Asia Cup 2025 Team India | ప్లేయింగ్ 11 లో హర్షిత్ రాణా చోటు సంపాదిస్తారా ?
ఆసియా కప్ లో టీమ్ ఇండియా నుంచి ప్లేయింగ్ 11 లో ఎవరు ఉంటారని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఓపెనర్స్, మిడిల్ ఆర్డర్, బౌలర్స్ .. ఇలా ప్రతి పొజిషన్ కు ఇండియాలో రెండేసి ఆప్షన్స్ ఉన్నాయి. ఓపెనర్లుగా టీం ఇండియాకు ముగ్గురు ఆప్షన్స్ గా ఉన్నారు. సంజు శాంసన్, శుబ్మన్ గిల్, అభిషేక్ శర్మ. వైస్ కెప్టెన్ కాబట్టి శుబ్మన్ గిల్ ఖచ్చితంగా ప్లేయింగ్ 11 లో ఉంటారు. సో అభిషేక్ శర్మ, సంజు శాంసన్ లో ఎవరికో ఒక్కరికే ఛాన్స్ ఉంటుంది. అలాగే బ్యాట్స్మన్ రింకూ సింగ్ కు బదులుగా శివమ్ దూబే, అక్సర్ పటేల్ ను ప్లేయింగ్ 11 లో చేర్చుకునే అవకాశం ఉంది. అందుకు కారణం టీం ఇండియాకు ఆల్ రౌండర్లు కావాలి. మంచి ఫినిషర్ గా పేరు తెచ్చుకున్న రింకూ సింగ్ బౌలింగ్ చేయలేడు. దాంతో ఖచ్చితంగా అల్ రౌండర్ నే కన్సిడర్ చేస్తారు.
అలాగే ఇండియా టీమ్ లో బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్.. మెయిన్ బౌలర్లు. హార్దిక్ పాండ్యా, శివం దూబే కూడా బౌలింగ్ చేస్తారు. దాంతో హర్షిత్ రాణాకు అవకాశం రావడం కష్టంగానే కనిపిస్తుంది. మరి ఆసియా కప్ ప్లేయింగ్ 11 లో చోటు సంపాదిస్తాడా లేదా చూడాలి.





















