Hyderabad Metro fares: హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు షాక్ - కనీస చార్జీలు పెంపు - ఇవే కొత్త చార్జీల వివరాలు
Metro fares hike: హైదరాబాద్ మెట్రో చార్జీలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. కనీస టిక్కెట్ ధర 12 రూపాయలకు పెంచారు.

Hyderabad Metro fares hike: Hyderabad Metro fares hike: హైదరాబాద్ మెట్రో చార్జీలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. కనీస టిక్కెట్ ధర 12 రూపాయలకు పెంచారు. గరిష్ట ధర ఇప్పటి వరకూ 60 రూపాయలు ఉండేది. ఇక నుంచి 75 రూపాయలు ఉంటుంది. పెంపు నిర్ణయం 17వ తేదీ నుంచి అమల్లోకి వస్తుంది. 
పెంచిన చార్జీల వివరాలు:
- కనిష్ఠ ఛార్జ్:
- గతంలో: ₹10 (2 కి.మీ. వరకు)
- కొత్త ధర: ₹12
- గరిష్ఠ ఛార్జ్:
- గతంలో: ₹60 (26 కి.మీ.కి పైగా)
- కొత్త ధర: ₹75
2017లో మెట్రో ప్రారంభమైనప్పటి నుండి టిక్కెట్ రేట్లను పెంచలేదు. దాదాపు 6,500 కోట్లకు పైగా నష్టాలు వచ్చాయని ఎల్ అండ్ టీ చెబుతోంది. ఈ నష్టాలు కోవిడ్-19 మహమ్మారి సమయంలో మరింత ఎక్కువయ్యాయి. నిర్వహణ మరియు ఆపరేషనల్ ఖర్చులు పెరగడం వల్ల ఛార్జీల సవరణ అవసరమని మెట్రో రైల్ చాలా కాలంగా ప్రభుత్వాన్నికోరుతోంది. బెంగళూరు మెట్రోలో గరిష్ఠ ఛార్జ్ 90 ఉంది. ఢిల్లీలో కూడా ఛార్జీలుపెంచారు. 2017లో ఛార్జీలు పెంచలేదు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహాలక్ష్మి స్కీమ్ మెట్రో ప్రయాణికులను తగ్గించిందని భావిస్తున్నారు. ఈ స్కీమ్ వల్ల మహిళా ప్రయాణీకుల సంఖ్య తగ్గడం ఆదాయంపై ప్రభావం చూపిందని L&T అధికారి R శంకర్ రామన్ తెలిపారు.





















