Telangana Assembly: ప‌ద్మశ్రీ అవార్డుల కోసం పేర్లు పంపాలా? వ‌ద్దా? కేంద్రంతో గలాటనే.. అసెంబ్లీలో కేసీఆర్

సోమవారం నాటి (అక్టోబరు 4) అసెంబ్లీలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. ఈ సందర్భంగానే పర్యటకం విషయంలో కేంద్రం తెలంగాణను పట్టించుకోవడం లేదని అసహనం వ్యక్తం చేశారు.

FOLLOW US: 

తెలంగాణ ప‌ట్ల కేంద్రం నిర్లక్ష్యంగా ఉంటోందని ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనసభలో మరోసారి అసహనం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని చిన్నచూపు చూడడం తగదని అన్నారు. శాస‌న‌ స‌భ‌లో ప్రశ్నోత్తరాల సంద‌ర్భంగా ప్రపంచ వార‌సత్వ క‌ట్టడంగా రామ‌ప్ప దేవాల‌యం ఎంపిక కావడంపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ స‌మాధానం ఇచ్చిన తర్వాత సోమవారం సీఎం కేసీఆర్ మాట్లాడారు. ఈ సందర్భంగానే పర్యటకం విషయంలో కేంద్రం తెలంగాణను పట్టించుకోవడం లేదని అసహనం వ్యక్తం చేశారు.

‘‘తెలంగాణ చాలా గొప్ప సంస్కృతి, చ‌రిత్ర కలబోత. 58 సంవ‌త్సరాల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలనలో సమైక్యాంధ్ర ప్రదేశ్‌లో తెలంగాణ‌ను ఎవరూ ప‌ట్టించుకోలేదు. అద్భుత‌మైన ప్రదేశాలు, జ‌ల‌పాతాలు, వారసత్వ సంపద తెలంగాణలో ఉంది. చారిత్రాక అవ‌శేషాలు ఉన్న తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ఖ‌మ్మంలో పాండ‌వుల గుట్ట‌ను ప‌ట్టించుకోలేదు. వార‌స‌త్వంలో వ‌చ్చిన పురాత‌న కోట‌లు, దోమ‌కొండ కోట అప్పగిస్తామ‌ని చెబుతున్నారు. ప‌ద్మశ్రీ అవార్డుల కోసం జాబితాను పంపాలా? వ‌ద్దా? అని ప్రధాని మోదీ, అమిత్ షాను అడిగాను. పద్మశ్రీ అవార్డు వచ్చేవారు తెలంగాణలో లేరా అని అడిగాను.’’ అని కేసీఆర్ అన్నారు.

Also Read: TSRTC: మీరు సిటీ బస్ ఎక్కుతారా? అయితే గుడ్‌న్యూస్.. మీకు డబ్బు ఆదా.. సంస్థకు లాభం!

ఈ ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి కేటీఆర్ కూడా మాట్లాడారు. హైద‌రాబాద్‌లో చెరువుల సుందరీక‌ర‌ణ‌పై స‌భ్యులు అడిగిన ప్రశ్నల‌కు రాష్ట్ర ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ స‌మాధానం ఇచ్చారు. చెరువుల చుట్టూ వాకింగ్ ట్రాక్, సుంద‌రీక‌ర‌ణ‌, మురుగు కాల్వల మ‌ళ్లింపు చేప‌ట్టామ‌ని మంత్రి తెలిపారు. జీహెచ్ఎంసీ ప‌రిధిలోని 185 చెరువుల‌లో 127 చెరువుల‌ను గుర్తించి అభివృద్ధి చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. అందులో 48 చెరువుల‌ను ఇప్పటికే అభివృద్ధి చేశామ‌ని చెప్పారు.

Also Read: Huzurabad Bypoll : నిజామాబాద్ బాటలో హుజురాబాద్ ! ఎన్ని ఈవీఎంలు వాడాలో ?

‘‘ఈ పనుల కోసం రూ.407.3 కోట్లను మంజూరు చేశాం. ఇప్పటికే రూ.218 కోట్లు ఖ‌ర్చు చేశాం. రూ.94.17 కోట్ల అంచ‌నా వ్యయంతో 63 చెరువుల సుంద‌రీక‌ర‌ణ‌ను జీహెచ్ఎంసీ చేప‌ట్టి 48 చెరువుల ప‌నుల‌ను పూర్తి చేసింది. మిగ‌తా 15 చెరువుల ప‌నులు పురోగ‌తిలో ఉన్నాయి. రూ.30.50 కోట్లతో 45 చెరువుల అభివృద్ధి, వ‌ర‌ద వ‌ల్ల దెబ్బతిన్న మ‌ర‌మ్మతులను జీహెచ్ఎంసీ చేప‌ట్టిందని కేటీఆర్ తెలిపారు.

