JUPITER Super computer Explained | ప్రపంచ జనాభా అంతా కలిసి చేసే లెక్కలు ఒక్క సెకన్ లో చేసేస్తుంది | ABP Desam
టెక్నాలజీ ఎంత ర్యాపిడ్ పేస్ తో దూసుకువెళ్లాలో అంత వేగంతో దూసుకువెళ్తోంది. ఓ రెండు మూడేళ్ల క్రితం పోల్చి చూస్తేనే నమ్మలేనంత టెక్నాలజీ మన చుట్టూ వచ్చేసింది. ఆర్టిఫీషియల్ ఇంటిలెజిన్స్ ఇప్పుడు అందరూ పల్లీబఠాణీల్లా వాడేస్తున్నారు. ఒకానొక టైమ్ లో AI ఈ ప్రపంచాన్ని టేకోవర్ చేస్తుందనేంత స్థాయి భయాందోళనలు కూడా కన్జర్వేటివ్ మైండ్ సెట్స్ ను డిస్ట్రబ్ చేశాయి. AI కూడా హ్యూమన్ ఇంటిలెజెన్స్ నుంచి వచ్చినా కూడా ఎందుకో తెలియని భయం. అయితే ఇప్పుడు AI ను కూడా ఓడించేంత స్థాయి ఉన్న ఓ సరికొత్త సూపర్ కంప్యూటర్ సిద్ధమైపోయింది. దాని ముందు నిలవాలంటే ప్రపంచంలో ఏ ఆర్టీఫిషయల్ ఇంటిలెజెన్స్ కైనా కష్టం అనేంత ప్రచారం జరుగుతోంది ఈ సూపర్ కంప్యూటర్..ఇంతకీ ఏంటిది అది..అంతలా మైండ్ బ్లో చేసేంత స్థాయిలో స్పెషల్ ఫీచర్స్ ఈ సూపర్ కంప్యూటర్ లో ఏమున్నాయి ఈ వారం టెక్నలాజియాలో తెలుసుకుందాం.
జ్యూపిటర్.... జర్మనీ తయారు చేసిన సరికొత్త సూపర్ కంప్యూటర్ పేరు ఇది. ఏడేళ్లుగా ఈ సూపర్ కంప్యూటర్ తయారీపై జరుగుతున్న పరిశోధనలు అన్నీ కొలిక్కి వచ్చి జ్యూపిటర్ టెక్ ప్రపంచాన్ని టేకోవర్ చేయటానికి సిద్ధమైపోయింది. ఈ సూపర్ కంప్యూటర్ ను రూపొందించిటానికి ఏడేళ్ల సమయం పట్టింది జర్మనీకి. అయ్యిన ఖర్చు మన కరెన్సీలో చెప్పాలంటే 48వేల 416 కోట్ల రూపాయలు. ఇంత ఖర్చు పెట్టడానికి ఏముందయ్యా అందులో ఉంటే ఇది ఒక సెకన్ కి ఒక క్విన్ ట్రిలియన్ క్యాలిక్యులేషన్స్ చేయగలదు. అంటే 1 పక్కన 18 సున్నాలు పెట్టుకోండి. వందకోట్ల వందకోట్ల లెక్కలు అన్నమాట అన్ని క్యాలిక్యులేషన్స్ జస్ట్ సెకన్ లో చేసి పక్కన పారేస్తుంది. ఇంకా సింపుల్ గా చెప్పనా మన ప్రపంచం మొత్తం మీద 800కోట్ల మంది జనాభా ఉన్నారు అనుకుందాం. అందరికీ లెక్కలు ఇచ్చి సెకన్ కి ఒకటి చొప్పున గ్యాప్ లెక్కలు చేస్తూ వెళ్లండి అంటే నాలుగేళ్ల పాటు ఈ 800కోట్ల మంది కలిపి ఎన్ని లెక్కలు చేస్తారో జ్యూపిటర్ సూపర్ కంప్యూటర్ ఒక్కటే ఒక సెకనులోనే అన్ని లెక్కలు చేస్తుంది అన్నమాట.
