(Source: ECI/ABP News/ABP Majha)
Disa Case: దిశ కేసు విచారణాధికారి వీఆర్‌ఎస్‌కు దరఖాస్తు - డీజీపీకి అభ్యర్థన
దిశ ఎన్‌కౌంటర్ జరిగినప్పుడు సురేంద్ర షాద్‌నగర్ ఏసీపీగా ఉండే వాళ్లు. తర్వాత ఆకేసు విచారణ అధికారిగా పని చేశారు.
తెలంగాణలో దిశా ఎన్‌కౌంటర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. గతంలో ఈ కేసును విచారణ చేసిన అధికారి వీఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకోవడం చర్చనీయాంశమైంది. వ్యక్తిగత కారణాలతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన పేర్కొన్నారు.
దిశా కేసులో విచారణ అధికారిగా ఉన్న సురేంద్ర వీఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకున్నారు. తన అభ్యర్థనను డీజీపీ అంజన్‌కుమార్ యాదవ్‌కు పంపించారు. వ్యక్తిగత కారణాలతోనే వీఆర్‌ఎస్‌కు అప్లై చేసుకున్నట్టు ఆయన చెబుతున్నప్పటికీ గుర్తింపు లభించడం లేదన్న కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు పోలీసు వర్గాల్లో చర్చ నడుస్తోంది.
దిశ ఎన్‌కౌంటర్ జరిగినప్పుడు సురేంద్ర షాద్‌నగర్ ఏసీపీగా ఉండే వారు. తర్వాత ఆ కేసు విచారణ అధికారిగా పని చేశారు. అనంతరం ఆయన్ని ట్రాన్స్‌కో విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీఎస్పీగా బదిలీ చేశారు. ఈ మధ్య కమాండర్ కంట్రోల్ ఏసీపీగా ట్రాన్స్‌ఫర్ అయ్యారు.
ఇలా గుర్తింపు లేని విభాగాలకు బదిలీ చేయడంపై అసంతృప్తితో ఉన్నట్టు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. అందుకే వీఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకున్నట్టు తెలుస్తోంది. ఆయనకు ఉంకా మూడేళ్లు సర్వీస్ ఉంది.