అన్వేషించండి

ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో కవిత- బీజేపీ ఎంపీ సంచలన ఆరోపణలు

Delhi Excise Policy: ఢిల్లీ మద్యం విధానంలో కేసీఆర్ కుటుంబ సభ్యుల పాత్ర ఉందని బీజేపీ ఎంపీ ఆరోపించారు. ఎక్సైజ్ పాలసీ తయారీ భేటీల్లో వాళ్లు కూడా పాల్గొన్నారని అన్నారు.

Delhi Excise Policy: ఢిల్లీ ఎక్సైజ్ పాలసీపై కొన్ని రోజులుగా వివాదం జరుగుతున్న విషయం తెలిసిందే. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం తీసుకు వచ్చిన మద్యం పాలసీలో అక్రమాలు జరిగాయని సీబీఐ కేసు నమోదు చేసింది. దిల్లీ ప్రభుత్వంలో కీ రోల్‌ పోషించే మనీష్‌ సిసోడియా ఇంట్లో సోదాలు కూడా జరిపింది. ఇప్పుడు ఇది తెలుగు రాష్ట్రాల్లోను షేక్ చేస్తోంది. ముఖ్యంగా టీఆర్‌ఎస్‌ నేతలు ఇందులో భాగమై ఉన్నారంటూ బీజేపీ సంచలన ఆరోపణలు చేస్తోంది. 

ఢిల్లీ మద్య పాలసీ రూపకల్పన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సభ్యుల కనుసన్నల్లోనే జరిగిందని బీజేపీ నేతలు పర్వేశ్ సాహిబ్ సింగ్, మంజీందర్‌ సింగ్‌ సిర్సా బాంబు పేల్చారు. కల్వకుంట్ల కవిత పేరు ప్రముఖంగా ప్రస్తావిస్తూ సిర్సా తీవ్ర ఆరోపణలు చేశారు. ఢిల్లీలో అమలువుతున్న ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన డీల్ ను సెట్ చేసింది కల్వకుంట్ల కవిత అంటూ చెప్పుకొచ్చారు. ఢిల్లీలోని ఒబెరాయ్ హోటల్స్ వేదికగా డీల్ జరిగిందన్నారు. తెలంగాణ కేసీఆర్ తరపున ఎమ్మెల్సీ కవిత.. లిక్కర్ మాఫియాకు, ఢిల్లీ గవర్నమెంట్ కు మధ్య డీల్ కుదిర్చారని తెలిపారు. ఇందుకోసం ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాకు 150 కోట్ల రూపాయల ముడుపులు కూడా అందాయంటూ పొలిటికల్ హీట్ రాజేశారు మాంజీందర్ సింగ్ సిర్సా.

ఒబెరాయ్ హోటల్‌లో సూట్‌ను తెలంగాణ మద్యం మాఫియాకు చెందిన వ్యక్తి ఆర్నెళ్ల కోసం బుక్ చేశాడని ఆరోపించారు సిర్సా. డీల్ జరిగినన్ని రోజులు కేసీఆర్ కుటుంబ సభ్యులు స్పెషల్ ఫ్లైట్‌లోనే ఢిల్లీ హైదరాబాద్‌ మధ్య తిరిగేవారన్నారు. ఈ ఫ్లైట్‌ను తెలంగాణ మద్యం మాఫియా ఏర్పాటు చేసిందంటూ వివరించారు

ఒబెరాయ్ హోటల్ నుంచే లిక్కర్ పాలసీలో అవినీతి..

ఒబెరాయ్ హోటల్ లో కవిత మీటింగ్ నిర్వహించి చద్దా పరివార్ నుంచి డబ్బులు తీసుకుని పంజాబ్‌లో మద్యం ఫ్యాక్టరీని తిరిగి తెరిపించారని బీజేపీ నేత సిర్సా ప్రధాన ఆరోపణ. లిక్కర్ పాలసీలో అవినీతి ఒబెరాయ్ హోటల్ నుంచి ప్రారంభం అయిందని అన్నారు. మూడు కోట్ల రూపాయలు క్యాష్ రూపంలో ఇచ్చారని విమర్శించారు. కోటిన్నర రూపాయలు క్రెడిట్ రూపంలో అందించే ప్రయత్నం చేశారని మంజిందర్ సింగ్ సిర్సా ఆరోపణలు చేశారు. 2 శాతం ఉన్న కమిషన్ ను ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ 12 శాతానికి పెంచారని మరో బాంబు పేల్చారు. 

లిక్కర్ పాలసీపై కేసీఆర్ కుటుంబీకులతో భేటీ..

