Hyderabad Drugs: పండుగ పూట హైదరాబాద్‌లో డ్రగ్స్ గ్యాంగ్ అరెస్ట్, బెంగళూరు నుంచి తెచ్చి విక్రయాలు
Hyderabad Crime News | బెంగళూరు నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి నగరంలో విక్రయిస్తున్న గ్యాంగ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి ఎంఎండీఎస్ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు.

హైదరాబాద్: సంక్రాంతి పండుగ పూట హైదరాబాద్ లో డ్రగ్స్ కలకలం రేపాయి. ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు డ్రగ్స్ పట్టుకున్నారు. బెంగళూరు నుంచి కొందరు నగరానికి డ్రగ్స్ తీసుకొచ్చారు. ఎల్బీనగర్ లోని మారుతీ లార్జ్ లోని 306 రూమ్ లో పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఎంఎండిఎస్ డ్రగ్స్ విక్రయిస్తున్న నలుగురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సంక్రాంతి టార్గెట్ గా చేసుకుని నగరానికి డ్రగ్స్ తీసుకొచ్చి విక్రయిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు దాడి చేసినట్లు తెలుస్తోంది. అజయ్, జైపాల్ రాజ్, రిక్కీ, రాజు అనే నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. నిందితుల వద్ద నుంచి డ్రగ్స్ తో పాటు ఒక కారు, నాలుగు సెల్ ఫోన్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
నగరంలో ఉంటున్న వారు పండుగకు సొంతూళ్లకు వెళ్లడంతో హైదరాబాద్ రోడ్లు ఖాళీగా కనిపిస్తున్నాయి. ఏపీతో పాటు తెలంగాణలోని జిల్లాల నుంచి వచ్చి హైదరాబాద్ లో జీవనం సాగిస్తున్న కుటుంబాలు ఇక్కడ అధికం. దాంతో సంక్రాంతి పండుగ రావడంతో దాదాపు అంతా తమ సొంతూరికి వెళ్లారు. అదే సమయంలో పండుగ పూట డ్రగ్స్ వచ్చాయని సమాచారంతో పోలీసులు తనిఖీలు చేపట్టి నిందితులను అరెస్ట్ చేశారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

