప్రభాకర్ గెలిచారు. 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి భేతి సుభాష్ రెడ్డి ఎమ్మెల్యే అయ్యారు. వచ్చే ఎన్నికల్లో ఉప్పల్ బరిలో దిగేందుకు సిట్టింగ్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డితో పాటు జీహెచ్‌ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, మాజీ ఎమ్మెల్యే బండారి రాజిరెడ్డి సోదరుడు బి. లక్ష్మా రెడ్డి, జీహెచ్‌ఎంసీ డిప్యుటీ మేయర్ భర్త మోతె శోభన్ రెడ్డి కూడా పోటీలో ఉన్నారు.

Published at : 20 Aug 2023 12:37 PM (IST) Tags: MLC Kavitha Bonthu Rammohan Uppal BRS News MLA bethi subhash reddy

ఇవి కూడా చూడండి

CPGET Seat Allotment: సెప్టెంబరు 29న సీపీగెట్‌ సీట్ల కేటాయింపు, ఈ తేదీలోగా జాయిన్ అవ్వాల్సిందే!

CPGET Seat Allotment: సెప్టెంబరు 29న సీపీగెట్‌ సీట్ల కేటాయింపు, ఈ తేదీలోగా జాయిన్ అవ్వాల్సిందే!

TSPSC: 'గ్రూప్‌-1' పరీక్షలో అవకతవకలు జరగలేదు, టీఎస్‌పీఎస్సీ వివరణ

TSPSC: 'గ్రూప్‌-1' పరీక్షలో అవకతవకలు జరగలేదు, టీఎస్‌పీఎస్సీ వివరణ

Rain In Hyderabad: హైదరాబాద్‌లో వర్షం - చిరుజల్లుల మధ్యే కొనసాగుతున్న నిమజ్జనం

Rain In Hyderabad: హైదరాబాద్‌లో వర్షం - చిరుజల్లుల మధ్యే కొనసాగుతున్న నిమజ్జనం

Khairatabad Ganesh Immersion: గంగమ్మ ఒడికి చేరిన ఖైరతాబాద్ వినాయకుడు - అర్ధరాత్రి ఆఖరి పూజ, వేకువజాము నుంచి యాత్ర

Khairatabad Ganesh Immersion: గంగమ్మ ఒడికి చేరిన ఖైరతాబాద్ వినాయకుడు - అర్ధరాత్రి ఆఖరి పూజ, వేకువజాము నుంచి యాత్ర

Hyderabad Ganesh Laddu Auction 2023: కోటి 26 లక్షలు పలికిన గణేష్ లడ్డూ, బాలాపూర్‌ రికార్డు బ్రేక్‌, ఎక్కడో కాదండోయ్ మన హైదరాబాదులోనే!

Hyderabad Ganesh Laddu Auction 2023: కోటి 26 లక్షలు పలికిన గణేష్ లడ్డూ, బాలాపూర్‌ రికార్డు బ్రేక్‌, ఎక్కడో కాదండోయ్ మన హైదరాబాదులోనే!

టాప్ స్టోరీస్

Byreddy Rajasekar Reddy: భువనేశ్వరితో బైరెడ్డి భేటీ - చంద్రబాబు అరెస్టుపై కీలక వ్యాఖ్యలు

Byreddy Rajasekar Reddy: భువనేశ్వరితో బైరెడ్డి భేటీ - చంద్రబాబు అరెస్టుపై కీలక వ్యాఖ్యలు

Accident Policy: మీరిచ్చే ఒక్క రూపాయితో ఓ పేద కుటుంబానికి రూ.10 లక్షల ఇన్సూరెన్స్‌ - దానం ఇలా కూడా చేయొచ్చు

Accident Policy: మీరిచ్చే ఒక్క రూపాయితో ఓ పేద కుటుంబానికి రూ.10 లక్షల ఇన్సూరెన్స్‌ - దానం ఇలా కూడా చేయొచ్చు

Mynampally Hanumantha Rao: కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న మైనంపల్లి హనుమంతరావు, పార్టీ కండువా కప్పిన ఖర్గే

Mynampally Hanumantha Rao:  కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న మైనంపల్లి హనుమంతరావు, పార్టీ కండువా కప్పిన ఖర్గే

Telangana BJP : తెలంగాణ ఎన్నికల కోసం 26 మందితో కేంద్ర కమిటీ - ఏపీ సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డికి చోటు !

Telangana BJP : తెలంగాణ ఎన్నికల కోసం 26 మందితో కేంద్ర కమిటీ - ఏపీ సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డికి చోటు !