అన్వేషించండి

Delhi Liquor Scam Chargesheet : ఢిల్లీ లిక్కర్ స్కాంలో కీలక విషయాలు - సీబీఐ కోర్టు ఆమోదించిన చార్జిషీటులో మ్యాటర్ ఇదే

ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీబీఐ చార్జిషీటులో సంచలన విషయాలు ఉన్నాయి. 10వేల పేజీలు ఉన్న ఈ చార్జిషీటును కోర్టు పరిగణనలోకి తీసుకుంది.

 

Delhi Liquor Scam Chargesheet :   ఢిల్లీ లిక్కర్ స్కాంలో  సీబీఐ దాఖలు చేసిన చార్జిషీటును సీబీఐ కోర్టు పరిగణనలోకి తీసుకుంది  ఈ చార్జిషీటులో పలు సంచలన విషయాలు ఉన్నాయి. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులోదాదాపు 10వేల పేజీల తొలి చార్జిషీట్ లో పలు సంచలన విషయాలను  సీబీఐ పొందుపరిచింది.  ఢిల్లీ ప్రభుత్వానికి నష్టం కలిగే విధంగా.. అక్రమంగా ఆర్జించేలా ఆప్‌ నేతలు లిక్కర్‌ పాలసీని రూపొందించారు. అందులో భాగంగానే సౌత్‌గ్రూప్‌ కంపెనీ నుంచి ఆప్‌ నేతలకు కనీసం రూ.100 కోట్ల ముడుపులు అందాయని పేర్కొంది.   ఈ సౌత్ గ్రూప్‌ను   శరత్‌, మాగుంట, మరికొందరు నియంత్రించారని తెలపింది.   మనీలాండరింగ్‌ కోణంలో ఈడీ చేసిన దర్యాప్తులో ఈ విషయాలు నిర్ధారణ అయ్యాయని సీబీఐ తెలిపింది. 

ముడుపులతో దక్షిణాది వ్యాపారుల దందా ! 

ఢిల్లీ లిక్కర్ దందాను తమ గుప్పిట్లోకి తీసుకోవాలని దక్షిణాది ప్రాంతానికి చెందిన పలువురు మద్యం ఉత్పత్తిదారులు కుట్ర పన్నారని సీబీఐ ఆరోపించింది.  అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో  ఈడీ  పేర్కొన్న విషయాన్ని చార్జిషీటులో  సీబీఐ ప్రస్తావించింది. ఢిల్లీ మద్యం పాలసీలో తమకు ప్రయోజనం చేకూర్చే విధంగా మార్పులు చేయించుకునేందుకు సౌత్ గ్రూప్ కుట్ర పన్నింది. దక్షిణాది ప్రాంతానికి చెందిన మద్యం ఉత్పత్తిదారుల తరపున అభిషేక్ బోయిన్‌పల్లి ఈ వ్యవహారం నడిపినట్లు సీబీఐ చార్జిషీట్ లో తెలిపింది. అభిషేక్ బోయినపల్లి దాదాపు రూ.30 కోట్ల నగదును హవాలా మార్గంలో తరలించినట్లు చార్జిషీటులో ప్రస్తావించారు. ఆ డబ్బంతా అడ్వాన్స్‌గా 2021 జులై, సెప్టెంబర్ మధ్య కాలంలో దినేష్ అరోరా ద్వారా విజయ్ నాయర్‌ కు అందజేసినట్లు పేర్కొంది.  ఢిల్లీ ప్రభుత్వ ముఖ్యులను ప్రభావితం చేసేందుకు.. హోల్‌సేల్ దారులకు 12 శాతం లాభాలు వచ్చేలా, అందులో 6 శాతం అభిషేక్ బోయిన్‌పల్లికి తిరిగి వచ్చేలా కుట్ర చేశారని సీబీఐ చార్జిషీటులో తెలిపింది. 

ముత్తా గౌతమ్‌కు రూ.4  కోట్లుకుపైగా నగదు ! 

హోల్‌సేల్ వ్యాపారంలో వచ్చే లాభాల్లో రామచంద్రన్ పిళ్లై నుంచి బ్యాంక్ అకౌంట్స్ ద్వారా ముత్తా గౌతమ్‌కు రూ.4 కోట్లకుపైగా నగదు అందిందని  అతని అకౌంట్ నుంచి అభిషేక్ బోయిన్‌పల్లికి రూ.3.85 కోట్లు ట్రాన్స్‌ఫర్ అయినట్లుగా చార్జిషీట్ లో సీబీఐ  తెలిపింది. అంతేకా కుండా గౌతమ్‌కు చెందిన మీడియా సంస్థలకు కూడా కొంత డబ్బు బదిలీ అయిందని స్పష్టం చేసింది. మొత్తం ఏడుగురు నిందితులు   నేరపూరిత కుట్రకు పాల్పడ్డారని సీబీఐ చార్జిషీట్ లో పేర్కొంది.  సముచితమైన మౌఖిక, డాక్యుమెంటరీ ఆధారాలను కూడా దర్యాప్తు సంస్థలు సేకరించాయని సీబీఐ ప్రత్యేక కోర్టు అభిప్రాయపడింది. ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న వారిపైనా, పేర్లు లేనివారిపైనా కూడా దర్యాప్తు కొనసాగుతున్నట్లు చార్జిషీటులో వెల్లడించింది.

సీబీఐ చార్జిషీటును కోర్టు పరిగణనోకి తీసుకోవడంతో విచారణ ప్రారంభం కానుంది. ఈ కేసులో ముందు ముందు కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది. 

