News
News
వీడియోలు ఆటలు
X

  Hyderabad: హైదరాబాద్ శివారులో చిరుత కలకలం - భయాందోళనలో ప్రజలు

Hyderabad: హైదరాబాద్ శివారులో చిరుత సంచారం కలకలం సృష్టించింది. బౌరంపేట ఓఆర్ఆర్ ప్రాంతంలో పులి తిరుగుతున్న దృశ్యాలు సీసీటీవీలో రికార్డు కాగా.. అవి కాస్తా వైరల్ అయ్యాయి. 

FOLLOW US: 
Share:

Hyderabad: హైదరాబాద్ శివారులో చిరుత సంచారం కలకలం సృష్టిస్తోంది. దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధి బౌరంపేట ఔటర్ రింగ్ రోడ్డు వద్ద చిరుత కదలికలు లభ్యం అయ్యాయి. అయితే ఈ దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డు కాగా.. ప్రస్తుతం అవి కాస్తా వైరల్ గా మారాయి. రెండున్నర నిమిషాల  వీడియోలో చిరుత సంచారానికి సంబంధించిన ఆనవాళ్లు లభించాయి. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న సూరారం ఫారెస్ట్ సెక్షన్ అధికారి, బీట్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలిస్తున్నారు. అయితే చిరుత అడుగులు సరిగ్గా లేకపోవడంతో అది కుక్క అడుగులా, నిజంగా చిరుత అడుగులేనా అని అధికారులు ఆలోచిస్తున్నారు. ఒకవేళ నిజంగానే చిరుత వస్తే ఎలా వచ్చింది, నీటి కోసమే వచ్చిందా అన్న కోణంలో కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. కానీ స్థానిక ప్రజలు మాత్రం చిరుత సంచరిస్తుదన్న వార్త తెలుసుకొని తెగ భయపడిపోతున్నారు. ఇంట్లోంచి బయటకు వచ్చేందుకు కూడా కొంతమంది జంకుతున్నారు. 

గతేడాది సెప్టెంబర్ లో రాజన్న సిరిసిల్ల జిల్లాలో చిరుత సంచారం

రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం చిప్పలపల్లి గ్రామంలో చిరుత పులి సంచారం మండల గ్రామాల ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది. చీకోడు గ్రామానికి చెందిన రాజు అనే రైతు చిప్పళ్లపల్లి గ్రామ శివారులో తన పొలం వద్ద కట్టేసిన దూడ పై చిరుత పులి దాడీ చేసి హత మార్చింది. తెల్లవారు జామున రాజు తన పొలం వద్దకు వెళ్ళి చూడగా దూడ మృతి చెంది కనిపించడంతో అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న అటవీశాఖ అధికారులు లేగ దూడపై చిరుత దాడి చేయడం వల్లే అది చనిపోయినట్లు గుర్తించారు. స్థానిక ప్రాంతాల ప్రజలంతా చాలా జాగ్రత్తగా ఉండాలని.. వ్యవసాయ క్షేత్రాలకు కూడా ఒక్కరే వెళ్లకూడదని వివరించారు. త్వరలోనే చిరుతను పట్టుకుంటామని చెప్పారు. 
మూడు నెలల క్రితం కూడా ఇక్కడే పులి సంచారం.

చిరుత సంచారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో కలకలం రేపుతోంది. పదిరోజుల వ్యవధిలోనే మరో చిరుత వరుస దాడులు చేసింది. తంగళ్ళపల్లి మండలంలోని పలు గ్రామాలలో చిరుత సంచారం రైతులతో పాటు గ్రామస్తులలో కూడా భయాందోళనకు గురి చేసింది. పది రోజుల క్రితం వేణుగోపాల్పూర్‌లో గేదె, రెండు దూడలను చంపిన చిరుత నిన్న రాత్రి గండిలచ్చపేట గ్రామంలోకి ప్రవేశించి పొలిమేరల్లో ఉన్న గంగ నర్సయ్య అనే రైతుకు చెందిన గేదెపై దాడి చేసి చంపింది. 

