News
News
వీడియోలు ఆటలు
X

Venkaiah Naidu : ఉచితాల‌తో ఖ‌జానా ఖాళీ - జ‌నాక‌ర్ష‌క ప‌థ‌కాల‌పై వెంక‌య్య‌ నాయుడు ఏమన్నారంటే?

ప్రతిదీ ఉచితం అనే పరిస్థితి మారాల్సిన అవసరం ఉందని, నిధుల్లో సింహ భాగం విద్య‌, వైద్య‌ రంగాలకు కేటాయించాలని మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు సూచించారు.

FOLLOW US: 
Share:

 జనాకర్షక పథకాల మీద కాకుండా జనహిత పథకాలకు ప్రాధాన్యత పెరగాలని పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు ప్రజలకు హితవు పలికారు. స్వర్ణభారత్ ట్రస్ట్, హైదరాబాద్ చాప్టర్‌లో యశోద హాస్పిటల్స్ సహకారంతో ఏర్పాటు చేసిన ఉచిత ఆరోగ్య వైద్య శిబిరాన్ని ఈ రోజు ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి సినీ న‌టుడు బ్రహ్మానందం ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. ఈ సందర్భంగా స్వర్ణభారత్ ట్రస్ట్ కార్యక్రమాలను ఆయ‌న‌ అభినందించారు. ముఖ్యంగా యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చి, వారి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతున్న ట్రస్ట్ చొరవను కొనియాడారు.

ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. ప్రతిదీ ఉచితం అనే పరిస్థితి మారాల్సిన అవసరం ఉందని, నిధుల్లో సింహ భాగం విద్య‌, వైద్య‌ రంగాలకు కేటాయించాలని సూచించారు. ముఖ్యంగా పేదలకు ఉచిత వైద్య సదుపాయాలు అందించేందుకు కృషి జరగాలన్న ఆయన.. వైద్యరంగంలో గ్రామీణ - పట్టణ ప్రాంతాల మధ్య అంతరం తొలగాలని ఆకాంక్షించారు. విద్యా రంగంలో నైపుణ్య శిక్షణకు ప్రాధాన్యత పెరగాలని పేర్కొన్న‌ ఆయన, జ్ఞాన సముపార్జన నైపుణ్య శిక్షణలే పేదరికాన్ని పారద్రోలే మంచి మార్గాలని తెలిపారు. యువత అతిగా స్మార్ట్‌ ఫోన్లను వాడటం సరికాదని.. పుస్తక పఠనంపై కూడా ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పారు.

ఆరోగ్యాన్ని కాపాడుకోవటంతో పర్యావరణ పరిరక్షణ ప్రాధాన్యత అవ‌స‌రం ఎంతోఉంద‌ని, నానాటికి పెరిగిపోతున్న‌ భూతాపం కారణంగా తీవ్రమైన వాతావరణ పరిస్థితులు, తుఫానులు, ఉరుములతో కూడిన తుఫానులు, కరువుల రూపంలో అనేక సమస్యలను ఎదుర్కొంటున్నామని ఆందోళ‌న వ్య‌క్తంచేశారు. వాతావరణ పరిస్థితుల్లో వస్తున్న మార్పులు మన వ్యవసాయ రంగాన్ని, తద్వారా ఆర్థిక వ్యవస్థను కూడా ప్రభావితం చేస్తున్నాయని తెలిపారు. వీటి కారణంగా నీటికొరత, నదులు ఎండిపోవడం, కాలుష్యం పెరగడం లాంటి ప్రతికూల పరిస్థితులు మానవ జాతితో పాటు పలు జంతు, వృక్ష జాతుల మీద కూడా తీవ్రమైన ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయని తెలిపారు. ఈ పరిస్థితి మారాలంటే పర్యావరణాన్ని కాపాడుకోవటం ఒక్కటే మార్గమని వెంక‌య్య‌నాయుడు సూచించారు.

అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, చైతన్యరహితమైన పని విధానం... తదితర అంశాలు అనారోగ్యాలకు చేరువ చేస్తున్నాయని ఆయ‌న ఆందోళ‌న వ్య‌క్తంచేశారు. యోగ, నడక, వ్యాయామం ద్వారా శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చని వెంక‌య్య‌నాయుడు తెలిపారు. ఆహారపు అలవాట్లు మారిపోయి, ప్రతి ఒక్కరూ ఫాస్ట్ ఫుడ్ సంస్కృతి వైపు వెళుతున్నారని, ఈ పరిస్థితి మారాల‌ని.. భారతీయ సంప్ర‌దాయ‌ ఆహారపు అలవాట్ల మీద దృష్టి కేంద్రీకరించాలని హితవు పలికారు. మన పెద్దలు కాలానుగుణంగా ఆరోగ్యకరమైన ఆహారాన్ని మనకు సూచించారని, వారు చూపిన బాటలో ముందుకు సాగి, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని వెంక‌య్య‌నాయుడు కోరారు.

Published at : 02 Apr 2023 07:33 PM (IST) Tags: Free Schemes Venkaiah Naidu Skill Development ex vice president

సంబంధిత కథనాలు

Khelo India: ఓయూ అమ్మాయిలు అదుర్స్‌! యూనివర్సిటీ టెన్నిస్‌లో వరుసగా మూడోసారి ఫైనల్‌కు!

Khelo India: ఓయూ అమ్మాయిలు అదుర్స్‌! యూనివర్సిటీ టెన్నిస్‌లో వరుసగా మూడోసారి ఫైనల్‌కు!

మెగాస్టార్‌ చిరంజీవితో మాజీ జేడీ లక్ష్మీనారాయణ భేటీ

మెగాస్టార్‌ చిరంజీవితో మాజీ జేడీ లక్ష్మీనారాయణ భేటీ

Rains in Telangana: మరో మూడ్రోజులు తెలంగాణలో ఎండావాన - ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ

Rains in Telangana: మరో మూడ్రోజులు తెలంగాణలో ఎండావాన - ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ

కాంగ్రెస్‌లోకి జూపల్లి, పొంగులేటి- సంకేతాలు ఇచ్చిన ఈటల !

కాంగ్రెస్‌లోకి జూపల్లి, పొంగులేటి- సంకేతాలు ఇచ్చిన ఈటల !

Top Headlines Today: నేటి నుంచి యువగళం పునఃప్రారంభం, విజయవాడలో సీఎం జగన్ టూర్

Top Headlines Today: నేటి నుంచి యువగళం పునఃప్రారంభం, విజయవాడలో సీఎం జగన్ టూర్

టాప్ స్టోరీస్

BRS Politics : కలిసి నడిచేందుకు వచ్చిన వారందర్నీ దూరం పెడుతున్న కేసీఆర్ - జాతీయ వ్యూహం మారిపోయిందా ?

BRS Politics : కలిసి నడిచేందుకు వచ్చిన వారందర్నీ దూరం పెడుతున్న కేసీఆర్ -   జాతీయ వ్యూహం మారిపోయిందా ?

Delhi Murder Case: మాట్లాడటం లేదనే ఢిల్లీలో బాలిక హత్య- నేరాన్ని అంగీకరించిన సాహిల్

Delhi Murder Case: మాట్లాడటం లేదనే ఢిల్లీలో బాలిక హత్య- నేరాన్ని అంగీకరించిన సాహిల్

Prabhas Vs Bollywood Heroes : ప్రభాస్ కంటే శ్రీ రాముని పాత్రకు ఆ హిందీ హీరోలు బెటరా?

Prabhas Vs Bollywood Heroes : ప్రభాస్ కంటే శ్రీ రాముని పాత్రకు ఆ హిందీ హీరోలు బెటరా?

AP Cabinet Meeting : ఏడో తేదీన ఏపీ కేబినెట్ భేటీ - ముందస్తు నిర్ణయాలుంటాయా ?

AP Cabinet Meeting :  ఏడో తేదీన ఏపీ కేబినెట్ భేటీ - ముందస్తు నిర్ణయాలుంటాయా ?