(Source: ECI/ABP News/ABP Majha)
Telangana Congress: మునుగోడులో మూతి పగలగొట్టే తీర్పు, కాపలా కుక్కలా ఉంటానని నక్కలా మారతారా?: మాజీ ఎంపీ
ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్ర వాళ్ల దోపిడీ అన్న కేసీఆర్ ప్రత్యేక రాష్ట్రంలో ఏం చేశారని మధుయాస్కి నిలదీశారు. 2014లో సమైఖ్య పాలనలో తెలంగాణకు అన్యాయం జరుగుతుందని అన్నాడని గుర్తు చేశారు.
రాష్ట్రం ఏర్పడ్డాక ఎనిమిదేళ్ల నుంచి రాజకీయ కాంక్ష కోసం ఉద్యమ పార్టీ అంటూ టీఆర్ఎస్ ద్వారా తెలంగాణను దోచుకుంటున్నారని మాజీ ఎంపీ మధుయాస్కి గౌడ్ ఆరోపించారు. రాజకీయ కాంక్షను నెరవేర్చుకోవడానికి, విస్తరించడానికి రేపు జాతీయ పార్టీని పెడుతున్నారని అన్నారు. ఇప్పుడు జాతీయ పార్టీ అంటూ మరోసారి ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారని అన్నారు. ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్లు కొంటున్నాడని అన్నారు. దాన్ని బట్టే కేసీఆర్ దోపిడీ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చని అన్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్ర వాళ్ల దోపిడీ అన్న కేసీఆర్ ప్రత్యేక రాష్ట్రంలో ఏం చేశారని నిలదీశారు. 2014లో సమైఖ్య పాలనలో తెలంగాణకు అన్యాయం జరుగుతుందని అన్నాడని గుర్తు చేశారు. రాష్ట్ర ఏర్పాటు జరిగితే బహుజనులకు, రైతులకు న్యాయం జరుగుతుందని చెప్పేవాడని అన్నారు.
2018 ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే చంద్రబాబు నాయుడు చేతిలోకి వస్తుంది అన్నాడు. బీఅరెస్ మొదలైతే టీఆర్ఎస్ కు తెలంగాణ ప్రజలు వాలంటీరి రిటైర్మెంట్ ఇస్తారు. జాతీయ పార్టీ పేరుతో కుమారుడు, కుమార్తె, అల్లుడికి రాజ్య విస్తరణ చేసి పదవులు ఇస్తాడు. జాతీయ పార్టీ ఏర్పాటు. తెలంగాణ కోసం పోరాటం చేసిన రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు దీనిపై అందరూ ఆలోచించాలి.
తెలంగాణ జాతిపిత కేసీఆర్ అని చెప్పుకుంటున్నాడు.. కానీ కేసీఆర్ తెలంగాణ జాతి ద్రోహి. మునుగోడు ఎన్నికల్లో టీఆర్ఎస్ ను రాజకీయ బొంద పెట్టాలి. మునుగోడు ప్రజలు ముదనష్టపు కేసీఆర్ మూతి పగలగొట్టెలా తీర్పు చెబుతారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే నా లక్ష్యం.. రాష్ట్ర ఏర్పాటు తరువాత కాపలా కుక్కలా ఉంటా అన్నాడు.. కానీ కటేసే నక్కలా మారి వేలాది కోట్ల దోచుకుంటున్నాడు. ఈ 8 సంవత్సరాల్లో పార్టీకి రూ.900 కోట్లు వచ్చాయంటే ఎవడి అబ్బా సొమ్ము అది?
అప్పట్లో పార్టీ పెట్టుకోవడానికి కూడా జాగా లేకపోతే.. కొండా లక్ష్మణ్ బాపూజీ ఇల్లు ఇచ్చాడు. 2010లో తెలంగాణ బిడ్డలు ప్రాణాలు అర్పిస్తుంటే మేము అధికార పార్టీలో ఉండి సొంత పార్టీని వ్యతిరేకించాం. తెలంగాణ కోసం నాడు బహుజన బిడ్డలు ప్రాణాలు అర్పిస్తే కేసీఆర్ కుటుంబ సభ్యులు, కంపెనీలు స్టార్ట్ చేసి వ్యాపారాలు చేశారు. గాడ్సే ప్రతినిథిగా వస్తున్న కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుని బొంద పెట్టాలి. మునుగోడులో కేసీఆర్ మూతి పగిలేలా ప్రజల తీర్పు ఇవ్వాలి’’ అని మధుయాస్కి పిలుపునిచ్చారు.
వ్యూహాల కోసం కాంగ్రెస్ నేతల సమావేశం
గాంధీభవన్ లో మునుగోడు ఉప ఎన్నికల సమీక్ష సమావేశం మొదలైంది. ఏఐసీసీ ఇంచార్జ్ మనిక్కమ్ ఠాగూర్, టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి లతో పాటు మండల ఇంచార్జ్ లు పాల్గొన్నారు. ఈ రోజు సాయంత్రం 4.30 గంటలకు బోయినిపల్లి లోని రాజీవ్ గాంధీ ఐడియాలోజి సెంటర్ లో భారత్ జోడో యాత్ర పై సమీక్ష సమావేశం జరుగుతుంది. ఏఐసీసీ యాత్ర నిర్వాహకులు దిగ్విజయ్ సింగ్, జైరాం రమేష్, కొప్పుల రాజు, టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర యాత్ర కన్వీనర్ బలరాం నాయక్ లతో పాటు రాష్ట్రంలోని ముఖ్య నాయకులు నియోజక వర్గ ఇంఛార్జిలు పాల్గొంటారు.