Saraswati Pushkaralu: ఏ రాష్ట్రం నుంచి అయినా కాళేశ్వరం ఈజీగా చేరుకోవచ్చు.. AP నుంచి ప్రత్యేక బస్సులు ఇవే!
Saraswati Pushkaralu sepcila buses from AP: తెలంగాణ రాష్ట్రం కాళేశ్వరంలో జరుగుతున్న సరస్వతి పుష్కరాలకు ఏపీ నుంచి ప్రత్యేక బస్సులు ఇవే.. ఇతర రాష్ట్రాల నుంచి ఇలా ఈజీగా చేరుకోవచ్చు...

Saraswati Pushkaralu Special: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం త్రివేణి సంగమ క్షేత్రంలో సరస్వతి పుష్కరాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ పుష్కరాలకు చేరుకోవాలి అనుకునే వివిధ రాష్ట్రాల భక్తులు ఈ మార్గాలను అనుసరించండి. ఏఫీ నుంచి ప్రత్యేక బస్సులున్నాయి..
మే 15న ప్రారంభమై మే 26 వరకూ జరిగే సరస్వతినది పుష్కరాలకోసం తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. దేవగురువు బృహస్పతి మిథున రాశిలో ప్రవేశించే సమయంలో సరస్వతి నదికి పుష్కరాలు వచ్చాయి. ఈ సమయంలో ముక్కోటి దేవతలు అంతర్వాహినిగా ప్రవహించే సరస్వతి నదిలో స్నానమాచరిస్తారు. ఈ సమయంలో పుష్కరస్నానం ఆచరిస్తే సకల పాపాలు తొలగిపోయి, సకల విద్యలు సిద్ధిస్తాయని భక్తుల నమ్మకం.
కాళేశ్వరం చేరుకునేందుకు తెలుగు రాష్ట్రాలతో పాటూ మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ నుంచి కూడా సులభంగా చేరుకునేందుకు రవాణా సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. ఇక ముందుగా కరీంనగర్ చేరుకుంటే అక్కడి నుంచి 133 కిలోమీటర్ల దూరంలో ఉంది కాళేశ్వరం. సుల్తానాబాద్, పెద్దపల్లి, గోదావరిఖని, ఇందారం క్రాస్ రోడ్డు, జైపూర్, చెన్నూరు, సిరోంచ మీదుగా కాళేశ్వరం చేరుకోవచ్చు..మరో మార్గంలో కరీంనగర్ నుంచి పెద్దపల్లి తర్వాత కాటారం, మహదేవ్‌పూర్ మీదుగా కాళేశ్వరం వెళ్లొచ్చు. ఈ మార్గంలో RTC బస్సులు అందుబాటులో ఉన్నాయి.
హైదరాబాద్ నుంచి కాళేశ్వరం 267 కిలోమీటర్లు. ORR, భువనగిరి, వరంగల్ బైపాస్ మీదుగా గూడెప్పాడ్ క్రాస్ రోడ్డు, పరకాల, భూపాలపల్లి, కాటారం, మహదేవ్‌పూర్ మీదుగా కాళేశ్వరం వెళ్లొచ్చు. పుష్కరాల కోసం ఆర్టీసీ హైదరాబాద్ నుంచి కాళేశ్వరానికి ప్రత్యేక బస్సులు నడుపుతోంది. ఈబస్సుల్లో వెళ్లలేనివారు హన్మకొండకు చేరుకుంటే అక్కడి నుంచి కాళేశ్వరానికి బస్సులున్నాయి.
హైదరాబాద్ నుంచి రైల్లో వెళ్లాలి అనుకుంటే కాజీపేటవరకూ వెళ్లి అక్కడి నుంచి రోడ్డుమార్గంలో కాళేశ్వరం వెళ్లొచ్చు.
ఆదిలాబాద్ నుంచి 227 కిలోమీటర్లు, మహారాష్ట్ర గడ్చిరోలి నుంచి 250 కిలోమీటర్లు, ఛత్తీస్‌గఢ్ బీజాపూర్ నుంచి 122 కిలోమీటర్లదూరంలో ఉంది కాళేశ్వరం.
ఖమ్మం నుంచి 225 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాళేశ్వరం చేరుకోవాలంటే మరిపెడ, వరంగల్, పరకాల, భూపాలపల్లి, మహదేవ్‌పూర్ మీదుగా చేరుకోవచ్చు. మరోమార్గంలో మహబూబ్ నగర్ నుంచి మహేదేవ్ పూర్ మీదుగా కూడా కాళేశ్వరం చేరుకోవచ్చు.
ఖమ్మం నుంచి రైలు మార్గంలో వెళ్లే భక్తులు వరంగల్ వరకూ వచ్చి అక్కడి నుంచి బస్సుల్లో వెళ్లొచ్చు. విశాఖపట్టణం, విజయవాడ, గంటూరు నుంచి వచ్చే వారుకూడా వరంగల్ వరకూ రైల్లో వచ్చి అక్కడి నుంచి రోడ్డుమార్గంలో కాళేశ్వరం చేసుకోవచ్చు.
ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రత్యేక బస్సులు
APS RTC సరస్వతి పుష్కరాల కోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. విజయవాడ, అమలాపురం నుంచి సూపర్ లగ్జరీతో పాటూ ఇంద్ర ఏసీ సర్వీసులున్నాయి. మే 26తో పుష్కరాలు ముగుస్తాయి...అందుకే మే 25వరకూ ఈ బస్సులు నడపనున్నారు. పుష్కర స్నానం చేయాలి అనుకునే భక్తులు ఆన్ లైన్ ద్వారా తమ సీట్లను బుక్ చేసుకోవాలని సూచించారు. విజయవాడ నుంచి కాళేశ్వరం మీదుగా ధర్మపురి, వేములవాడ, కొండగట్టు ఆలయాల సందర్శనకు కూడా ఏర్పాట్లు చేశారు ఆర్టీసీ అధికారులు.
తిరుమలలో ఉన్నది రాతి విగ్రహం కాదు.. సజీవంగా నిల్చున్న శ్రీ వేంకటేశ్వరుడు - తిరుమలలో జరిగే సేవలేంటి? ఏ సేవలో ఏం చేస్తారు? ఏ సేవకు వెళితే మంచిది? ఈ వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి






















