అన్వేషించండి

G Srinivasa Rao: డాక్టర్లు చేతులెత్తేశారు, తాయత్తు మహిమే నన్ను కాపాడింది, దానివల్లే ఇలా - డీహెచ్ శ్రీనివాసరావు వ్యాఖ్యలు

కొత్తగూడెం పట్టణంలోని బడే మజీద్ దగ్గర ఇంట్లో వాళ్లు తనకు తాయత్తు కట్టించారని గుర్తు చేశారు. ఆ తాయత్తు మహిమతోనే ఇప్పుడు తాను ఈ స్థాయిలో ఉన్నానని అన్నారు.

తెలంగాణ ప్రజారోగ్యశాఖ డైరెక్టర్ గడల శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశం అయ్యాయి. గతంలో తాను కట్టించుకున్న ఓ తాయత్తు వల్లే ఇప్పుడు తాను ఈ స్థాయిలో ఉన్నానని అన్నారు. కొత్తగూడెంలోని కేసీ ఓఏ క్లబ్‌‌లో డాక్టర్ జీఎస్ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సోమవారం (ఏప్రిల్ 17) ముస్లింలకు ఇఫ్తార్ విందు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాసరావు పాల్గొన్నారు. ముస్లింలతో ఆయన కలిసి నమాజ్ చేసి తర్వాత మాట్లాడారు. తాను పుట్టిన సమయం‌లో అనారోగ్యానికి గురయ్యానని, చావు బతుకుల మధ్య ఉన్న తనకు ఆ పరిస్థితుల్లో డాక్టర్లు కూడా ఏమీ చేయలేకపోయారని అన్నారు. అప్పుడు కొత్తగూడెం పట్టణంలోని బడే మజీద్ దగ్గర ఇంట్లో వాళ్లు తనకు తాయత్తు కట్టించారని గుర్తు చేశారు.

ఆ తాయత్తు మహిమతోనే ఇప్పుడు తాను ఈ స్థాయిలో ఉన్నానని అన్నారు. కొత్తగూడెంలో కొత్తగా ఈద్గాలు, కబరస్థాన్లు ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. కేసీఆర్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు నాలుగున్నర లక్షల మందికి రంజాన్ తోఫాలు పంపిణీ చేశారని తెలిపారు. రంజాన్ నెలలో మసీదులకు డబ్బులు ఇస్తున్నారని, అయితే అవి సరిపోవడం లేదని, ఇంకా పెంచుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. మరో కొత్తగూడానికి సమయం ఆసన్నమైందని, ముస్లింలంతా తనతో కలిసి రావాలని కోరారు. దేశంలో కొన్ని శక్తులు మన మధ్య చిచ్చు పెడుతున్నాయని అన్నారు.

గత డిసెంబరులో క్రైస్తవంపై వ్యాఖ్యలు
2022 డిసెంబరులో భద్రాద్రి కొత్త గూడెం జిల్లాలో డీఎస్ఆర్ ట్రస్ట్ తరపున ఏర్పాటు చేసిన సెమీ క్రిస్మస్ వేడుకల్లోనూ గడల శ్రీనివాసరావు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన  యేసు క్రీస్తు కృప వల్లే కరోనా నుంచి మనం విముక్తి అయ్యామని అన్నారు. మనం చేసిన సేవల వల్ల కాదు అంటూ వ్యాఖ్యానించారు. ఆధునిక సంస్కృతి కానీ.. మన దేశానికి కానీ.. మన రాష్ట్రానికి కానీ.. అది కేవలం క్రైస్తవ సోదరులు మాత్రమే వారధులని ఆయన అన్నారు. ఈ విషయాన్ని మనమంతా గుర్తు పెట్టుకోవాలని సూచించారు.  లేదంటే ప్రపంచంలో భారతదేశం మనుగడ సాధించలేకపోయేదని అన్నారు.

క్రైస్తవం లేకపోతే ప్రపంచంలో భారత దేశం ఇంత అభివృద్ది చెంది ఉండేది కాదని గడల శ్రీనివాసరావు స్పష్టం చేశారు ఆ రోజు ఎవరైతే ఆధునిక విద్యను, ఆధునిక వైద్యాన్ని, ఆధునిక సంస్కృతిని తీసుకొచ్చారో. వారి వల్లే మనం అభివృద్ధి చెందాం. మన దేశాన్ని అన్ని దేశాల కంటే ముందుండేలా చేసిందన్నారు.  యేసు నామాన్ని అనునిత్యం స్మరిస్తూ.. ఆ దేవుణి సందేశాన్ని ప్రతి ఒక్క గుండెకు, గడపకు చేరేలా చెయ్యాలని పిలుపునిచ్చారు.  ఇంతకు ముందు జరుపుకున్న క్రిస్మస్‌లు వేరు. ఇప్పుడు జరుపుకుంటున్న క్రిస్మస్‌లు వేరని..   గత రెండున్నర సంవత్సరాల నుంచి ప్రపంచ మానవాళికి ప్రశ్నార్థకంగా కొవిడ్ మారిందన్నారు.  దాన్నుంచి మనం ఇవాళ పూర్తిగా విముక్తి అయ్యామన్నారు.  అది మనం చేసిన సేవల వల్ల కాదు. యేసు క్రీస్తు కృప, యేసు క్రీస్తు దైవం యెుక్క దయ ప్రభావం అని స్పష్టం చేశారు. 

