అన్వేషించండి

Hyderabad ఔటర్ రింగ్ రోడ్డుపై 11 ఏళ్ల బాలుడితో కారు డ్రైవింగ్.. తండ్రి అరెస్ట్, కారు స్వాధీనం

హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై తన 11 ఏళ్ల కుమారుడికి కారు ఇచ్చి డ్రైవింగ్ చేయించిన తండ్రి అబ్దుల్ హాదీని రాజేంద్రనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో ఆధారంగా చర్యలు చేపట్టారు.

Minor Drive Luxury Car on Outer Ring Road | హైదరాబాద్: పుత్రోత్సాహం మంచిదే, కానీ పిచ్చికి పరాకాష్టగా మారితేనే ప్రమాదాలు తప్పవు. హైదరాబాద్‌లో ఓ తండ్రి కొడుకు మీద పిచ్చి ప్రేమతో టీనేజ్ కూడా లేని కొడుకు చేతికి కారు స్టీరింగ్ ఇచ్చి డ్రైవింగ్ చేపించి సంబరపడ్డాడు. సీన్ కట్ చేస్తే జైలుకు వెళ్లి ఊచలు లెక్కించాల్సి వచ్చింది.

అసలేం జరిగిందంటే
ఔటర్ రింగ్ రోడ్ అంటేనే వాహనాలు అత్యంత వేగంగా దూసుకెళ్లే దారి. బాధ్యులు ఎవరైనా, ఏ చిన్న పొరపాటు జరిగినా ప్రాణాలు పోతాయి. అలాంటి ప్రమాదకరమైన ఓఆర్ఆర్ పై ఓ తండ్రి అత్యంత బాధ్యతారాహిత్యంగా వ్యవహరించాడు. తన 11 ఏళ్ల కుమారుడికి ఖరీదైన కారు స్టీరింగ్‌ ఇచ్చి డ్రైవింగ్‌ చేపించి మురిసిపోయాడు. తాను ఎంత పెద్ద తప్పు చేస్తున్నాను, చట్టప్రకారం అది ఎంతటి తీవ్రమైన నేరమనే విషయాన్ని మరిచిపోయి చిక్కుల్లో పడ్డాడు.

రాజేంద్రనగర్‌ ట్రాఫిక్‌ సీఐ సీహెచ్‌ రాజు తెలిపిన వివరాల ప్రకారం.. టోలీచౌకీ ప్రాంతానికి చెందిన అబ్దుల్‌ హాదీ ఇటీవల ఓ ఖరీదైన కారు కొన్నాడు. జూన్ 11వ తేదీ అర్ధరాత్రి సమయంలో ఔటర్‌ రింగ్ రోడ్డు (Hyderabad ORR)పై శంషాబాద్‌ నుంచి గచ్చిబౌలి వెళ్లే మార్గంలో తన మైనర్ కుమారుడికి నడిపేందుకు కారును ఇచ్చాడు. కనీసం టీనేజ్ కూడా లేని ఆ బాలుడు అర్ధరాత్రి వేళ ఓఆర్‌ఆర్‌పై కారును డ్రైవ్ చేశాడు.

Also Read: Fake Paneer: హైదరాబాద్‌లో ఫేక్ పనీర్‌ కలకలం.. తనిఖీల్లో 825 కేజీల చీజ్ అనలాగ్ స్వాధీనం- మీ ఆరోగ్యం జాగ్రత్త 

అదే సమయంలో ఆ దారిలో మరో కారులో వెళ్తున్న ఓ వ్యక్తి బాలుడు డ్రైవింగ్ చేయడం చూసి ఆశ్చర్యపోయాడు. బాలుడు కారు నడుపుతుండగా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఈ వీడియో ఇంటర్నెట్‌ను షేక్ చేసింది. పలువురు నెటిజన్లు ఎక్స్‌ వేదికగా ఆ వీడియోను ట్రాఫిక్‌ పోలీసుల అధికారిక ఖాతాకు ట్యాగ్‌ చేసి చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు.

ఆ వైరల్ అయిన వీడియో ఆధారంగా రాజేంద్రనగర్ పోలీసులు రంగంలోకి దిగి, దర్యాప్తు చేపట్టారు. నిఘా ఉంచి కారు నంబర్ ఆధారంగా యజమాని అబ్దుల్‌ హాదీని గుర్తించారు. డ్రైవింగ్‌ చేసింది అతడి 11 ఏళ్ల కుమారుడనే విషయం విచారణలో తెలడంతో పోలీసులు కారును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం బాలుడి తండ్రిని అదుపులోకి తీసుకున్నారు. అత్యంత వేగంగా వాహనాలు దూసుకెళ్లే రహదారిపై బాలుడికి కారు ఇచ్చి తమ ప్రాణాలతో పాటు ఇతర వాహనదాలు ప్రాణాలు ప్రమాదంలోకి నెట్టేలా ప్రవర్తించడం, ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినందుకు గానూ తండ్రి అబ్దుల్ హాదీపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు రాజేంద్రనగర్‌ ఇన్‌స్పెక్టర్‌ ముత్తుయాదవ్‌ వెల్లడించారు.