ఇంకా ఫాసినేటింగ్ విషయాలు ఉన్నాయి. దీన్ని రన్ చేయటానికి 17 మెగావాట్ల విద్యుత్ కావాలి. అంటే సింపుల్ గా 20వేల ఇళ్లు ఉన్న ఓ పట్టణం రోజులో ఎంత కరెంట్ వాడుతుందో అది పవర్ ని ఇదొక్కటే కన్జ్యూమ్ చేయగలదు. దీనికి ఉండే కూలింగ్ పైప్స్ అన్నింటితో కలిపి రెండు పుట్ బాల్ మైదానాలంత సైజులో ఉంటుంది ఈ సూపర్ కంప్యూటర్. క్యాంటమ్ కంప్యూటర్స్ రేపు ఎన్ని వచ్చినా వాటన్నింటిని ప్లగ్ ఇన్ చేసుకోగల సామర్థ్యం జూపిటర్ సొంతం.
కొన్ని వేల ప్రోసెసర్లతో తయారైన ఈ జ్యూపిటర్ సూపర్ కంప్యూటర్ గొప్పతనం ఏంటంటే ఇది అడ్వాన్డ్స్ ఆర్టిఫీషియల్ ఇంటిలెజెన్స్ తోనూ పోటీ పడగలదు. ప్రస్తుతం ఉన్న చాట్ జీపీటీలోని అడ్వాన్స్డ్ ప్రీమియం వెర్షన్ అయిన జీపీటీ 4 లో ఓ నెలలో చేసే పనులు ఇచ్చే ఆన్సర్స్ ని జ్యూపిటర్ ఒక్క రోజులో చేసేయగలుగుతుంది. ఆరకంగా ఇది AI ను ఓడించగలిగే సామర్థ్యం ఉన్న సూపర్ కంప్యూటర్. అంతే కాదు మిగిలిన దేశాలు కొన్ని నెలలు, సంవత్సరాలు కష్టపడి తయారు చేసే AI మోడళ్లను జ్యూపిటర్ సూపర్ కంప్యూటర్ ఒక్క రోజులో తయారు చేసేయగలదు. అందుకే సైన్స్, ఏఐ రంగాల్లో జ్యూపిటర్ సూపర్ కంప్యూటర్ ను యూరోప్ ఐరన్ మ్యాన్ సూట్ అని పిలుస్తున్నారు. అమెరికా, చైనా దేశాల AI మోడళ్లతో పోటీ పడి పని లేకుండా జర్మనీ యూరోప్ మొత్తం గర్వపడేలా ఈ సూపర్ కంప్యూటర్ ను రూపొందించింది. రెడీ అవ్వటంతోనే ప్రపంచంలో టాప్ 500 సూపర్ కంప్యూటర్ లో నెంబర్ 4 ర్యాంక్ ను సాధించిన ఈ జ్యూపిటర్ సూపర్ కంప్యూటర్ అప్ గ్రేడ్ చేయటం ద్వారా ఫ్యూచర్ లో నెంబర్ స్థానం సాధించే స్థాయి తనకు ఉందని నిరూపించుకోగలదని జర్మన్ సైంటిస్ట్ లు భావిస్తున్నారు.
ఇంత ఖర్చు పెట్టి ఇన్ని వేల క్యాలిక్యులేషన్స్ దేనికి అంటే ఆరోగ్యం, వాతావరణం, AI, స్పేస్ సైన్స్ రంగాల్లో లెక్కలేనన్ని ఉపయోగాలు జ్యూపిటర్ సూపర్ కంప్యూటర్ తో రానున్నాయి. ఏళ్ల తరబడి కొత్త మందులపై చేసే ప్రయోగాలను వారాల్లోనే పూర్తి చేసి రోగనివారణ పద్ధతులను వేగంగా కనిపెట్టగల సామర్థ్యం, క్లైమేట్ మోడళ్లను సూపర్ డీటైలింగ్ తో రన్ చేయటం ద్వారా రోజులు, నెలల ముందే వాతావరణ మార్పులను కచ్చితంగా అంచనా వేయటం లాంటివి ప్రజలకు ఉపయోగపడే పనులు చేయటం తో పాటు క్వాంటమ్ మెకాన్సిక్స్, అంతుచిక్కని భౌతిక శాస్త్ర ప్రశ్నలకు చాలా తేలికగా సమాధానాలు రాబట్టి మనిషి పురోగతికి జ్యూపిటర్ సూపర్ కంప్యూటర్ చాలా హెల్ప్ చేస్తుందని సైంటిస్టులు అంచనా వేస్తున్నారు.





















