Hyderabad MMTS Trains: జంట నగరాల్లో తగ్గిన రద్దీ, రేపు పలు ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు
Hyderabad MMTS Trains : రద్దీ ఎక్కువగా లేని కారణంగా హైదరాబాద్ లో ఎంఎంటీఎస్ సర్వీసులను బాగా తగ్గిస్తున్నట్లు రైల్వేశాఖ కీలక ప్రకటన చేసింది. రేపటి నుంచి పలు లోకల్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు తెలిపింది.
Hyderabad MMTS Trains: జంట నగరాలు అయిన హైదరాబాద్, సికింద్రాబాద్ లో రద్దీ లేని కారణంగా వారాంతాల్లో ఎంఎంటీఎస్ రైళ్ల సర్వీసులను బాగా తగ్గిస్తున్న దక్షిణ మధ్య రైల్వే శాఖ ఈ వారం కూడా కీలక ప్రకటన చేసింది. జులై 31వ తేదీ ఆదివారం పలు లోకల్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. లింగంపల్లి-హైదరాబాద్ మార్గంలో 7 రైళ్లు, లింగంపల్లి - ఫలక్ నుమా మార్గంలో 7 సర్వీసులు, సికింద్రాబాద్ - లింగంపల్లి మార్గంలో ఒకటి, లింగంపల్లి - సికింద్రాబాద్ రూట్ లో ఒక సర్వీసును రద్దు చేస్తున్నట్లు దక్షిమ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు.
రద్దయిన రైళ్లు వివరాలు...!
- లింగం పల్లి - హైదరాబాద్ మార్గంలో.. 47129, 47132, 47133, 47135, 47136, 47137, 47138, 47139, 47140
- హైదరాబాద్ - లిగింపల్లి రూట్ లో.. 47105, 47109, 47110, 47111, 47112, 47114, 47116, 47118, 47120
- ఫలక్ నుమా - లింగంపల్లి మార్గంలో... 47153, 47164, 47165, 47166, 47203, 47220, 47170
- లింగంపల్లలి - ఫలక్ నుమా రూట్ లో.. 47176, 47189, 47210, 47187, 47190, 47191, 47192
- సికింద్రాబాద్ - లింగంపల్లి మార్గంలో.. 47150
- లింగంపల్లి - సికింద్రాబాద్ రూటులో.. 47195
Cancellation of 34 MMTS Train Services on Sunday 31.07.2022@drmsecunderabad @drmhyb pic.twitter.com/F7Z5QoBQcE
— South Central Railway (@SCRailwayIndia) July 30, 2022
తగ్గిన రద్దీ
రైళ్ల రద్దు విషయం ముందే తెలుపుతున్నందున చాలా ఉపయోగంగా ఉందని చాలా మంది కామెంట్లు చేస్తున్నారు. అనవసరంగా రైల్వే స్టేషన్ల వరకూ వెళ్లి ఇబ్బంది పడాల్సిన అవసరం లేకుండా పోయిందని రైలు ప్రయాణికులు అంటున్నారు. అయితే ఈ మధ్య జంట నగరాల్లోని ఎంఎంటీఎస్ రైళ్లలో చాలా వరకు జనాలు తగ్గారని దక్షిణ మధ్య రైల్వే శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే పలు రైళ్లను రద్దు చేసినట్లు వివరించారు.
రద్దీ అనుగుణంగా రైళ్లు
అలాగే గతంలో కూడా ఇలాగే పలు కారణాల వల్ల రైళ్లను రద్దు చేశారు. ఆ తర్వాత ప్రయాణికులు పెరగడంతో మళ్లీ పునరుద్ధరించారు. అందుకు సంబంధించిన విషయాన్ని కూడా దక్షిణ మధ్య రైల్వే సోషల్ మీడియా, పత్రికా ప్రకటనల ద్వారా ప్రజలకు విషయాన్ని చేర వేసింది. ఏది ఏమైనా ప్రజల రద్దీని బట్టి రైళ్లను పెంచడం, తగ్గించడం చేస్తుంది దక్షిణ మధ్య రైల్వే.