అన్వేషించండి

VC Sajjanar: ఇదేం వెర్రి కామెడీ? ఇలాంటి పిచ్చిమాలోకాలపై చర్యలు తప్పవంటూ సజ్జనార్ ఆగ్రహం!

VC Sajjanar Post: టీఎస్ఆర్టీసీ సిబ్బందిని లక్ష్యంగా చేసుకుని కామెడీ చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు VC సజ్జనార్. అసలేం జరిగిందో ఆయన పోస్ట్ చేసిన వీడియో చూస్తే అర్థమవుతుంది

VC Sajjanar : TSRTC సిబ్బందిని లక్ష్యంగా చేసుకుని కామెడీ చేసేవారికి మాస్ వార్నింగ్ ఇచ్చారు VC సజ్జనార్. కామెడీ పేరుతో విధులకు ఆటంకం కలిగిస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. సోషల్ మీడియాలో వైరల్ అయ్యేందుకు కొందరు వ్యక్తులు చేసిన ఓ ప్రాంక్ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు సజ్జనార్. ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో కామెడీ పేరుతో సిబ్బంది విధులకు ఆటంకం కలిగించడాన్ని సహించేది లేదంటూ పోస్ట్ పెట్టారు. సజ్జనార్ పెట్టిన పోస్టులో ఏముందంటే...

ఇదేం వెర్రి కామెడీ.. 
సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు ఎన్ని పిచ్చివేషాలైన వేస్తారా .. మీ పాపులారిటీ కోసం నిబద్ధత, అంకితభావంతో విధులు నిర్వహిస్తున్న RTC ఉద్యోగులను ఇబ్బందులకు గురిచేస్తారా? పిచ్చి కామెడీ పేరుతో ఆర్టీసీ సిబ్బందికి విధులకు ఆటకం కలిగిస్తే #TGSRTC యాజమాన్యం ఉపేక్షించదు అని హెచ్చరించారు. ఇలాంటి సోషల్ మీడియా పిచ్చిమాలోకాలను విడిచిపెట్టేది లేదు.. పోలీస్ శాఖ సహకారంతో చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని పోస్ట్ లో రాసుకొచ్చారు.  ఓ బస్ కండక్టర్ తో ఓ యువకుడు ప్రాంక్ చేస్తున్న వీడియోను సజ్జనార్ పోస్ట్ చేశారు

సజ్జనార్ పోస్ట్ చేసిన వీడియోలో ఏముందంటే.. RTC బస్ మూవ్ అయ్యేందుకు రెడీగా ఉంది. హడావుడిగా ప్రయాణికులు బస్సెక్కుతున్నారు. ఆ సమయంలో ఎవరికి వారే ఈ బస్ అక్కడకు వెళుతుందా, ఇక్కడకు వెళుతుందా అంటూ వరుస ప్రశ్నలు ఎదుర్కొంటారు కండక్టర్లు. ఎందరు అడిగినా ఓపిగ్గా సమాధానం చెబుతారు. ఇలాంటి టైమ్ లో ఓ యువకుడు కండక్టర్ దగ్గరకు వెళ్లి ఈ బస్ గుంటూరు వెళుతుందా అని అడిగాడు. ఇది హైదరాబాద్ బస్ అని కండక్టర్ చెప్పగానే... కాలికి వేసుకున్న చెప్పు తీసి చెవి దగ్గర పెట్టుకుని పోన్ లా మాట్లాడుతూ...అరె ఈ బస్ గుంటూరు పోదంట ఇది అని మాట్లాడుకుంటూ వెనుతిరిగాడు. ఈ వీడియో పోస్ట్ చేశారు సజ్జనార్...

సోషల్ మీడియాలో వైరల్ అయిపోవాలన్న పిచ్చితో నేటి యువత చాలామంది కనీస జ్ఞానం లేకుండా వ్యవహరిస్తున్నారు. తమ సరదా తీరిపోతోందని ఆలోచిస్తున్నారు కానీ ఎంత వెగటు కామెడీ చేస్తున్నారన్నది ఆలోచించడం లేదు. అదే సమయంలో ఎదుటివారి మనోభావాలు దెబ్బతీసేలా ప్రవర్తిస్తున్నాం అనే విచక్షణ కూడా ఉండడం లేదు. తనవిధుల్లో తాను బిజీగా ఉన్న కండక్టర్ తో యువకుడు ప్రాంక్ చేసిన వీడియో చూస్తే ఈ విషయం అందరకీ అర్థమవుతుంది.  మీకు పనిలేదని విధినిర్వహణలో ఉన్నవారిని డిస్ట్రబ్ చేస్తారా బాధ్యత ఉండక్కర్లేదా? అందుకే ఈ వీడియో ఎక్స్ లో పోస్ట్ చేసిన సజ్జనార్ తన స్టైల్లో మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఇకపై ఇలాంటి ఘటనలు పునరావృతం అయితే చర్యలు గట్టిగా ఉంటాయని హెచ్చరించారు.

