News
News
X

Telangana Foxcon : తెలంగాణలో ఫాక్స్ కాన్ భారీ పెట్టుబడులు - లక్ష ఉద్యోగాలు ఖాయమన్న ప్రభుత్వం !

తెలంగాణలో ఫాక్స్ కాన్ సంస్థ భారీ పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించుకుంది. ఈ పెట్టుబడుల వల్ల లక్ష ఉద్యోగాలు వస్తాయని అంచనా వేస్తున్నారు.

FOLLOW US: 
Share:

Telangana Foxcon :     ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి రంగంలో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ‘హోన్ హై ఫాక్స్ కాన్ ’  సంస్థ చైర్మన్ యంగ్ ల్యూ  నేతృత్వంలోని ప్రతినిధి బృందం సీఎం కేసీఆర్ తో ఇవాళ ప్రగతి భవన్ లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఫాక్స్ కాన్ కంపెనీకి ప్రభుత్వానికి మధ్య  ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ద్వారా ‘హోన్ హై ఫాక్స్ కాన్ ’ సంస్థ రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల పరిశ్రమను నెలకొల్పేందుకు మార్గం సుగమమైంది. దీంతో ఒక లక్ష ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది.   ప్రత్యక్షంగా, పరోక్షంగా స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి లభించనుంది. 

ఎలక్ట్రానిక్స్ రంగంలో దేశంలోకి వచ్చిన అతిపెద్ద పెట్టుబడుల్లో ఇది ముఖ్యమైనది. ఒకే సంస్థ ద్వారా లక్షమందికి నేరుగా ఉద్యోగాలు లభించడం అత్యంత అరుదైన విషయమని తెలంగాణ ప్రభుత వర్గాలు చెబుతున్నాయి.  యంగ్ ల్యూ పుట్టిన రోజు కూడా ఇదే రోజుకూడా కావడంతో స్వదస్తూరితో ప్రత్యేకంగా తయారు చేయించిన గ్రీటింగ్ కార్డును సీఎం కేసీఆర్ స్వయంగా యాంగ్ ల్యూకి అందచేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

తెలంగాణ‌లో ఫాక్స్ కాన్ పెట్టుబ‌డుల‌పై హ‌ర్షం వ్య‌క్తం చేస్తూ రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ల‌క్ష మందికి ఉపాధి క‌ల్పించ‌డం గొప్ప విష‌య‌మ‌న్నారు. ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో సీఎం కేసీఆర్‌ను క‌లిసిన అనంత‌రం ఫాక్స్ కాన్ చైర్మ‌న్ యంగ్ లియూ ప్ర‌క‌టించార‌ని కేటీఆర్ పేర్కొన్నారు.

టీ-వర్క్స్‌ను   ఫాక్స్‌కాన్‌ కంపెనీ చైర్మన్‌ యంగ్‌లూ ప్రారంభించనున్నారు. టీ వర్క్స్ ఏర్పాటులో ఫాక్స్ కాన్ కూడా సహకరించింది. ఫాక్స్ కాన్ సంస్థ ప్రపంచంలో తయారయ్యే సెల్ ఫోన్లలో అత్యధికం తయారు చేస్తుంది. యాపిల్ ఐ ఫోన్లను కూడా యాపిల్ సంస్థ ఫాక్స్ కాన్ ద్వారానే ఉత్పత్తి  చేయిస్తుంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ప్లాంట్లు పెట్టిన ఫాక్స్ కాన్.. తెలంగాణలో ఏ యే రంగాల్లో పెట్టుబడులు పెడుతుందన్నది ఆసక్తికరంగా మారింది.                        

Published at : 02 Mar 2023 05:40 PM (IST) Tags: KTR Telangana Investments CM KCR Fox Con Fox Con Investments in Telangana

సంబంధిత కథనాలు

Warangal Congress Politics : వరంగల్ కాంగ్రెస్ లో కుమ్ములాటలు? జంగా రాఘవరెడ్డిపై వేటు!

Warangal Congress Politics : వరంగల్ కాంగ్రెస్ లో కుమ్ములాటలు? జంగా రాఘవరెడ్డిపై వేటు!

Polavaram Flood: మూడు నెలల సమయం కావాలంటూ సుప్రీంకు కేంద్రం లేఖ

Polavaram Flood: మూడు నెలల సమయం కావాలంటూ సుప్రీంకు కేంద్రం లేఖ

ఈడీ విచారణపై సుప్రీంకోర్టులో కవిత వేసిన పిటిషన్ విచారణ మూడు వారాలకు వాయిదా

ఈడీ విచారణపై సుప్రీంకోర్టులో కవిత వేసిన పిటిషన్ విచారణ మూడు వారాలకు వాయిదా

Breaking News Live Telugu Updates: వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ అధికారిని మార్చండి - సుప్రీంకోర్టు

Breaking News Live Telugu Updates: వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ అధికారిని మార్చండి - సుప్రీంకోర్టు

Viveka Murder Case: వివేకా హత్య కేసు విచారణపై సుప్రీంకోర్టు ఆగ్రహం - ఆ అధికారిని మార్చాలని ఆదేశాలు

Viveka Murder Case: వివేకా హత్య కేసు విచారణపై సుప్రీంకోర్టు ఆగ్రహం - ఆ అధికారిని మార్చాలని ఆదేశాలు

టాప్ స్టోరీస్

Car Fuel Tank Tips: కారులో ట్యాంక్ ఫుల్ చేయిస్తున్నారా? - అయితే మీ వాహనం డేంజర్‌లో ఉన్నట్లే! - ఎందుకో తెలుసా?

Car Fuel Tank Tips: కారులో ట్యాంక్ ఫుల్ చేయిస్తున్నారా? - అయితే మీ వాహనం డేంజర్‌లో ఉన్నట్లే! - ఎందుకో తెలుసా?

TSPSC Paper Leak: టీఎస్పీఎస్సీ కేసులో మరో అరెస్టు, ఇప్పటిదాకా 15 మంది - అన్ని జిల్లాలకీ పాకిన క్వశ్చన్ పేపర్?

TSPSC Paper Leak: టీఎస్పీఎస్సీ కేసులో మరో అరెస్టు, ఇప్పటిదాకా 15 మంది - అన్ని జిల్లాలకీ పాకిన క్వశ్చన్ పేపర్?

‘ఆర్ఆర్ఆర్’ ఆస్కార్ ప్రమోషన్స్ లెక్కలు బయటపెట్టిన కార్తికేయ, మొత్తం ఖర్చుపై క్లారిటీ

‘ఆర్ఆర్ఆర్’ ఆస్కార్ ప్రమోషన్స్ లెక్కలు బయటపెట్టిన కార్తికేయ, మొత్తం ఖర్చుపై క్లారిటీ

Prem Rakshith Rahul SipliGunj Oscars : రామ్ చరణ్ బర్త్ డే సెలబ్రేషన్స్ లో ఆస్కార్ విజేతలు | ABPDesam

Prem Rakshith Rahul SipliGunj Oscars : రామ్ చరణ్ బర్త్ డే సెలబ్రేషన్స్ లో ఆస్కార్ విజేతలు | ABPDesam