రైతు తన గేదెను పొలం దగ్గర కట్టేసి రాత్రి ఇంటికి వెళ్లిపోయాడు. ఉదయం వెళ్ళి చూడగా అది మృత్యువాత పడి ఉంది. అక్కడి పరిసరాల్లోని కాలి అడుగుల గుర్తులను బట్టి చిరుత పులి దాడి చేసినట్లుగా స్థానికులు నిర్ధారణకు వచ్చారు. ఈ సందర్బంగా స్థానికులు మాట్లాడుతూ.. గ్రామ రైతులు తమ పశువులను మొదటి నుండి పొలాలు వద్దే కట్టేసుకుంటారని, గతంలో ఎన్నడూలేని విధంగా చిరుత దాడి చేసిందని వాపోయారు. గ్రామ శివారులో చిరుత సంచరించి, వరుస దాడులు చేస్తూ గేదెలను మరియు దూడలను చంపడంతో రైతులు, గ్రామస్తులు తీవ్ర భయాందోళనలకు లోనవుతున్నామన్నారు.

Published at : 20 Apr 2023 03:29 PM (IST) Tags: Hyderabad CCTV Visuals Telanagna Leopard Leopard Wandering

సంబంధిత కథనాలు

Hyderabad News: హైదరాబాద్‌లోని ఓ పబ్‌ వైల్డ్ ఆలోచనపై విమర్శలు- అధికారులు, నెటిజన్లు - యజమాని అరెస్టు

Hyderabad News: హైదరాబాద్‌లోని ఓ పబ్‌ వైల్డ్ ఆలోచనపై విమర్శలు- అధికారులు, నెటిజన్లు - యజమాని అరెస్టు

Khelo India: ఓయూ అమ్మాయిలు అదుర్స్‌! యూనివర్సిటీ టెన్నిస్‌లో వరుసగా మూడోసారి ఫైనల్‌కు!

Khelo India: ఓయూ అమ్మాయిలు అదుర్స్‌! యూనివర్సిటీ టెన్నిస్‌లో వరుసగా మూడోసారి ఫైనల్‌కు!

Telangana Congress : టిక్కెట్లిస్తే పార్టీలోకి వస్తాం - తెలంగాణ కాంగ్రెస్‌కు ఇద్దరు మాజీ ఎంపీల కబురు !

Telangana Congress :  టిక్కెట్లిస్తే పార్టీలోకి వస్తాం - తెలంగాణ కాంగ్రెస్‌కు ఇద్దరు మాజీ ఎంపీల కబురు !

మెగాస్టార్‌ చిరంజీవితో మాజీ జేడీ లక్ష్మీనారాయణ భేటీ

మెగాస్టార్‌ చిరంజీవితో మాజీ జేడీ లక్ష్మీనారాయణ భేటీ

Rains in Telangana: మరో మూడ్రోజులు తెలంగాణలో ఎండావాన - ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ

Rains in Telangana: మరో మూడ్రోజులు తెలంగాణలో ఎండావాన - ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ

టాప్ స్టోరీస్

BRS Politics : కలిసి నడిచేందుకు వచ్చిన వారందర్నీ దూరం పెడుతున్న కేసీఆర్ - జాతీయ వ్యూహం మారిపోయిందా ?

BRS Politics : కలిసి నడిచేందుకు వచ్చిన వారందర్నీ దూరం పెడుతున్న కేసీఆర్ -   జాతీయ వ్యూహం మారిపోయిందా ?

Wrestlers Protest: పతకాలను గంగానదిలో పారేసి, ఇండియా గేట్ వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేస్తామంటున్న రెజ్లర్లు!

Wrestlers Protest: పతకాలను గంగానదిలో పారేసి, ఇండియా గేట్ వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేస్తామంటున్న రెజ్లర్లు!

ఇచ్చిన హామీలు అమలు చేసేందుకు మరికొన్ని సంవత్సరాల సమయం పడుతుంది: సజ్జల

ఇచ్చిన హామీలు అమలు చేసేందుకు మరికొన్ని సంవత్సరాల సమయం పడుతుంది: సజ్జల

SSMB28 Mass Strike : మహేష్ బాబు 'మాస్ స్ట్రైక్'కు ముహూర్తం ఫిక్స్ - ఏ టైంకు అంటే?

SSMB28 Mass Strike : మహేష్ బాబు 'మాస్ స్ట్రైక్'కు ముహూర్తం ఫిక్స్ - ఏ టైంకు అంటే?