By: ABP Desam | Updated at : 26 Sep 2023 05:53 PM (IST)
Edited By: jyothi
సింగరేణి కార్మికులకు సీఎం కేసీఆర్ శుభవార్త, 32 శాతం బోనస్ ఇవ్వబోతున్నట్లు ప్రకటన
Singareni Employees: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సింగరేణి ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో సింగరేణి సంస్థ లాభాల్లో 32 శాతం బోనస్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఇదే విషయాన్ని సింగరేణి కార్మికులకు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న సింగరేణి ఉద్యోగులు తెగ సంబరపడిపోతున్నారు. మొన్నటికి మైన్న 11వ వేజ్ బోర్డుకు సంబంధించిన బకాయిలను ఉద్యోగుల ఖాతాల్లో వేసిన యాజమాన్యం.. తాజాగా 32 శాతం బోనస్ ఇవ్వబోతున్నట్లు తెలుసుకుని సీఎం కేసీఆర్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నారు. కేవలం ఉద్యోగులే కాకుండా.. ఎమ్మెల్సీ కవిత కూడా స్పందించారు. సింగరేణి ఉద్యోగులకు 32 శాతం బోనస్ ప్రకటించడం తనకు చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. కార్మికుల పక్షాన ముఖ్యమంత్రికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి లాభాల్లో కార్మికులకు అందించే వాటాను ప్రతి ఏడాది పెంచుతూ, బొగ్గు గని కార్మికులకు దేశంలోనే అత్యధికంగా దసరా కానుక అందిస్తున్న రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందంటూ చెప్పుకొచ్చారు.
2022-23 ఆర్థిక సంవత్సరంలో సింగరేణి సంస్థ లాభాల్లో 32% బోనస్ గా కార్మికులకు అందించాలని నిర్ణయించిన సీఎం కేసీఆర్ గారికి కార్మికుల పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి లాభాల్లో కార్మికులకు అందించే వాటాను ప్రతి ఏడాది పెంచుతూ, బొగ్గు గని కార్మికులకు… pic.twitter.com/FtOJTfdb9g
— Kavitha Kalvakuntla (@RaoKavitha) September 26, 2023
ఇటీవలే 11వ వేజ్ బోర్డు బకాయిలు అందజేత
ఇటీవలే సింగరేణి కార్మికులకు 11వ వేజ్‌బోర్డు బకాయిలు రూ.1450 కోట్లను సింగరేణి యాజమాన్యం జమ చేసింది. ఉద్యోగులకు వాళ్ల వాళ్ల సర్వీస్ సీనియారిటీని బట్టి నగదు జమ అయింది. ఒక్కో కార్మికుడికి ఏరియర్స్ రూపంలో దాదాపు రూ.3.70 లక్షల వరకు క్రెడిట్ అయ్యింది. ఒకేసారి పెద్దమొత్తంలో డబ్బు రావడంతో... కార్మికులు సంతోషానికి అవదులు లేవు. కార్మికులు, వారి కుటుంబ సభ్యులు సంతోషంలో మునిగిపోయారు. సింగరేణి చరిత్రలో ఒక్కసారిగా ఇంత పెద్ద మొత్తంలో బకాయిలను చెల్లించడం ఇదే మొదటిసారి అని చెప్పా percent రు సంస్థ ఫైనాన్స్, పర్సనల్ డైరెక్టర్ ఎన్.బలరామ్. ముందు రెండసార్లుగా ఎరియర్స్ చెల్లించాలని భావించామన్నారు. అయితే.. సంస్థ సీఎండీ ఎన్ శ్రీధర్ మొత్తం సొమ్ము ఒకేసారి చెల్లించాలని ఆదేశించారని చెప్పారు. అందుకే ఒకే విడతలో మొత్తం డబ్బు కార్మికుల అకౌంట్లలో క్రెడిట్ చేశామన్నారు. అంతేకాదు... అనుకున్న సమయం కన్నా ముందే... 11వ వేజ్‌బోర్డు బకాయిలు రూ.1450 కోట్లను విడుదల చేశామన్నారు. కోల్ ఇండియాకన్నా ముందే 11వ వేజ్‌బోర్డు సిఫారసులను సింగరేణి సంస్థ అమలు చేసినందుకు గర్వపడుతున్నామన్నారు. డీబీటీ విధానంలో 39వేల మంది కార్మికుల ఖాతాల్లో రూ.1450 కోట్లను జమచేశామన్నారు సింగరేణి డైరెక్టర్ ఎన్ బలరామ్. ఇన్‌కమ్ ట్యాక్స్, CMPFలో జమచేయాల్సిన సొమ్మును మినహాయించి... మిగిలిన మొత్తాన్ని కార్మికుల ఖాతాల్లో జమ చేశామన్నారు.
11వ వేజ్‌బోర్డు బకాయిల చెల్లింపేకాదు... సింగరేణి కార్మికులకు మరో గుడ్ కూడా చెప్పింది యాజమాన్యం. దసరా పండుగకు ముందే లాభాల వాటాతో పాటు దీపావళి బోనస్ చెల్లించడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించింది. సీఎం కేసీఆర్ గతంలో ప్రకటించిన రూ.700 కోట్ల లాభాల బోనస్‌ను దసరా కన్నా ముందే చెల్లించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు సింగరేణి డైరెక్టర్ బలరామ్. దీపావళి బోనస్ పీఎల్‌ఆర్‌ను కూడా ముందే చెల్లించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. పెద్ద మొత్తంలో ఇచ్చిన ఈ ఎరియర్స్ సొమ్మును కార్మికులు జాగ్రత్తగా వాడుకోవాలని... కుటుంబ భవిష్యత్తు కోసం వినియోగించుకోవాలని సూచించారు.
Doctor MlAs: తెలంగాణ ఎన్నికల ఫలితాలు - ఈ ఎమ్మెల్యేలు డాక్టర్లు!
Supritha Congratulates Revanth Reddy: రేవంత్ రెడ్డికి కంగ్రాట్స్ - ప్లేట్ తిప్పేసిన సురేఖా వాణి కుమార్తె!
Kamareddy News: కామారెడ్డిలో కేసీఆర్, రేవంత్‌కు షాక్ ఇచ్చిన ఎవరీ వెంకటరమణారెడ్డి?
Telangana New DGP: తెలంగాణ నూతన డీజీపీగా రవిగుప్తా నియామకం
Telangana constituency wise results: తెలంగాణ తీర్పు: ఏయే నియోజకవర్గంలో ఎవరు గెలిచారు? ఎవరు ఓడారు?
Best Browser: మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ వర్సెస్ గూగుల్ క్రోమ్ - ఈ మూడు విషయాల్లో ‘ఎడ్జ్’నే బెస్ట్!
Rajasthan Election Result 2023: రాజస్థాన్‌లో కాంగ్రెస్ ఓటమికి కారణాలేంటి? గహ్లోట్ జాదూ ఎందుకు పని చేయలేదు?
RGV Tweet on Revanth Reddy: రేవంత్ రెడ్డి బాహుబలి, తెలంగాణ ఎన్నికల్లో విజయం కాంగ్రెస్‌ది కాదు - వర్మ సెన్సేషనల్ ట్వీట్
KTR on Telangana Election Results: ఎన్నికల ఫలితాలు నిరాశ కలిగించాయి, కాంగ్రెస్ కు ఆల్ ది బెస్ట్ - కేటీఆర్ ట్వీట్ వైరల్
/body>