(Source: ECI/ABP News/ABP Majha)
Hanamkonda News : మహిళా సీఐ ఇంట్లో మరో సీఐ, రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భర్త!
Hanamkonda News : హన్మకొండలో ముగ్గురు సీఐల మధ్య వివాదం తలెత్తింది. మహిళా సీఐ ఇంటికి మరో సీఐ ఆమె భర్త లేని సమయంలో వెళ్లాడు. వీరిని మహిళా సీఐ భర్త రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
Hanamkonda News :వారంతా చట్టానికి ప్రతినిధులు తప్పు చేసే ప్రబుద్ధులకు బుద్ధి చెప్పే గౌరవమైన వృత్తిలో ఉన్నారు. సమాజానికి ఆదర్శంగా నిలవాల్సిన వారే ఇప్పుడు నిందితులుగా నిలబడ్డ ఘటన ఇది. ఓ మహిళా సీఐ తన కొలీగ్ అయిన మరో సీఐతో రిలేషన్ పెట్టుకుంది. మహబూబాబాద్ లో పనిచేస్తున్నా బాధిత సీఐ తన భర్య మంగ సీఐ రవి కుమార్ తో సన్నిహితంగా ఉండగా రెడ్ హ్యాండెడ్ పట్టుకొని సుబేదారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, ఇద్దరు సీఐలను స్టేషన్ కి తరలించారు. ఐపీసీ 448, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు సుబేదారి పోలీసులు.
(సీఐ రవికుమార్)
అసలేం జరిగింది?
సీఐడీ ఇన్ స్పెక్టర్ బలబధ్ర రవికుమార్ పై సస్పెన్షన్ వేటు పడింది. సీఐని సస్పెన్షన్ చేస్తూ మంగళవారం అదనపు డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల హన్మకొండ రాంనగర్ లోని మహిళ ఇన్ స్పెక్టర్ ఇంట్లోకి ఆమె భర్త లేని సమయంలో బలభద్ర రవికుమార్ వెళ్లడం, అదే సమయంలో మహిళా ఇన్ స్పెక్టర్ భర్త రాంనగర్ లోని తమ ఇంటికి రావడం తీవ్ర చర్చకు దారి తీసింది. తాను ఇంట్లో లేని సమయంలో బలబద్ర రవికుమార్ అనుమతి లేకుండా తమ ఇంటికి రావడంపై మహిళా ఇన్ స్పెక్టర్ భర్త ఫిర్యాదు చేశారు. దీంతో అతడిపై హన్మకొండ సుబేదారి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైన విషయం తెలిసిందే. సదరు మహిళా ఇన్స్పెక్టర్ భర్త కూడా పోలీస్ ఇన్ స్పెక్టర్ కావడం, ఆయన మహబూబాబాద్ జిల్లాలో విధులు నిర్వహిస్తున్నారు. ఈ వివాదంలోని ముగ్గురు వ్యక్తులూ పోలీసు శాఖకు చెందిన ఇన్ స్పెక్టర్లే కావడం గమనార్హం. ఈ కేసు విచారణ నివేదిక మేరకు ఇక్కడ సీఐడీ విభాగంలో పనిచేస్తున్న ఇన్ స్పెక్టర్ బలబద్ర రవికుమార్ ను సస్పెన్షన్ చేస్తూ అదనపు డీజీ ఉత్తర్వులు జారీ చేశారు.
ఎస్సైపై గ్రామస్థులు దాడి
శ్రీకాకుళం జిల్లా లొద్దపుట్టిలో దారుణం జరిగింది. మంచి మార్గంలో నడవాలని చెప్పడానికి వచ్చి ఓ పోలీసులు అధికారిపైనే దాడికి పాల్పడ్డారు గ్రామస్థులు. అయితే గత కొంత కాలంగా ఇచ్చాపురం మండలం లొద్దపుట్టి గ్రామంలో ఎక్కువగా గొడవలు జరుగుతున్నాయని పోలీసులకు సమాచారం రావడంతో.. తరచుగా మందలించారు. తాజాగా లొద్ద పుట్టి గ్రామంలో దీపావళి పండుగలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండాలని చెప్పేందుకు సిబ్బందితో సహా ఎస్సై రామకృష్ణ గ్రామానికి వచ్చారు. ఈ క్రమంలోనే తరచుగా గ్రామంలో గొడవలు జరగుతున్నాని తెలసిందని.. ఈసారి దీపావళి పండుగలో మాత్రం ఎలాంటి వాగ్వాదాలు జరిగిన ఊరుకోమంటూ గ్రామస్థులను మందలించారు. దీంతో తీవ్ర కోపోద్రిక్తులైన గ్రామస్థులు.. ఒక్కసారిగా పోలీసులపై దాడి చేశారు. అనుకోని ఘటనతో పోలీసుల షాకయ్యారు. తేరుకునే లోపే గ్రామస్థులంతా మూకుమ్మడిగా దాడి చేయడంతో.. తీవ్ర గాయాలపాలయ్యారు. అయితే తరచుగా తమ గ్రామస్థులను మందలించడం వల్లే ఈ దాడికి పాల్పడినట్లు లొద్దపుట్టి వాసులు చెబుతున్నారు.