By: ABP Desam | Updated at : 27 Sep 2021 03:02 PM (IST)
Edited By: Rajasekhara
సజ్జనార్‌కు సమన్లు జారీ చేసిన జస్టిస్ సిర్పూర్కర్ కమిషన్
సైబరాబాద్ మాజీ పోలీస్ కమిషనర్ .. ఎక్కడైనా ఎన్ కౌంటర్ అనే మాట వినిపిస్తే ఠక్కున గుర్తుకు వచ్చే ఐపీఎస్ ఆఫీసర్ అయిన సజ్జనార్‌కు చిక్కులు ఏర్పడుతున్నాయి. దిశా నిందితుల ఎన్ కౌంటర్ .. బూటకమా, నిజంగానే ఎదురు కాల్పులు జరిగాయా అన్న అంశంపై విచారణ జరుపుతున్న సిర్పూర్కర్ కమిషన్ సజ్జనార్‌కు సమన్లు జారీ చేసింది. తమ ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. ఆయన మంగళవారం లేదా బుధవారం సిర్పూర్కర్ కమిషన్ ముందు హాజరయ్యే అవకాశం ఉంది. ఇటీవలే ఆర్టీసీ ఎండీగా ఆయన బాధ్యతలు చేపట్టారు.
Also Read : భర్త చేసిన పని తట్టుకోలేకపోయిన మహిళా సర్పంచ్, వెంటనే ఆత్మహత్య.. ఏం జరిగిందంటే..
దిశ ఎన్ కౌంటర్ అంశం బూటకమని సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు కావడంతో జస్టిస్ వీఎస్ సిర్పూర్కర్ నేతృత్వంలోని త్రిసభ్య కమిషన్‌ను సుప్రీంకోర్టు నియమించింది. దిశ ఘటనలో నిందితులు ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన ఉదంతంలో ఏదైనా నేరం జరిగిందా.. జరిగితే అందుకు బాధ్యులెవరో తేల్చాలని విధివిధానాలు నిర్దేశించారు. ఈ కమిటీలో బాంబే హైకోర్టు మాజీ న్యాయమూర్తి రేఖా ప్రకాశ్ బాల్డోట, సీబీఐ మాజీ డైరెక్టర్ డీఆర్ కార్తికేయన్ సభ్యులుగా ఉన్నారు. ఈ త్రిసభ్య కమిటీ విచారణ జరుపుతోంది. కరోనా కారణంగా కొంత ఆలస్యం కాగా.. సుప్రీంకోర్టు గడువు పొడిగించింది. కొంత కాలంగా బాధితుల్ని, అధికారుల్ని కూడా జిస్టిస్ సిర్ఫూర్కర్ కమిటీ సమన్లు జారీ చేసి పిలిపించి ప్రశ్నిస్తోంది.
దిశ కేసు విచారణాధికారులందర్నీ జస్టిస్ సిర్పూర్కర్ కమిటీ ఇప్పటికే పరశ్నించింది. సిట్ ఇన్‌ఛార్జి సురేందర్‌రెడ్డి... హోంశాఖ కార్యదర్శి నుంచి అదనపు వివరాలు తీసుకుంది. ఆ తర్వాత ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన నిందితుల కుటుంబసభ్యులను కూడా పిలిచించి వాంగ్మూలాలు తీసుకున్నారు. అంతిమంగా అసలు దిశ కేసులో నిందితులు వాళ్లే అనడానికి ఎలాంటి ఆధారాలున్నాయో కూడా సమాచారం సేకరించినట్లుగా తెలుస్తోంది. అలాగే దిశ హత్యాచారం, ఎన్‌కౌంటర్‌పై విచారణకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం చీఫ్‌గా మహేశ్ భగవత్‌ను నియమించింది. ఆయన ఇప్పటికే పలుమార్లు కమిషన్ ముందు హాజరయ్యారు. అనేక విషయాలను ఆయన కమిషన్‌కు వివరించారు.
Also Read : భార్య గొంతు కోసేసిన భర్త, తర్వాత చెయ్యి కట్ చేసుకొని.. పెళ్లైన నెలరోజులకే దారుణం
ఆయితే మహేష్ భగవత్ చెబుతున్న విషయాల్లో చాలా వరకు పొంతన లేనివి ఉండటంతో మళ్లీ మళ్లీ పిలుస్తున్నారు. అధికారులు సరైన వివరాలు చెప్పకపోవడం... ఎన్ కౌంటర్ విషయంలో కమిషన్ లెవనెత్తుతున్న సందేహాలను క్లియర్ చేయడంతో తడబడుతూండటం సజ్జనార్‌కు ఇబ్బందికరంగా మారే అవకాశం కనిపిస్తోందని అంటున్నారు. జస్టిస్ సిర్పూర్కర్ సజ్జనార్‌ను కూడా ప్రశ్నించిన తర్వాత నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించే అవకాశం ఉంది. దీనికి మరో రెండు, మూడు నెలల సమయం పట్టవచ్చని అంటున్నారు. ఒక వేళ ఉన్న ఆధారాల మేరకు జస్టిస్ సిర్పూర్కర్ కమిషన్ ఎన్ కౌంటర్ బూటకమని నివేదిక ఇస్తే సజ్జనార్ ఇబ్బంది పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
Watch Video : మరుగుదొడ్డే ఆ తల్లీపిల్లలకు నివాసం
Hyderbad Crime : ఆన్లైన్ లో కాంటాక్ట్ చేసి హైదరాబాద్ కు రప్పించి, వ్యాపారి నుంచి డైమండ్ కొట్టేసిన కేటుగాడు
Adilabad News : కట్టెల కోసం వెళ్లిన ఆదివాసీపై అటవీ అధికారుల దాడి, విషమంగా ఆరోగ్య పరిస్థితి
Traffic Challans: సామాన్యుడికి ఓ న్యాయం - సార్లకో న్యాయమా ? బోత్ ఆర్ నాట్ సేమ్ ఎందుకు!
BRS Joinings : బీఆర్ఎస్లో చేరిన ఒడిషా మాజీ సీఎం సహా కీలక నేతలు - మహాభారత్‌ను నిర్మిద్దామని కేసీఆర్ పిలుపు !
Puvvada Ajay Kumar :మంత్రి పువ్వాడ అజయ్ కు కోర్టు ధిక్కరణ నోటీసులు
Tarak ratna Health Update : మెరుగైన వైద్యం కోసం బెంగళూరు ఆసుపత్రికి తారకరత్న, కుప్పం నుంచి గ్రీన్ ఛానల్
APPSC Group1 Prelims Results: గ్రూప్-1 ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే! మెయిన్స్‌కు 6,455 మంది ఎంపిక!
Perni Nani : అన్నీ మంచి చేస్తే రోడ్డెందుకు ఎక్కాల్సి వచ్చింది ? లోకేష్‌కు పేర్ని నాని కౌంటర్ !
Pawan Kalyan: ఈ పెళ్లిళ్ల గొడవ ఏంటయ్యా - వివాదాస్పద టాపిక్ టచ్ చేసిన బాలయ్య - పవర్ ప్రోమో చూశారా?