News
News
వీడియోలు ఆటలు
X

Huzurabad politics: దళిత బంధు Vs దళిత దండోరా

హుజూరాబాద్ బై ఎలక్షన్స్ నోటిఫికేషన్ ఇంకా రానేలేదు. కానీ రాజకీయ కాక మాత్రం జోరుగా ఊపందుకుంది.

FOLLOW US: 
Share:

హుజూరాబాద్ లో రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో ఖాళీ అయిన ఈ సీటు కోసం ఉపఎన్నిక జరగనుంది. అయితే రాజీనామాకు ముందు నుంచే.. నేతలు దృష్టి పెట్టారు. అభ్యర్థి ఎవరన్నదానిపై క్లారిటీ లేకున్నా.. పార్టీలు పట్టుసాధించాలని తహతహలాడుతున్నాయి. 

హుజూరాబాద్ ఉపఎన్నికపైనే రాజకీయ పార్టీలన్నీ ఫోకస్ పెట్టాయి. ఈ ఉప ఎన్నికల్లో కచ్చితంగా గెలవాలని కొన్ని పార్టీలు, తమ పట్టు పెంచుకోవాలని మరికొన్ని పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. హుజూరాబాద్‌లో కచ్చితంగా గెలవాలని బీజేపీ, టీఆర్ఎస్ ప్లాన్ వేస్తుంటే..మెరుగైన ఫలితాలు ఎలా సాధించాలనే దానిపై కాంగ్రెస్ దృష్టి పెట్టింది. 

ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే.. కేసీఆర్ హుజూరాబాద్ ఉపఎన్నికపై దృష్టి పెట్టారు. హుజూరాబాద్ నుంచే దళిత బంధు పథకం ప్రారంభించనున్నారు. ఈ పథకం కింద ఒక్కో దళిత కుటుంబానికి పది లక్షల రూపాయలు ఇవ్వనున్నారు.  ఈ పథకం అమలు చేస్తామని చెప్పడంతో రాజకీయం మరింత హీటెక్కినట్టైంది. ఆల్ రెడీ కేసీఆర్ ఆ నియోజకవర్గానికి చెందిన 400 మందికిపైగా దళితులతో పథకం వర్తింపు అంశంపై సదస్సు ఏర్పాటు చేశారు. కేవలం దళిత బంధు మాత్రమే.. కాదు.. త్వరలోనే గొర్రెల పంపిణీ కూడా హుజూరాబాద్ నుంచే ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే టీఆర్ఎస్ నేతలు నియోజకవర్గం మెుత్తం చుట్టేస్తున్నారు. అభ్యర్థి ఎవరన్న దానిపై క్లారిటీ లేకున్నా.. కార్యకర్తలు ఇంటింటీకి వెళ్లి.. కారుకే ఓటు వేయాలని ప్రచారం చేస్తున్నారు.

లక్షమందితో దళిత దండోరా నిర్వహించాలని.. టీపీసీసీ నిర్ణయించింది. దళిత బంధు పేరుతో ప్రభుత్వం మోసం చేస్తుందని.. ఆరోపించింది. ఇందులో భాగంగా ఆగస్టు 9 నుంచి సెప్టెంబరు 17 వరకు హుజూరాబాద్‌ నియోజకవర్గంలో ‘దళిత దండోరా’ చేపట్టాలని నిర్ణయించింది. దళిత, గిరిజన దండోరాల తర్వాత బీసీ దండోరా కార్యక్రమాలు చేపడతామని ప్రకటించింది.  

కేసీఆర్ దూకుడుకు కాస్తయినా అడ్డుకట్ట వేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. కోకాపేట భూముల వేలంపై నిరంతరం పోరాటం చేయాలని టీపీసీసీ భావిస్తోంది. ఇందుకు భావసారూప్యం కలిగిన వారితో కలిసి పోరాడాలని అనుకుంటోంది. అయితే కాంగ్రెస్ నేత కౌశిక్ రెడ్డి.. టీఆర్ఎస్ లోకి జంప్ కావడంతో ఇప్పుడు అక్కడ హస్తం నుంచి ఎవరిని పోటీ చేయిస్తారో తెలియాల్సి ఉంది. అసలు హుజూరాబాద్ ఎన్నికల్లో దళిత బంధు, దళిత దండోరా ఏ మేరకు ఎన్నికల లబ్ధిని అడ్డుకుంటాయో చూడాలి. 

