Harish Rao Chit Chat: రేవంత్ కుర్చీ కిందే బాంబు - పాదయాత్రకు డేటు, టైం చెప్పు - రేవంత్‌కు హరీష్ సవాల్
Telangana : రేవంత్ కుర్చీ కిందనే బాంబు ఉందని హరీష్ రావు అన్నారు. పాదయాత్రకు చేసిన సవాల్‌ను తాను అంగీకరిస్తున్నానని ప్రకటించారు.
Harish Rao On Revanth Reddy: రేవంత్ రెడ్డి ఆ కుర్చీకి ఉన్న గౌరవం పోగొడుతున్నారని మాజీమంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. బుధవారం మీడియా ప్రతినిధులతో హరీష్ రావు ఇష్టాగోష్టిగా మాట్లాడారు. రేవంత్ రెడ్డి కుర్చీ కింద ఉన్న బాంబ్ గురించి చూసుకోవాలని రేవంత్ కుర్చీని ఎవరు, ఎప్పుడైనా లాగొచ్చుని హెచ్చరించారు. పక్కన ఉన్నవారు నిన్ను ఫినిష్ చేయకుండా చూసుకో ..సిఎం పదవి నీకు కేసీఆర్ పెట్టిన భిక్ష అని స్పష్టం చేశారు. హైద్రాబాద్ కు మూడు దిక్కుల సముద్రం ఉందన్న రేవంత్ కామెంట్స్ పై సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయని.. రాజీవ్ గాంధీ కంప్యూటర్ కనిపెట్టాడని అంటాడు .. దిల్ సుఖ్ నగర్ లో విమానాలు అమ్ముతారని రేవంత్ అనడం హాస్యాస్పదమన్నారు. మల్లన్న సాగర్‌లో 50,000 ఎకరాలు ముపునకు గురైందని ముఖ్యమంత్రి అబద్ధపు ప్రచారం చేస్తున్నారని.. మొత్తం ప్రాజెక్ట్ సేకరించిన భూమి 17 వేల 871 ఎకరాలని స్పష్టం చేశారు. నిర్వాసితులకు 2013 చట్టం కంటే మెరుగైన ప్యాకేజీ ఇచ్చినం. అవన్నీ ప్రభుత్వ రికార్డులే. తెప్పించుకుని చూడు కళ్ళు తెరిచి మాట్లాడాలని సలహా ఇచ్చారు.
కొడంగల్‌లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పి, మళ్లీ వచ్చి మల్కాజ్‌గిరిలో పోటీ చేశాడు. ఆగస్టు 15లోగా రుణమాఫీ పూర్తి చేస్తామని మాట తప్పాడు. మాట మీద నిలబడని ముఖ్యమంత్రిగా రేవంత్ చరిత్రలో నిలుస్తారన్నారని విమర్శించారు.. 31 రకాల సాకులతో రుణమాఫీ ఎగ్గొట్టారు. దాన్ని పూర్తి రుణమాఫీ కాదు.. పాక్షిక రుణమాఫీ అంటారు. ఏడాది పూర్తి అవుతుంది. ఇంకా పూర్తి క్యాబినెట్ వేయలేక పోయావ్. రాష్ట్రం సమస్యల కుప్పగా మారింది. ముఖ్యమంత్రి చేయాల్సిన పనులు పక్కన పెట్టీ రాజకీయాలు చేస్తున్నావని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి.. కేసీఆర్ పెట్టిన బిక్ష..కేసీఆర్ ఇస్ ఏ సేవియర్ అండ్ ప్రొటెక్టర్ ఆఫ్ తెలంగాణ అని స్పష్టం చేశారు.
నా గురించి కేటీఆర్ గురించి మాట్లాడుతున్నారని, అలా మాట్లాడిన వాళ్ళు ఎటు పోయారో చూశామన్నారు. ముందు నీ పక్కన ఉన్నవాళ్లు నిన్ను ఫినిష్ చేయకుండా చూసుకో అని ఆయన వ్యాఖ్యానించారు. ఈరోజు ఎన్నికలు వస్తే 100 సీట్లు బీఆర్‌ఎస్‌కు వస్తాయని, ఓ మంత్రి గవర్నర్‌ను కలిశాడు.. ఓ మంత్రి హెలికాప్టర్ లేదని అలిగాడు.. ఓ మంత్రి ఢిల్లీ కి రెండుమూడు సార్లు ఢిల్లీ వెళ్ళాడు.. మరో ఇద్దరు ముగ్గురు మేము సీఎం అవుతాము అని సోషల్ మీడియా లో పెట్టుకుంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు. మూసీ పైన మా విజన్ ఎప్పుడో చెప్పామని, మూసీ రీజనరేషన్ కు మేము అనుకూలం.. కానీ సుందరీకరణ పేరిట రియల్ ఎస్టేట్ వ్యాపారానికి మేము వ్యతిరేకమన్నారు. కాళేశ్వరం నుంచి గోదావరి నీళ్లు మూసీకి తీసుకురావడానికి ఎప్పుడో డీపీఆర్ సిద్ధం అయిందన్నారు. 1100 కోట్లతో అయ్యే దానికి 7 వేల కోట్లు ఎందుకు పెడుతున్నారని, గచ్చిబౌలి లో కేసుల్లో ఉన్న 400 ఎకరాలు భూమి ని ప్రభుత్వం గెలిచిందన్నారు. ఆ భూమిలో మూపీ బాధితులకు పేదలకు 200 గజాల చొప్పున ఇవ్వాలని సూచించారు.
ఏక్ పోలీస్ అమలు చేయమంటే సస్పెండ్ చేయటం అన్యాయమని.. ఏక్ పోలీస్ అమలు చేస్తామని ఎన్నికల్లో రేవంత్ చెప్పలేదా? అని హరీష్ రావు ప్రశ్నించారు. తనకు రక్షణ కల్పించే పోలీసులపై కూడా రేవంత్ కు నమ్మకం లేకుండా పోయిందన్నారు. తండ్రే తన పిల్లలను నమ్మనట్లు.. రేవంత్ తీరుంది కానిస్టేబుల్స్ సమస్యలు తెలుసుకునే సమయం లేదా? సీఎంకు? బాపూఘాట్ లో భారీ గాంధీ విగ్రహాం పెడితే స్వాగతిస్తామన్నారు. కేసీఆర్ పెట్టిన అంబేద్కర్ విగ్రహానికి దండం పెట్టడు.. ప్రజలు దర్శించుకునే అవకాశం ఇవ్వడు .. రేవంత్ రెడ్డి తప్పిదాల వలన.. హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ డమాల్ అయిందన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా... గోల్ కొట్టేది మేమే..వికెట్ తీసేది మేమే.. ఈ లోపు హిట్ వికెట్ కాకుండా చూసుకో రేవంత్ అని హెచ్చరించారు.