YS Jagan Review : మార్చిలోపు మారకపోతే మార్చేస్తా - వర్క్ షాప్‌లో జగన్ ఫైనల్ వార్నింగ్ ! డేంజర్ జోన్‌లో ఉన్న వారెవరంటే ?
గడప గడపకూ కార్యక్రమంపై నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్న వారిపై జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్చిలోపు మారకపోతే మార్చేస్తానని వార్నింగ్ ఇచ్చారు.
YS Jagan Review : గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో పనితీరు మార్చుకోని 32 మంది ఎమ్మెల్యేలపై సీఎం జగన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. పనితీరు మెరుగుపడని నేతలకు సీఎం చివరి వార్నింగ్ ఇచ్చారు. మార్చి లోపు పనితీరు మెరుగుపరుచుకోవలని మార్చ్ తర్వాత టిక్కెట్లు ఖరారు చేస్తామన్నారు. పని తీరు మెరుగుపడకపోతే నిర్దాక్షిణ్యంగా పక్కన పెడతామన్నారు. సామాజిక పెన్షన్లు ఇచ్చేటప్పుడు వాలంటీర్ లతో పాటు సచివాలయ కన్వీనర్లు కూడా హాజరు అవ్వాలని.. కొత్త సంవత్సర శుభాకాంక్షలు చెప్పి పెన్షన్ ఎంత పెరిగింది వివరించాలని జగన్ ఆదేశించారు. గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని మార్చి నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. 32 మంది ఎమ్మెల్యేలు తక్కువ రోజులు పాల్గొన్నారని, రానున్న రోజుల్లో వారు మరింతగా ప్రజల్లోకి వెళ్లాలని సీఎం సూచించారు. ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని ఎవరూ అలక్ష్యం చేయొద్దు. మార్చి నాటికి పూర్తిస్థాయి నివేదికలు తెప్పిస్తానని సీఎం అన్నారు.
మంత్రుల తీరుపై కూడా సీఎం జగన్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లుగా తెలు్సతోంది. వెనుక బడిన 32 మంది జాబితాలో మంత్రులైన గుమ్మనూరు జయరాం. విడదల రజిని, జోగి రమేష్, సిదిరి అప్పలరాజు, గుడివాడ అమర్నానాథ్ ఉన్నారు. ఈ వంద రోజులు పార్టీకి చాలా ముఖ్యమైన రోజులని సీఎం జగన్ స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో మరింతగా ప్రజల్లోకి వెళ్లాలని సూచించారు. ఈ సమావేశంలో వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్లు, మంత్రులు, ఎమ్మెల్యేలు, అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలు పాల్గొన్నారు.
గడప గడప కు కార్యక్రమం ప్రజల దగ్గరకు వెళ్లడమే.. ఈ మూడేళ్ళలో ఆయా కుటుంబాల్లో వచ్చిన మార్పులు వివరించడం కోసమే గడప గడపకు వెళ్తున్నామని ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ఎమ్మెల్యేలు ది పెద్ద పాత్ర..ప్రజాస్వామ్యం లో ఎమ్మెల్యేలు కీలక పాత్ర పోషిస్తారన్నారు. ఇది కాలేజి కాదు అందరూ నాయకులే ..సీఎం జగన్ కూడా ఇదే చెప్పారన్నారు. చేసే పని సిన్సియర్ గా చెయ్యమని సీఎం జగన్ చెప్తారని.. పార్టీ అంతర్గతంగా 175 స్థానాలు గెలిచే విధంగా చెప్పే ప్రయత్నమే ఈ సమావేశం అని వివరించారు. గడప గడప పెర్ఫార్మన్స్ అనడం కంటే ప్రజల దగ్గరకు వెళ్లడమే ఎజెండా... గడప గడప కూడా ఎమ్మెల్యేల ఫైనల్ పెర్ఫార్మెన్స్ లో ఒక భాగం ఇది సర్వే ల్లో కూడా వస్తుందని విశ్లేషించారు.
ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లాలని సీఎం చెప్పారని మాజీ మంత్రి కన్నబాబు తెలిపారు. ప్రభుత్వం చేస్తున్న మంచి పనులకు ప్రజలకు వివరించాలని, సచివాలయం పరిధిలో ముగ్గురు కన్వీనర్ల నియామకం త్వరగా పూర్తి చేయాలని సీఎం సూచించారని కన్నబాబు అన్నారు. ''గృహ సారధుల నియామకం కూడా జరగాలి. దాని వ్యవస్థీకృతం చేయాలని సీఎం చెప్పారు. గడప గడపకు కార్యక్రమంపై నిర్లక్ష్యం వద్దని సీఎం చెప్పారు. కొందరు ఎమ్మెల్యేలు తక్కువ రోజులు గడప గడప చేశారు. మార్చి నాటికి పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. వచ్చే మార్చిలో వర్క్‌షాప్ ఉంటుందని చెప్పారు. ఈలోగా వెనుకబడిన వారి పనితీరు మార్చుకోవాలని సూచించారు.'' అని కన్నబాబు తెలిపారు.