High Court on BC reservation GO: కోర్టుల జోక్యం వద్దనుకుంటే స్థానిక ఎన్నికలు వాయిదా వేసుకోండి - తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు సూచన
Telangana: బీసీ రిజర్వేషన్ల జీవోపై హైకోర్టులో విచారణ జరిపింది. ఎన్నికలు వాయిదా వేసుకోవాలని సూచించింది

Telangana Local elections BC reservation : సీలకు 42% రిజర్వేషన్ G.O.పై దాఖలైన లంచ్ మోషన్ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు విచారణ జరిపింది. ఎన్నికల ప్రక్రియలో కోర్టు జోక్యం చేసుకోకూడదంటే ఎన్నికలు వాయిదా వేయాలని, హడావుడిగా G.O. జారీ చేసి నోటిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం ఏమిటని హైకోర్తు ప్రశ్నించింది. గవర్నర్ వద్ద సంబంధిత బిల్లులు పెండింగ్‌లో ఉన్నప్పుడు G.O.లు ఎలా జారీ చేశారని న్యాయమూర్తి ప్రశ్నించారు. ప్రభుత్వం సమాధానం చెప్పడానికి సమయం కోరడంతో విచారణను వచ్చే నెల 8 తేదీకి వాయిదా వేసిన హైకోర్టు, ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసినా విచారణ కొనసాగుతుందని స్పష్టం చేసింది. G.O. చెల్లుబాటు కాదనే అభిప్రాయంతో, నోటిఫికేషన్ జారీ చేస్తే కోర్టు వివాదాల్లో ఇరుక్కుంటుందని, స్టే వస్తే ఎన్నికలు ఆగిపోతాయని న్యాయనిపుణులు చెబుతున్నారు.
బీసీ రిజర్వేషన్లపై విచారణలో తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
— DD News Telangana | తెలంగాణ న్యూస్ (@ddyadagirinews) September 27, 2025
👉🏻 అవసరమైతే స్థానిక ఎన్నికలు వాయిదా వేయండి
👉🏻 గవర్నర్ వద్ద బిల్లు పెండింగ్‌లో ఉండగా జిఓ ఇవ్వడం సరికాదు
👉🏻 కోర్టుల జోక్యం ఉండకూడదంటే, 10 రోజులు ఎన్నికలు వాయిదా వేసుకోవాలన్న హైకోర్టు#LocalElections #Reservation pic.twitter.com/W4Fc1ccyLo
అధికారంలోకి వస్తే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని కాంగ్రెస్ కామారెడ్డి డిక్లరేషన్‌లో హామీ ఇచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, మార్చి 18, 2025న BC కోటాను 42%కు పెంచే బిల్లులను అసెంబ్లీలో ఆమోదించారు. ఆగస్టు 31న మరో రెండు బిల్లులు ఆమోదించి, SC, ST, BCలకు 50% మించి రిజర్వేషన్లు అమలు చేసేలా నిర్ణయం తీసుకున్నారు. ఈ బిల్లులు గవర్నర్, రాష్ట్రపతి ఆమోదానికి పంపారు. కానీ అవి పెండింగ్ లో ఉన్నాయి. డెడికేటెడ్ BC కమిషన్ నివేదిక, కుల సర్వే ఆధారంగా 42% BC కోటా నిర్ణయించినట్లుగా ప్రభుత్వం ప్రకటించింది.
స్థానిక ఎన్నికలకు కోర్టు పెట్టిన గడువు ఈ నెలాఖరుతో ముగుస్తుంది. అందుకే నోటిఫికేషన్ ఇవ్వాలన్న ఉద్దేశంతో శుక్రవారం జీవో జారీ చేశరు. జిల్లా కలెక్టర్లు రిజర్వేషన్ మ్యాట్రిక్స్‌ను సీల్డ్ కవర్లలో పంచాయతీ రాజ్ విభాగానికి సమర్పించారు. ఈ మ్యాట్రిక్స్ ప్రకారం, గ్రామ పంచాయతీలు, మండల ప్రజా పరిషత్తులు (MPP), జిల్లా పరిషత్తులు (ZP)లో BC, SC, ST కోటాలు నిర్ణయిస్తారు. జీవో విడుదలైనందున వెంటనే పంచాయతీ రాజ్ విభాగం SECకు సిఫార్సు చేస్తుంది. SEC ఒకటి లేదా రెండు రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ ప్రకటించాల్సి ఉంది. ఆదివారం నోటిపికేషన్ జారీ చేయాలని అనుకున్నారు. కానీ కోర్టు చేసిన వ్యాఖ్యలతో ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపై ఉత్కంఠ ఏర్పడింది.
స్థానిక ఎన్నికలకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. మొదటి దశలో ZP చైర్మన్‌లు (31), ZPTCలు (566), MPP ప్రెసిడెంట్లు (566), MPTCలు (5,773) ఎన్నికలు. రెండో దశలో గ్రామ పంచాయతీలు జరపాలని కసరత్తు చేశారు. ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నామని ఎస్‌ఈసీ ప్రకటించింది.





