కేసీఆర్ కాళ్లు మొక్కి రాజభక్తి
గతంలోనూ సీఎం కేసీఆర్‌కు శ్రీనివాసరావు పాదాభివందనం చేసి తీవ్ర విమర్శల పాలయ్యారు. తర్వాత మరో సందర్భంలో కేసీఆర్ జన్మదినం సందర్భంగా అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో మొక్కలు నాటాలని పిలుపు ఇచ్చారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TTD Key Decisions: శ్రీవాణి ట్రస్ట్ రద్దు సహా తొలి భేటీలో టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు
శ్రీవాణి ట్రస్ట్ రద్దు సహా తొలి భేటీలో టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు
Amazon India: ఏపీ సరిహద్దుకు బెంగళూరు అమెజాన్ క్యాంపస్ -  రెంట్ మిగుల్చుకోవడానికి కంపెనీ అవస్థలు !
ఏపీ సరిహద్దుకు బెంగళూరు అమెజాన్ క్యాంపస్ - రెంట్ మిగుల్చుకోవడానికి కంపెనీ అవస్థలు !
Hyundai CNG Sales: మాకు సీఎన్‌జీ కార్లే కావాలంటున్న ప్రజలు - భారీగా పెరుగుతున్న డిమాండ్!
మాకు సీఎన్‌జీ కార్లే కావాలంటున్న ప్రజలు - భారీగా పెరుగుతున్న డిమాండ్!
Nayanthara Vs Dhanush: ఎన్ఓసీ లేకుండా వాడేసిన నయన్ - ఇప్పుడు ధనుష్ ఏం చేస్తాడో?
ఎన్ఓసీ లేకుండా వాడేసిన నయన్ - ఇప్పుడు ధనుష్ ఏం చేస్తాడో?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Pushpa 2 The Rule Trailer Decoded | Allu Arjun  మాస్ మేనియాకు KGF 2 తో పోలికా.? | ABP Desamపుష్ప 2 సినిమాకి మ్యూజిక్ డీఎస్‌పీ మాత్రమేనా?వైసీపీ నేతపై వాసంశెట్టి అనుచరుల దాడిబోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఫస్ట్ టెస్ట్‌కి దూరంగా రోహిత్ శర్మ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TTD Key Decisions: శ్రీవాణి ట్రస్ట్ రద్దు సహా తొలి భేటీలో టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు
శ్రీవాణి ట్రస్ట్ రద్దు సహా తొలి భేటీలో టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు
Amazon India: ఏపీ సరిహద్దుకు బెంగళూరు అమెజాన్ క్యాంపస్ -  రెంట్ మిగుల్చుకోవడానికి కంపెనీ అవస్థలు !
ఏపీ సరిహద్దుకు బెంగళూరు అమెజాన్ క్యాంపస్ - రెంట్ మిగుల్చుకోవడానికి కంపెనీ అవస్థలు !
Hyundai CNG Sales: మాకు సీఎన్‌జీ కార్లే కావాలంటున్న ప్రజలు - భారీగా పెరుగుతున్న డిమాండ్!
మాకు సీఎన్‌జీ కార్లే కావాలంటున్న ప్రజలు - భారీగా పెరుగుతున్న డిమాండ్!
Nayanthara Vs Dhanush: ఎన్ఓసీ లేకుండా వాడేసిన నయన్ - ఇప్పుడు ధనుష్ ఏం చేస్తాడో?
ఎన్ఓసీ లేకుండా వాడేసిన నయన్ - ఇప్పుడు ధనుష్ ఏం చేస్తాడో?
RGV News: ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
Realme GT 7 Pro Launch Date: రూ.1000 పెట్టి బుక్ చేస్తే రూ.6598 విలువైన ఆఫర్ - రియల్‌మీ జీటీ 7 ప్రో ప్రీ బుకింగ్స్ స్టార్ట్!
రూ.1000 పెట్టి బుక్ చేస్తే రూ.6598 విలువైన ఆఫర్ - రియల్‌మీ జీటీ 7 ప్రో ప్రీ బుకింగ్స్ స్టార్ట్!
TGTET: 'టెట్‌' అభ్యర్థులకు అలర్ట్, వివరాల్లో తప్పుల సవరణకు నవంబరు 22 వరకు అవకాశం
'టెట్‌' అభ్యర్థులకు అలర్ట్, వివరాల్లో తప్పుల సవరణకు నవంబరు 22 వరకు అవకాశం
Pakistan: అడుక్కునేవాళ్లింట్లో ఫంక్షన్‌కు 20వేల మంది గెస్టులు-కోటిన్నర ఖర్చు- పాకిస్తాన్‌లో అంతే !
అడుక్కునేవాళ్లింట్లో ఫంక్షన్‌కు 20వేల మంది గెస్టులు-కోటిన్నర ఖర్చు- పాకిస్తాన్‌లో అంతే !
Embed widget