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సభ్యులు, ఢిల్లీ ఎన్1 లైసెన్స్ హోల్డర్స్ వ్యక్తుల ద్వారా కుదిరిని డీల్ లో భాగంగా ఢిల్లీ మంత్రి మనీశ్ సిసోడియాకు రూ. 150 కోట్లు ముట్టాయని బీజేపీ ఎంపీ పర్వేశ్ సాహిబ్ సింగ్ ఆరోపణలు చేశారు. ఈ డబ్బులను తెలంగాణ లిక్కర మాఫియానే ఇచ్చిందన్నారు. దీనికి బదులుగా ముందుగా ఎన్ 1 కమిషన్, లాభాలు తీసుకునేలా డీల్ కుదిరిందని పర్వేస్ అన్నారు. గోవా. పంజాబ్ ఎన్నికల ఖర్చుల నిమిత్తం ఆమ్‌ఆద్మీ పార్టీకి లిక్కర్ మాఫియా అడ్వాన్స్ చెల్లింపులు చేసిందని ఆరోపించారు. ఆ తర్వాత పంజాబ్ రాష్ట్రంలో, ఢిల్లీలోనూ నూతన ఎక్సైజ్ పాలసీ అమలు మొదలు అయిందని ఆరోపించారు. పంజాబ్ లో ఆప్ అధికారంలోకి వచ్చాక తెలంగాణ తరహా మద్యం విధానాన్ని అక్కడ కేసీఆర్ కుటుంబ సభ్యులు అమలు చేయించారని అన్నారు. లిక్కర్ పాలసీపై కేసీఆర్ కుటుంబీకులతో భేటీ అయిన విషయం నిజమా కాదా సిసోడియా చెప్పాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

BRS Mews : సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
Chandrababu :  జగన్‌కు చంద్రబాబు 7 సూటి ప్రశ్నలు - సమాధానం చెప్పాలని రాప్తాడు ప్రజాగళం సభలో సవాల్
జగన్‌కు చంద్రబాబు 7 సూటి ప్రశ్నలు - సమాధానం చెప్పాలని రాప్తాడు ప్రజాగళం సభలో సవాల్
BJP Chengicherla politics : తెలంగాణలో మళ్లీ పాత ఫామ్‌లోకి వస్తున్న బీజేపీ - చెంగిచెర్ల ఘటనపై దూకుడు రాజకీయం !
తెలంగాణలో మళ్లీ పాత ఫామ్‌లోకి వస్తున్న బీజేపీ - చెంగిచెర్ల ఘటనపై దూకుడు రాజకీయం !
Ap Elections: ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులు - కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం
ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులు - కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

TDP Sankar | Srikakulam | పదవి ఉంటే ఒకమాట.. లేదంటే మరో మాట... ధర్మాన ఎప్పుడూ అంతేElections 2024 Tirupati Public Talk: తిరుపతి ఓటర్ల మదిలో ఏముంది..? ఎవరికి ఓటేస్తారు..?KTR on Phone Tapping Case | దొంగలవి ఫోన్ ట్యాపింగ్ చేసి ఉండొచ్చు..నీకేం భయం రేవంత్..? అంటూ కేటీఆర్ ప్రశ్నHardik Pandya vs Rohit Sharma: రాజకీయాల్లోనే కాదు ఇప్పుడు ఆటల్లోనూ క్యాంపులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BRS Mews : సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
Chandrababu :  జగన్‌కు చంద్రబాబు 7 సూటి ప్రశ్నలు - సమాధానం చెప్పాలని రాప్తాడు ప్రజాగళం సభలో సవాల్
జగన్‌కు చంద్రబాబు 7 సూటి ప్రశ్నలు - సమాధానం చెప్పాలని రాప్తాడు ప్రజాగళం సభలో సవాల్
BJP Chengicherla politics : తెలంగాణలో మళ్లీ పాత ఫామ్‌లోకి వస్తున్న బీజేపీ - చెంగిచెర్ల ఘటనపై దూకుడు రాజకీయం !
తెలంగాణలో మళ్లీ పాత ఫామ్‌లోకి వస్తున్న బీజేపీ - చెంగిచెర్ల ఘటనపై దూకుడు రాజకీయం !
Ap Elections: ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులు - కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం
ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులు - కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం
CJI: సీజేఐకు 600 మంది లాయర్ల లేఖ - కారణం ఏంటంటే.?
సీజేఐకు 600 మంది లాయర్ల లేఖ - కారణం ఏంటంటే.?
Telangana BJP :   తెలంగాణ బీజేపీలో టిక్కెట్ల మార్పు రచ్చ -  కొన్ని చోట్ల  తప్పదా ?
తెలంగాణ బీజేపీలో టిక్కెట్ల మార్పు రచ్చ - కొన్ని చోట్ల తప్పదా ?
Kejriwal: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మరో షాక్ - ఈడీ కస్టడీ పొడిగించిన న్యాయస్థానం
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మరో షాక్ - ఈడీ కస్టడీ పొడిగించిన న్యాయస్థానం
Pushpa 3 Title Revealed: సాలీడ్ అప్‌డేట్‌, 'పుష్ప 3' టైటిల్‌ వచ్చేసింది? - సుకుమార్‌ ప్లాన్‌ మామూలుగా లేదుగా..
సాలీడ్ అప్‌డేట్‌, 'పుష్ప 3' టైటిల్‌ వచ్చేసింది? - సుకుమార్‌ ప్లాన్‌ మామూలుగా లేదుగా..
Embed widget