Frequently Asked Questions

హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు ఘటనలో ఎవరు అరెస్ట్ అయ్యారు?

మైనర్ కొడుకు చేత ఖరీదైన కారు నడిపించినందుకు అబ్దుల్ హాదీ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతను టోలీచౌకీ ప్రాంతానికి చెందినవాడు.

ఆ తండ్రిని ఎందుకు అరెస్ట్ చేశారు?

తన 11 ఏళ్ల మైనర్ కుమారుడికి ఔటర్ రింగ్ రోడ్డుపై కారు నడిపేందుకు ఇచ్చి, ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినందుకు అరెస్ట్ చేశారు. ప్రాణాలకు ప్రమాదం కలిగించినందుకు అతనిపై కేసులు నమోదయ్యాయి.

ఈ సంఘటన పోలీసుల దృష్టికి ఎలా వచ్చింది?

బాలుడు కారు నడుపుతుండగా ఒక వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. నెటిజన్లు ట్రాఫిక్ పోలీసులకు ట్యాగ్ చేయడంతో వారు చర్యలు తీసుకున్నారు.

మైనర్ కుమారుడి వయస్సు ఎంత?

కారు నడిపిన మైనర్ బాలుడి వయస్సు 11 ఏళ్లు. ఇతను టీనేజ్ కూడా లేడని ఆర్టికల్ లో ఉంది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kaleshwaram Project Report: కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
Rains In AP and Telangana: ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు.. తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్- గోదావరి ఉగ్రరూపం
ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు.. తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్
Hyderabad Traffic Diversions: ఉజ్జయినీ మహంకాళి బోనాలు - హైదరాబాద్‌లో ఆ ప్రాంతాల్లో 2 రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు
ఉజ్జయినీ మహంకాళి బోనాలు - హైదరాబాద్‌లో ఆ ప్రాంతాల్లో 2 రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు
Revanth Reddy On Uppal Nalla Cheruvu: ఉప్పల్ నల్లచెరువుకు జలకళ.. హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
ఉప్పల్ నల్లచెరువుకు జలకళ.. హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
Advertisement

వీడియోలు

Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ
Trinayani Serial Actress Ashika Padukone | 'త్రినయని' ఆషికా రియల్ లైఫ్ సీక్రెట్స్
Hardik Pandya Comments On Captaincy | కెప్టెన్సీపై హార్దిక్ పాండ్యా షాకింగ్ కామెంట్స్
Vaibhav Suryavanshi Vice Captaincy | 15 ఏళ్ల కుర్రాడికి వైస్ కెప్టెన్సీ ఏంటి?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: ఉజ్జయిని మహంకాళి బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. బోనం సమర్పించిన మంత్రులు
ఉజ్జయిని మహంకాళి బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. బోనం సమర్పించిన మంత్రులు
Friendship Day Tragedy: విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
Adilabad Airport Credit War: ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ మంజూరు చేసింది కాంగ్రెస్! బీజం వేసింది నేనే: మాజీ ఎంపీ సోయం బాపూరావు
ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ మంజూరు చేసింది కాంగ్రెస్! బీజం వేసింది నేనే: మాజీ ఎంపీ సోయం బాపూరావు
CWG India Medals: కామన్వెల్త్ లో భారత్ పంచ్ పవర్.. 4వ స్థానానికి ఇండియా జంప్, 39 పతకాలతో రికార్డు!
కామన్వెల్త్ లో భారత్ పంచ్ పవర్.. 4వ స్థానానికి ఇండియా జంప్, 39 పతకాలతో రికార్డు!
Kaleshwaram Project Report: కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
Hanumakonda Crime News: హనుమకొండలో ఘోరం.. కాళ్లు, చేతులు కట్టేసి భార్యను హత్య చేసిన భర్త.. పోలీసులకు చెప్పిన కుమారుడు
హనుమకొండలో ఘోరం.. కాళ్లు, చేతులు కట్టేసి భార్యను హత్య చేసిన భర్త.. పోలీసులకు చెప్పిన కుమారుడు
Rains In AP and Telangana: ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు.. తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్- గోదావరి ఉగ్రరూపం
ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు.. తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్
Secret Soldier : చైనా పీస్ కాదు సీక్రెట్ సోల్జర్ - సెన్సార్ అభ్యంతరాలతో టైటిల్ చేంజ్... రిలీజ్ ఎప్పుడంటే?
చైనా పీస్ కాదు సీక్రెట్ సోల్జర్ - సెన్సార్ అభ్యంతరాలతో టైటిల్ చేంజ్... రిలీజ్ ఎప్పుడంటే?
Embed widget