Sri Lanka vs Zimbabwe T20 | శ్రీలంకను చిత్తు చేసిన జింబాబ్వే
జింబాబ్వే క్రికెట్ టీమ్ టీ20 సిరీస్‌లో శ్రీలంకను అతి దారుణంగా ఓడించింది. టీ 20 సిరీస్ లో భాగంగా జింబాబ్వే టూర్ లో ఉన్న శ్రీలంక రెండో టీ20లో ఓడిపోయింది. బౌలింగ్, బ్యాటింగ్‌లో సత్తాచాటిన జింబాబ్వే 5 వికెట్ల తేడాతో మ్యాచ్ గెలిచింది.
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న జింబాబ్వే 38 పరుగులకే శ్రీలంకవి ఐదు వికెట్లు పడగొట్టింది. బౌలర్ల దెబ్బకు శ్రీలంక బ్యాటర్లు వెంటవెంటనే పెవిలియన్‌కు చేరారు. చివరకు 17.4 ఓవర్లలో 80 రన్స్‌కి ఆలౌట్ అయింది. శ్రీలంక బ్యాటర్లలో ఏడుగురు సింగిల్ డిజిట్‌కే ఔట్ అయ్యారు. ఛేజింగ్ ప్రారంభించిన జింబాబ్వే.. 14.2 ఓవర్లలో మ్యాచ్ ముగించింది. శ్రీలంక బ్యాటర్లు ఇలా విఫలం అవడంతో ఈ ఇంపాక్ట్ ఆసియా కప్ పై పడే ఛాన్స్ ఉందని అనుకుంటున్నారు ఫ్యాన్స్. ఆసియా కప్ లో మొత్తం 8 టీమ్స్ ఒక టైటిల్ కోసం తలపడనున్నాయి. ఆసియా కప్ మొదలయింది 1984లో. అప్పటి నుంచి ఇప్పటి వరకు 8 సార్లు టైటిల్ గెలుచుకొని టీం ఇండియా విన్నింగ్ లిస్ట్ లో మొదటి స్థానంలో ఉంది. ఇక రెండో ప్లేస్ శ్రీలంక. 6 సార్లు శ్రీలంక ఆసియా కప్ ను సొతం చేసుకుంది. పాకిస్తాన్ రెండు సార్లు ఛాంపియన్ గా నిలిచింది. ఇప్పటికే 8 ట్రోఫీలతో అగ్రస్థానంలో ఉన్న భారత్, తొమ్మిదో టైటిల్ కోసం బరిలోకి దిగబోతోంది. టీ20 ఫార్మాట్‌లో జరుగుతున్న ఈ ఆసియా కప్‌లో భారత జట్టుపై అభిమానుల్లో అంచనాలు ఆకాశానికి చేరుతున్నాయి.ఆరు సార్లు ఛాంపియన్స్ గా నిలిచిన శ్రీలంక ఈ సారి ఎలా పెర్ఫర్మ్ చేస్తుందో చూడాలి.





















