Stanley Kubrick Movies Telugu | క్యూబ్రిక్ సినిమాలు చూడాలంటే క్రాఫ్ట్ మీద పిచ్చి ఉండాలి | ABP Desam
ప్రపంచంలో గొప్ప సినిమాలు అంటే ఏంటీ..అసలు ఓ సినిమాను గొప్ప సినిమా అని ఎలా చెప్పగలుగుతాం. ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు ఎప్పటికి నిర్దుష్టం గా దొరకకపోవచ్చు. సినిమా అనేది చూసే ప్రేక్షకుడి దృష్టి కోణం నుంచి కనిపించే వస్తువే అయినా కొన్ని సినిమాలు కాల గర్భంలో కలిసి పోకుండా ఏళ్లు గడుస్తున్నా వాటిని ఆస్వాదించిన మనిషిపై ఆ సినిమా తాలుకూ ప్రభావాన్ని చూపిస్తూనే ఉంటాయి. అలాంటి అనుభూతిని కలిగించిన సినిమాలు జీవితంలో ఎలా గుర్తు పెట్టుకుంటామో అలానే అంత అద్భుతమైన సినిమాను మనకు చూపించిన దర్శకుడికి తెలియకుండానే గుడి కట్టేస్తాం. అలా దర్శకులు ఎంత మంది ఉన్నా ఓజీ ఆఫ్ డైరెక్టర్స్ అని, మాస్టర్ ఆఫ్ మాస్టర్స్ అని పేరు తెచ్చుకున్న హాలీవుడ్ డైరెక్టర్ స్టాన్లీ క్రూబ్రిక్ మనం ఈ వారం హాలీవుడ్ ఇన్ సైడర్ లో మాట్లాడుకుందాం…
స్టాన్లీ క్యూబ్రిక్. తన జీవితంలో 47 సంవత్సరాల పాటు డైరెక్టర్ గా ఉన్న స్టాన్లీ క్యూబ్రిక్ తీసినవి కేవలం 13 సినిమాలంటే 13 సినిమాలు. ఇంత ఎక్కువ కాలం పాటు డైరెక్టర్ గా ఇండస్ట్రీలో ఉండి ఇంత తక్కువ సినిమాలు తీసింది క్యూబ్రిక్ మాత్రమేనేమో అని చెప్పుకోవాలి. సినిమా పత్రికలకు స్టిల్ ఫోటోగ్రాఫర్ గా తన కెరీర్ ను ప్రారంభించిన క్యూబ్రిక్ యాడ్స్ తీస్తూ మంచి పేరు తెచ్చుకుని 1952లో తొలిసారిగా ఓ చిన్న సినిమాను డైరెక్ట్ చేశారు. ఫియర్ అండ్ డిసైర్ పేరుతో రిలీజ్ అయిన ఆ సినిమాతోనే క్యూబ్రిక్ తను అందరిలాంటి డైరెక్టర్ ను కాదని ఘనంగా చాటుకున్నాడు. అయితే కిర్క్ డగ్లస్ హీరోగా 1957లో పాత్స్ ఆఫ్ గ్లోరీ, 1960లో స్పార్టకస్ సినిమాలు స్టాన్లీ క్యూబ్రిక్ కెరీర్ ను పీక్స్ తీసుకువెళ్లిపోయాయి. అప్పటి వరకూ గ్లాడియేటర్ తరహా కథలను స్పార్టకస్ అంత అథంటికేటెడ్ గా చెప్పిన సినిమాలు లేకపోవటంతో క్యూబ్రిక్ కి బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. ఎస్పషల్లీ స్పార్టకస్ సినిమాలో వాడిన వైడ్ ఫ్రేమ్ షాట్స్ కి ఇప్పటికీ కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారు.