చెక్ డ్యాంలపై మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. తెలంగాణలో కొత్తగా నిర్మించే చెక్‌ డ్యాంలతో మూడున్నర లక్షల ఎకరాలకు సాగునీరు అందించనున్నట్లు మంత్రి తెలిపారు. చెక్‌ డ్యాంలు, చెరువుల ఆధునీకరణతో సాగు విస్తీర్ణం పెరిగిందని చెప్పారు. చెక్‌డ్యాం నిర్మాణానికి తీసుకుంటున్న చర్యలపై మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. చెక్‌ డ్యాంలు, చెరువుల మరమ్మతులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిదని హరీశ్‌ రావు తెలిపారు.

Also Read: దసరాకి ప్రైవేటు ట్రావెల్స్ బాదుడు.. ప్రత్యేక వడ్డన, ప్రత్యేక సర్వీసులు అంటున్న ప్రభుత్వాలు

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 04 Oct 2021 12:24 PM (IST) Tags: Telangana Tourism cm kcr KTR harish rao TS Assembly KCR fire on Union Govt

సంబంధిత కథనాలు

Hyderabad Honour Killing Case: మార్వాడీ అబ్బాయి, యాదవ్ అమ్మాయి లవ్ మ్యారేజీ, అంతలోనే పరువు హత్యపై పోలీసులు ఏమన్నారంటే !

Hyderabad Honour Killing Case: మార్వాడీ అబ్బాయి, యాదవ్ అమ్మాయి లవ్ మ్యారేజీ, అంతలోనే పరువు హత్యపై పోలీసులు ఏమన్నారంటే !

Disha Accused Encounter Case: దిశ నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీసులు చెప్పింది నిజం కాకపోతే, అసలు జరిగింది ఏంటి ?

Disha Accused Encounter Case: దిశ నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీసులు చెప్పింది నిజం కాకపోతే, అసలు జరిగింది ఏంటి ?

Honour Killing: హైదరాబాద్‌లో మరో పరువు హత్య - యువకుడిపై కత్తులతో విచక్షణారహితంగా దాడి చేసి దారుణం

Honour Killing: హైదరాబాద్‌లో మరో పరువు హత్య - యువకుడిపై కత్తులతో విచక్షణారహితంగా దాడి చేసి దారుణం

Nikhat Zareen Parents: దెబ్బలు తగిలితే పెళ్లి అవడం కష్టం, బాక్సింగ్ వద్దమ్మా అని చెప్పేదాన్ని : నిఖత్ జరీన్ తల్లి

Nikhat Zareen Parents: దెబ్బలు తగిలితే పెళ్లి అవడం కష్టం, బాక్సింగ్ వద్దమ్మా అని చెప్పేదాన్ని : నిఖత్ జరీన్ తల్లి

Congress Rachabanda : రైతు డిక్లరేషన్‌పై రచ్చబండల్లో చర్చ - ఇక ప్రజల్లోకి తెలంగాణ కాంగ్రెస్

Congress Rachabanda : రైతు డిక్లరేషన్‌పై రచ్చబండల్లో చర్చ - ఇక ప్రజల్లోకి తెలంగాణ కాంగ్రెస్
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

Poorna Photos: కుందనపు బొమ్మా నిను చూస్తే మనసుకి వెలుగమ్మా

Poorna Photos: కుందనపు బొమ్మా నిను చూస్తే మనసుకి వెలుగమ్మా

MS Dhoni IPL 2023: ఎంఎస్ ధోనీ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్, విజిల్ వేస్తున్న సీఎస్కే అభిమానులు

MS Dhoni IPL 2023: ఎంఎస్ ధోనీ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్, విజిల్ వేస్తున్న సీఎస్కే అభిమానులు

Sirpurkar Commission Report: దిశ నిందితుల ఎన్ కౌంటర్ బూటకమా - కేసుపై సంచలన విషయాలు వెల్లడించిన సిర్పూర్కర్ రిపోర్ట్‌లో ఏముందంటే !

Sirpurkar Commission Report: దిశ నిందితుల ఎన్ కౌంటర్ బూటకమా - కేసుపై సంచలన విషయాలు వెల్లడించిన సిర్పూర్కర్ రిపోర్ట్‌లో ఏముందంటే !

Vivo Y75: వివో కొత్త ఫోన్ వచ్చేసింది - అదిరిపోయే ఫీచర్లు - ధర ఎంతంటే?

Vivo Y75: వివో కొత్త ఫోన్ వచ్చేసింది - అదిరిపోయే ఫీచర్లు - ధర ఎంతంటే?