Padi Kaushik Reddy: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి అరెస్ట్ - హైదరాబాద్ నుంచి కరీంనగర్‌కు తరలింపు
Hyderabad News: హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని సోమవారం సాయంత్రం పోలీసులు అరెస్ట్ చేశారు. కరీంనగర్ కలెక్టరేట్‌లో ఆదివారం వివాదానికి సంబంధించి కేసులు నమోదు కాగా చర్యలు చేపట్టారు.

Huzurabad MLA Padi Kaushik Reddy Arrested: హూజారాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని (Padi Kaushik Reddy) పోలీసులు సోమవారం సాయంత్రం అరెస్ట్ చేశారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో ఓ న్యూస్ ఛానల్ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని తిరిగి వస్తుండగా దాదాపు 35 మంది పోలీసులు వచ్చి ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. కౌశిక్‌రెడ్డిని హైదరాబాద్ నుంచి కరీంనగర్‌కు తరలించనున్నారు. కాగా, కరీంనగర్ కలెక్టరేట్‌లో ఆదివారం నిర్వహించిన మంత్రుల సమీక్ష సమావేశంలో కౌశిక్ రెడ్డిపై ఎమ్మెల్యే సంజయ్‌పై దురుసుగా ప్రవర్తించారు. ఈ క్రమంలో ఇరువురి మధ్య తోపులాట చోటు చేసుకుంది. దీనిపై పోలీసులు 3 వేర్వేరు కేసులు నమోదు చేయగా చర్యలు చేపట్టారు.
ఇదీ జరిగింది
కాగా, ఆదివారం కరీంనగర్ కలెక్టరేట్‌లో మంత్రుల సమీక్ష సమావేశం రసాభాసగా మారింది. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డుల జారీ సన్నద్ధతపై నిర్వహించిన కార్యక్రమంలో డాక్టర్ సంజయ్ మాట్లాడుతుండగా.. పక్కనే ఉన్న కౌశిక్ రెడ్డి తీవ్ర అభ్యంతరం తెలిపారు. 'నువ్వు ఓ పార్టీవయా..?. ఈయనకు మైక్ ఇవ్వొద్దు..' అంటూ వేలెత్తి చూపుతూ వాగ్వాదానికి దిగారు. దీంతో ఎమ్మెల్యే సంజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 'నీకేం సంబంధం.. నాది కాంగ్రెస్ పార్టీ. నువ్వు కూర్చో' అంటూ కౌంటర్ ఇచ్చారు. ఓ దశలో ఇరువురి మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఈ పరిణామానికి వేదికపై మంత్రులతో పాటు ప్రజా ప్రతినిధులు సైతం నిర్ఘాంతపోయారు. వారు వారించినా ఫలితం లేకపోయింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కౌశిక్ రెడ్డిని బలవంతంగా బయటకు తీసుకెళ్లారు.
వేర్వేరు కేసులు నమోదు
ఈ ఘటనపై కరీంనగర్ వన్ టౌన్ పీఎస్‌లో ఎమ్మెల్యే సంజయ్ ఫిర్యాదు చేశారు. దీంతో కౌశిక్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. సమావేశంలో గందరగోళం, పక్కదారి పట్టించారని ఆర్డీవో మహేశ్వర్ ఫిర్యాదు మేరకు మరో కేసు నమోదైంది. తన పట్ల దురుసుగా ప్రవర్తించారని జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ మల్లేశం ఇచ్చిన ఫిర్యాదుపై మరో కేసు ఫైల్ అయ్యింది. ఈ 3 కేసులపైనా పోలీసులు విచారణ చేపట్టి చర్యలు చేపట్టారు. తాజాగా, కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేశారు.
స్పీకర్‌కు ఫిర్యాదు
అటు, ఈ ఘటనపై స్పీకర్‌కు ఎమ్మెల్యే సంజయ్ లిఖిత పూర్వక ఫిర్యాదు చేశారు. అధికారిక సమావేశంలో తనపై దుర్భాషలాడారని.. ప్రజా సమస్యలపై మాట్లాడుతుంటే అడ్డుకున్నారని పేర్కొన్నారు. దీనిపై స్పందించిన స్పీకర్.. నివేదిక తెప్పించుకుని చర్యలు తీసుకుంటామని చెప్పారు.
'వీధి రౌడీలా దాడి చేశారు'
తనపై కౌశిక్ రెడ్డి వీధి రౌడీలా దాడి చేశారని ఎమ్మెల్యే సంజయ్ పేర్కొన్నారు. 'కౌశిక్ రెడ్డి స్వతహాగా చేశారా.? ఎవరైనా రెచ్చగొడితే చేశారా.? అనేది తేలాలి. దీనిపై స్పీకర్‌కు ఫిర్యాదు చేశాను. గతంలో ఇతర పార్టీల నేతలను బీఆర్ఎస్‌లో చేర్చుకున్నారు. ఇతర పార్టీల నుంచి చేరికలపై కేసీఆర్, కేటీఆర్ క్షమాపణ చెప్పాలి. వారు రాజీనామా చేస్తే నేను కూడా చేస్తాను.' అని సంజయ్ స్పష్టం చేశారు.
Also Read: Hyderabad Drugs: పండుగ పూట హైదరాబాద్‌లో డ్రగ్స్ గ్యాంగ్ అరెస్ట్, బెంగళూరు నుంచి తెచ్చి విక్రయాలు
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