సినిమాలు చాలా మంది తీస్తారు. సూపర్ హిట్ లు...చరిత్రలో నిలిచిపోయే సినిమాలు కూడా ఉంటాయి. కానీ 1968 లో స్టాన్లీ క్యూబ్రిక్ డైరెక్ట్ చేసిన 2001 ఏ స్పేస్ ఒడిస్సీ అనే సినిమా మాత్రం క్యూబ్రిక్ కెరీర్ ను డిఫైన్ చేసింది. ఎందుకంటే ఈ సినిమా కేవలం అప్పటి వరకూ స్టీరియో టైప్ ఫిల్మ్ మేకింగ్ ప్యాట్రన్స్ బ్రేక్ చేయటంతో పాటు మనందరి ఫ్యూచర్ ను డిసైడ్ చేసింది. ఈ సినిమా రిలీజ్ అయ్యేప్పటికీ స్పేస్ ప్రయోగాలు చాలా ఇనీషియల్ స్టేజ్ లో ఉన్నాయి. 1961లో మానవుడు తొలిసారిగా స్పేస్ లోకి వెళ్లాడు. అలాంటిది 2001 ఏ స్పేస్ ఒడిస్సీ సినిమాలో ఇప్పుడు మనం వాడుతున్న స్పేస్ షటిల్స్, శాటిలైట్స్, అంతెందుకు ఆఖరకు మనం వాడుతున్న ఆర్టిఫీషియల్ ఇంటిలెజెన్స్ వరకూ అన్నింటి గురించి ఉంటుంది. సిరి, జెమినై, చాట్ జీపీటీ లాంటి ఈ టెక్నాలజీ కనీసం డిస్కస్ చేయాలన్నా కూడా థిరిటకల్లీ ఇంపాజిబుల్ అయిన ఆ రోజుల్లోనే ఎందుకంటే అప్పటికి కంప్యూటర్ చూడటంమంటేనే పెద్ద విషయం అలాంటిది ఆ సినిమాలో హ్యూమన్ మెషీన్ ఇంటర్ ఫేస్ లు, AI చాట్స్ లాంటి వి అన్నీ చూపిస్తారు. అది కూడా ఏదో మ్యాజిక్ లా కాదు. అచ్చంగా ఇప్పుడు మనం వాడుతున్న ఆ సినిమాలో చూపించిన వాటి కాపీనే అంత అథంటిక్ గా ఉంటాయి. ఆ సినిమా ఓ బుక్ ఆధారంగా తీసినదే అయినా 57 ఏళ్ల క్రితం ఈ టెక్నాలజీనీ ఓ డైరెక్టర్ ఊహించి ఎలా ప్రజెంట్ చేయగలిగారు అనేది నిజంగా అద్భుతంగా అనిపిస్తుంది. ఈ సినిమా చూసి ఇన్ఫ్లుయెన్స్ అవ్వని హాలీవుడ్ డైరెక్టర్ కానీ, యాక్టర్ గానీ లేరంటే అతిశయోక్తి కాదు. ఎస్పెషల్లీ ప్రీ క్లైమాక్స్ లో వాడిన విజువల్ ఎఫెక్ట్స్, కలర్ ప్యాలెట్స్ అప్పుడు అందుబాటులో ఉన్న టెక్నాలజీకి నిజంగా ఇంపాజిబుల్. బట్ ఆ అవుట్ పుట్ ని క్యూబ్రిక్ అఛీవ్ చేసి చూపించి తను ఓజీ డైరెక్టర్ అని కాదు గాడ్ ఆఫ్ డైరెక్టర్స్ అనిపించుకున్నారు.
ఆ తర్వాత తీసిన క్లాక్ వర్క్ ఆరెంజ్ సినిమా అయితే సైకాలజికల్ థ్రిల్లర్స్ లో పిచ్చి పీక్స్. ఆ తర్వాత తీసిన షైనింగ్ హారర్ సైకాలజికల్ బ్యాక్ డ్రాప్ లో ఓ బెంచ్ మార్క్. బ్యారీ లండన్, ఫుల్ మెటల్ జాకెట్...ఇలా తను చేసిన ప్రతీ సినిమాను ఆ జోన్రాలో ఓ బెంచ్ మార్క్ లా ఓ ఎవరెస్ట్ పర్వతంలా సెట్ చేసుకుంటూ వెళ్లిన క్యూబ్రిక్ 1999 లో బ్రాడ్ పిట్ ను హీరోగా పెట్టి ఐస్ వైడ్ షట్ అనే సినిమాను 70ఏళ్ల వయస్సులో డైరెక్ట్ చేస్తూనే కన్ను మూశారు. ఆయన మరణించిన తర్వాత ఆ సినిమా విడుదలైంది. ఆర్టిఫీషియల్ ఇంటెలెజిన్స్ మీద సినిమా తీయాలని తపనపడిపోయిన క్యూబ్రిక్ తనకు వృద్ధాప్యం మీదకు రావటంతో ఆ పనిని స్పీల్ బర్గ్ అప్పగించారు. క్యూబ్రిక్ రాసుకున్న నోట్స్ ను, స్క్రిప్ట్ ను చదివి 2001లో AI సినిమాను తీసి లెజండ్రీ డైరెక్టర్ గా మిగిలిపోయిన క్యూబ్రిక్ కి అంకితమిచ్చారు స్పీల్ బర్గ్. ఇదీ హాలీవుడ్ సినిమాపై, మోడ్రన్ సొసైటీ పై స్టాన్లీ క్యూబ్రిక్ అనే ఓజీ డైరెక్టర్ క్రియేట్ చేసిన ఇంపాక్ట్.





