మార్చిలోపు మారకపోతే మార్చేస్తా - వర్క్ షాప్‌లో జగన్ ఫైనల్ వార్నింగ్ ! డేంజర్ జోన్‌లో ఉన్న వారెవరంటే ?

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Telangana Assembly: మండలి నుంచి BRS ఎమ్మెల్సీలపై సస్పెన్షన్ వేటు.. గందరగోళం మధ్య నిర్ణయం తీసుకున్న చైర్మన్
మండలి నుంచి BRS ఎమ్మెల్సీలపై సస్పెన్షన్ వేటు.. గందరగోళం మధ్య నిర్ణయం తీసుకున్న చైర్మన్
Hyderabad Gold Man: హైదరాబాద్ గోల్డ్ మ్యాన్ గుట్టురట్టు.. మెరిసేదంతా రోల్డ్ గోల్డ్ అని తేల్చిన ఐటీ అధికారులు
హైదరాబాద్ గోల్డ్ మ్యాన్ గుట్టురట్టు.. మెరిసేదంతా రోల్డ్ గోల్డ్ అని తేల్చిన ఐటీ అధికారులు
KCR Disqualification: అసెంబ్లీకి రాని కేసీఆర్ - రేవంత్ అనర్హతా వేటు వ్యూహం అమలు చేస్తారా?
అసెంబ్లీకి రాని కేసీఆర్ - రేవంత్ అనర్హతా వేటు వ్యూహం అమలు చేస్తారా?
MLA Rajgopal Reddy: నిధులన్నీ సీఎం, మంత్రుల నియోజకవర్గాలకే! ప్రభుత్వంపై ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అసహనం
నిధులన్నీ సీఎం, మంత్రుల నియోజకవర్గాలకే! ప్రభుత్వంపై ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అసహనం

వీడియోలు

Rohit Sharma Fastest Half Century IPL 2026 | ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ సాధించిన రోహిత్ | ABP Desam
Rohit Dance in Front of Injured Rahane | రహానే కింద పడిపోతే.. రోహిత్ డాన్స్ | ABP Desam
Rahane Innings KKR vs MI IPL 2026 | వాంఖడేలో కేకేఆర్ పరుగుల విధ్వంసం | ABP Desam
IPL 2026 Mumbai Indians Vs KKR IPL 2026 | ఐపీఎల్ 2026లో ముంబై రికార్డు ఛేజింగ్ | ABP Desam
Heinrich Klaasen Controversial Out vs RCB | థర్డ్ అంపైర్‌పై సునీల్ గవాస్కర్ ఫైర్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Maoist Surrender: మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యుడు నారాయణ రావు లొంగుబాటు.. మావోయిస్టు రహిత రాష్ట్రంగా ఏపీ
మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యుడు నారాయణ రావు లొంగుబాటు.. మావోయిస్టు రహిత రాష్ట్రంగా ఏపీ
Inner Ring Road Case: ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ
ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ
JEE Mains 2026 Admit Cards: జేఈఈ మెయిన్స్ సెషన్ 2 అడ్మిట్ కార్డ్స్ విడుదల.. ఈ విధంగా డౌన్‌లోడ్ చేసుకోండి
జేఈఈ మెయిన్స్ సెషన్ 2 అడ్మిట్ కార్డ్స్ విడుదల.. ఈ విధంగా డౌన్‌లోడ్ చేసుకోండి
Rahul Banerjee : షూటింగ్ టైంలో యాక్సిడెంట్ - నీట మునిగి సీరియల్ నటుడు మృతి... అసలేం జరిగిందంటే?
షూటింగ్ టైంలో యాక్సిడెంట్ - నీట మునిగి సీరియల్ నటుడు మృతి... అసలేం జరిగిందంటే?
Hyderabad Gold Man: హైదరాబాద్ గోల్డ్ మ్యాన్ గుట్టురట్టు.. మెరిసేదంతా రోల్డ్ గోల్డ్ అని తేల్చిన ఐటీ అధికారులు
హైదరాబాద్ గోల్డ్ మ్యాన్ గుట్టురట్టు.. మెరిసేదంతా రోల్డ్ గోల్డ్ అని తేల్చిన ఐటీ అధికారులు
Andhra Pradesh: ఉగాది కానుక.. ఏపీలో 2.5 లక్షల ఇండ్లు పంపిణీ- సూళ్లూరుపేటలో శ్రీకారం చుట్టనున్న సీఎం చంద్రబాబు
ఉగాది కానుక.. ఏపీలో 2.5 లక్షల ఇండ్లు పంపిణీ- సూళ్లూరుపేటలో పాల్గొనున్న సీఎం చంద్రబాబు
Mini Bali in India : హైదరాబాద్ నుంచి ‘మినీ బాలి’కి ట్రిప్.. నివటి బీచ్ పూర్తి బడ్జెట్ డిటైల్స్ ఇవే
హైదరాబాద్ నుంచి ‘మినీ బాలి’కి ట్రిప్.. నివటి బీచ్ పూర్తి బడ్జెట్ డిటైల్స్ ఇవే
YSRCP Family Politics: కుటుంబ వివాదాలతో రాజకీయం - జగన్ వ్యూహాత్మక తప్పిదం - ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయా?
కుటుంబ వివాదాలతో రాజకీయం - జగన్ వ్యూహాత్మక తప్పిదం - ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయా?
Embed widget