అన్వేషించండి

Telangana: తెలంగాణలో పెరిగిన విద్యుత్ వినియోగం, కోట్లు పెట్టి కొంటున్నా కొరతే

Telangana : ఎండ వేడితో తెలంగాణ వ్యాప్తంగా పెరిగిన విద్యుత్ వినియోగం.

తెలుగు రాష్ట్రాల్లో ఈ సంవత్సరం వానలు సరిగా పడలేదు. చూస్తుండగానే  వానాకాలం ముగిసిపోయింది. త్వరలో చలికాలం మొదలవుతోంది. అయినా సరే ఎండలు మండిపోతున్నాయి. దీంతో తెలుగు రాష్ట్రాల్లో అసాధారణంగా   విద్యుత్ వినియోగం పెరిగిపోయింది.  నిరంతర విద్యుత్  సరఫరాకు రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థలు నా నా ఇబ్బందులు పడుతున్నాయి. ఈమేరకు తెలంగాణ ట్రాన్స్కో, ఎన్టిపిసి కి  అదనపు విద్యుత్ కావాలంటూ విన్నవించుకుంది. తెలంగాణ ఇప్పటికే  భారత ఇంధన ఎక్స్చేంజి నుంచి ఏడు కోట్లకు పైగా యూనిట్లు అందుకుంటున్న  ఫలితం లేకుండా పోవటంతో తమకు అదనంగా మరి కొంత సరఫరా చేయాలని తెలంగాణ ట్రాన్స్కో తాజాగా ఎన్టిపిసి ని కోరింది. అంతేకాదు దేశవ్యాప్తంగా ఎక్కడ కరెంటు నిల్వలు మిగిలి ఉంటే అది తెలంగాణకే ఇవ్వాలని అడిగింది.

నిజానికి తెలంగాణాలో  కొద్దిరోజుల పాటు కుండపోత వర్షాలు కురవగా తరువాత  ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం నుంచే ఎండ మొదలవుతుండటంతో వాతావరణం వేడెక్కుతోంది. రెండు, మూడు రోజులుగా రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయి. ఎండ వేడి పెరగడంతో ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ దెబ్బకి విద్యుత్ వినియోగం కూడా ఎక్కువ అయ్యింది.  రాబోయే ఐదు రోజులు కూడా పగటి ఉష్ణోగ్రతలు మరింత పెరుగనున్నట్టు వాతావరణ శాఖ పేర్కొన్నది. ఫిబ్రవరి చివరి వారం, మార్చి మొదటి వారంలో ఉండే మాదిరిగా ప్రస్తుతం వాతావరణం ఉంటుందని చెప్పింది.

సాగర్‌ ఆయకట్టుతో పాటు తెలంగాణ లో అనేక చోట్ల రైతులు లోఓల్టేజీ సమస్యతో సతమతమవుతున్నారు. అంతేకాదు కనీసం  10 గంటలు కూడా విద్యుత్‌ సరఫరా కావడం లేదని ఆరోపిస్తున్నారు. ఆయకట్టులో బోరు బావుల కింద వేసిన పంటలకు ఈ సమయంలోనే అధికంగా పంట పొలాలకు నీటి అవసరం ఏర్పడుతుందాని చెబుతున్నారు. ఈ సమయంలో  విద్యుత్‌ సరఫరా సక్రమంగా చేయకపోవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.   

దేశవ్యాప్త డిమాండు పెరగడంతో ఎక్స్ఛేంజీలో ప్రస్తుతం ఒక్కో యూనిటు సగటున రూ.7కుపైగా చెల్లించి  కొనుగోలు చేయాల్సిరావడంతో డిస్కంలు కూడా తీవ్ర  ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. మొన్న ఆగస్టులో రూ.1,100 కోట్లు, తరువాత సెప్టెంబరులో రూ.650 కోట్లు వెచ్చించి  అదనంగా విద్యుత్కొ నుగోలు చేసిన డిస్కంలు ఈ నెలలో మరోసారి  కొనాల్సి రావడంతో ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నాయి.  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి పూర్తిగా ,  ఎస్టీ, ఎస్టీల ఇళ్లకు 101 యూనిట్ల వరకు ఉచితంగా కరెంటు సరఫరా చేస్తోంది. ఇవే కాకుండా ఎత్తిపోతల పథకాల సరఫరా కలిపి రాయితీల పద్దు కింద నెలకు రూ. 958 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం డిస్కంలకు బడ్జెట్ నుంచి అందజేస్తోంది. ఇక ఈ ఏడాది బారీగా పెరిగిన వినియోగం కారణంగా నెలకు కనీసం మరో రూ. వెయ్యి కోట్లయినా ఇస్తే తప్ప నిరంతర సరఫరా సాధ్యం కాదు అని డిస్కంల వర్గాలు చెబుతున్నాయి. పోనీ అధిక ధరలకు కొనేందుకు సిద్ధమయినా ఎక్స్ఛేంజీలో దొరకని పరిస్థితి ఉందని పేర్కొంటున్నాయి.   

టాప్ హెడ్ లైన్స్

Hyderabad ACB Raids: ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
Telangana 22A Land Dispute:22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
Siddipet Road Accident: సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
Telangana Congress Rift: కాంగ్రెస్ మార్క్ అంతర్గత ప్రజాస్వామ్యం - రేవంత్ ఉక్కిరిబిక్కిరి - దారిలో పెట్టలేకపోతున్నారా?
కాంగ్రెస్ మార్క్ అంతర్గత ప్రజాస్వామ్యం - రేవంత్ ఉక్కిరిబిక్కిరి - దారిలో పెట్టలేకపోతున్నారా?

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad ACB Raids: ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
Vande Mataram Controversy: వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
Telangana 22A Land Dispute:22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
Rathiri Rathiri Rathirilo Song : ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
Pooja Hegde : రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
IPL Hardik Trade :  హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
Siddipet Road Accident: సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
Embed widget