కాళేశ్వరం సరస్వతి నది పుష్కరాలకు వెళ్లేవారికోసం TSRTC ప్రత్యేక బస్సులు నడుపుతోంది...ఆ వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: కిలాడీల కమిటీ ఢిల్లీ వెళ్లి ఎన్డీఎస్‌ఏను ఒప్పించాలి - కాళేశ్వరంపై హరీష్ , కేటీఆర్, ఈటలకు రేవంత్ సవాల్
కిలాడీల కమిటీ ఢిల్లీ వెళ్లి ఎన్డీఎస్‌ఏను ఒప్పించాలి - కాళేశ్వరంపై హరీష్ , కేటీఆర్, ఈటలకు రేవంత్ సవాల్
Shabad Mass Killing News: ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
Breaking News: NDSA చెప్పింది పాటించి, నీళ్లు ఎత్తిపోయడం లేదు: రేవంత్ రెడ్డి
NDSA చెప్పింది పాటించి, నీళ్లు ఎత్తిపోయడం లేదు: రేవంత్ రెడ్డి
Vietnam Boat Accident: వాళ్లను తీసుకెళ్లింది మొబైల్ కంపెనీ - బాధ్యత వారిదేనా? మృతుల కుటుంబాలకు ఎంత పరిహారం ఇస్తారు?
వాళ్లను తీసుకెళ్లింది మొబైల్ కంపెనీ - బాధ్యత వారిదేనా? మృతుల కుటుంబాలకు ఎంత పరిహారం ఇస్తారు?

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Shabad Mass Killing News: ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
Vietnam Boat Accident: వాళ్లను తీసుకెళ్లింది మొబైల్ కంపెనీ - బాధ్యత వారిదేనా? మృతుల కుటుంబాలకు ఎంత పరిహారం ఇస్తారు?
వాళ్లను తీసుకెళ్లింది మొబైల్ కంపెనీ - బాధ్యత వారిదేనా? మృతుల కుటుంబాలకు ఎంత పరిహారం ఇస్తారు?
Indian Tourists Boat Tragedy: వియత్నాం బోటు ప్రమాదంలో తెలుగు వారు మృతి.. హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసిన భారత ఎంబసీ
వియత్నాం బోటు ప్రమాదంలో తెలుగు వారు మృతి.. హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసిన భారత ఎంబసీ
PDS Rice Smuggling: మంచిర్యాలలో యూపీ లారీ..రేషన్ మాఫియా గుట్టురట్టు! ఆదిలాబాద్‌లో డీలర్ల దందా ఛేదించిన పోలీసులు!
మంచిర్యాలలో యూపీ లారీ..రేషన్ మాఫియా గుట్టురట్టు! ఆదిలాబాద్‌లో డీలర్ల దందా ఛేదించిన పోలీసులు!
Pawan Kalyan Surgery: పవన్‌ కుడి భుజానికి చికిత్స పూర్తి- మూడున్నర గంటలపాటు సర్జరీ!
పవన్‌ కుడి భుజానికి చికిత్స పూర్తి- మూడున్నర గంటలపాటు సర్జరీ!
INS Mahendragiri:భారత నౌకాదళంలో చేరిన ఐఎన్ఎస్ మహేంద్రగిరి! ఈ యుద్ధనౌక ప్రత్యేకత ఏంటి? 
భారత నౌకాదళంలో చేరిన ఐఎన్ఎస్ మహేంద్రగిరి! ఈ యుద్ధనౌక ప్రత్యేకత ఏంటి? 
Rotator Cuff Injury: రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్ ఎలా అవుతాయి? సమస్య రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ?
రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్ ఎలా అవుతాయి? సమస్య రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ?
Malla Reddy Skips KTR Meeting:కేటీఆర్ అత్యవసర భేటీకి మల్లారెడ్డి డుమ్మా! గులాబీ గూటికి గుడ్‌బై చెప్పి కమలం వైపు అడుగులు?
కేటీఆర్ అత్యవసర భేటీకి మల్లారెడ్డి డుమ్మా! గులాబీ గూటికి గుడ్‌బై చెప్పి కమలం వైపు అడుగులు?
Embed widget