మరోవైపు ప్రజా దీవెన యాత్ర పేరిట మాజీ మంత్రి ఈటల రాజేందర్ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. బీజేపీ బలం, సొంత చరిష్మాతో ఎలాగైనా గెలిచి తీరాలని.. ఈటల భావిస్తున్నారు. కచ్చితంగా గెలుస్తాననే నమ్మకంతో ఉన్నారు. కేసీఆర్ పై విమర్శలు చేస్తూ.. ప్రజల వద్దకు ఈటల వెళ్తున్నారు.

Also Read: CM KCR: దళిత బంధు పథకం కాదు.. ఉద్యమం.. గుర్తుంచుకోవాలే: కేసీఆర్

Published at : 26 Jul 2021 05:42 PM (IST) Tags: huzurabad by elections cm kcr huzurabad revanth reddy Dalitha Bandhu Scheeme Dalitha Dandora Scheeme

సంబంధిత కథనాలు

Dr.BRAOU BEd Exam: అంబేడ్కర్‌ సార్వత్రిక బీఈడీ ప్రవేశపరీక్ష హాల్‌టికెట్లు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?

Dr.BRAOU BEd Exam: అంబేడ్కర్‌ సార్వత్రిక బీఈడీ ప్రవేశపరీక్ష హాల్‌టికెట్లు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?

Hyderabad Traffic Diversion: జూన్ 4న ఐకియా ఫ్లై ఓవర్ మూసివేత సహా హైద‌రాబాద్‌ లో ఆ రూట్లలో ట్రాఫిక్‌ ఆంక్షలు ఇలా

Hyderabad Traffic Diversion: జూన్ 4న ఐకియా ఫ్లై ఓవర్ మూసివేత సహా హైద‌రాబాద్‌ లో ఆ రూట్లలో ట్రాఫిక్‌ ఆంక్షలు ఇలా

Dimple Hayathi : డీసీపీ పార్కింగ్ ఇష్యూ తర్వాత తొలిసారి మీడియా ముందుకొచ్చిన డింపుల్

Dimple Hayathi : డీసీపీ పార్కింగ్ ఇష్యూ తర్వాత తొలిసారి మీడియా ముందుకొచ్చిన డింపుల్

Sharmila On KCR : సంపద వెదకడం అమ్ముకోవడమే కేసీఆర్ పని - షర్మిల ఘాటు విమర్శలు

Sharmila On KCR : సంపద వెదకడం అమ్ముకోవడమే కేసీఆర్ పని - షర్మిల ఘాటు విమర్శలు

TSPSC News : తవ్వకొద్దీ అక్రమాలు - టీఎస్‌పీఎస్సీ కేసులో ఇంకెన్ని అరెస్టులు ?

TSPSC News :  తవ్వకొద్దీ  అక్రమాలు - టీఎస్‌పీఎస్సీ కేసులో ఇంకెన్ని అరెస్టులు ?

టాప్ స్టోరీస్

Odisha Train Accident: తొలిసారి భార్య మాట పాటించిన భర్త, రైలు ప్రమాదం నుంచి తప్పించుకున్న కొత్త జంట!

Odisha Train Accident: తొలిసారి భార్య మాట పాటించిన భర్త, రైలు ప్రమాదం నుంచి తప్పించుకున్న కొత్త జంట!

PM Modi on Train Accident: నోట మాట రావడం లేదు, ప్రమాదం తీవ్రంగా కలచివేసింది - రైలు ప్రమాదంపై ప్రధాని మోదీ

PM Modi on Train Accident: నోట మాట రావడం లేదు, ప్రమాదం తీవ్రంగా కలచివేసింది - రైలు ప్రమాదంపై ప్రధాని మోదీ

ChatGPT: షాకిస్తున్న ఛాట్ జీపీటీ - గూగుల్ అసిస్టెంట్, యాపిల్ సిరి తరహాలో!

ChatGPT: షాకిస్తున్న ఛాట్ జీపీటీ - గూగుల్ అసిస్టెంట్, యాపిల్ సిరి తరహాలో!

Chiranjeevi Cancer - Fact Check : చిరంజీవికి క్యాన్సర్ వచ్చిందా? అసలు నిజం ఏమిటి? మెగాస్టార్ చెప్పింది ఏమిటి?

Chiranjeevi Cancer - Fact Check : చిరంజీవికి క్యాన్సర్ వచ్చిందా? అసలు నిజం ఏమిటి? మెగాస్టార్ చెప్పింది ఏమిటి?