అన్వేషించండి

GHMC Council Meeting: GHMC కౌన్సిల్ సమావేశం రసాభాస - మేయర్ రాజీనామాకు బీఆర్ఎస్ కార్పొరేటర్ల డిమాండ్

GHMC Meeting: జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం శనివారం రసాభాసగా మారింది. మేయర్, డిప్యూటీ మేయర్ రాజీనామా చేయాలంటూ బీజేపీ కార్పొరేటర్లు నిరసనకు దిగడంతో గందరగోళం నెలకొంది. సభ్యుల తీరుపై మేయర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

BRS Protest In GHMC Council Meeting: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) తొమ్మిదో కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది. బీఆర్ఎస్ (BRS), బీజేపీ (BJP) కార్పొరేటర్లు సమావేశం ప్రారంభానికి ముందే ప్రధాన కార్యాలయం ఆవరణలో ఆందోళనకు దిగారు. అనంతరం శనివారం ఉదయం 10 గంటలకు సమావేశం ప్రారంభం కాగా.. నిరసనలతో కొద్ది నిమిషాల్లోనే మీటింగ్ గందగోళంగా మారింది. బీఆర్ఎస్ కార్పొరేటర్లు మేయర్ పోడియాన్ని చుట్టుముట్టారు. ఆమె పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని.. మేయర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ సభ్యుల తీరుపై మేయర్ విజయలక్ష్మి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫిరాయింపులను ప్రోత్సహించిందే బీఆర్ఎస్ పార్టీ అని మేయర్ అన్నారు. పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో సమావేశం నుంచి వెళ్లిపోయారు. మీటింగ్ 15 నిమిషాలు వాయిదా వేశారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ కార్పొరేటర్లు మేయర్‌కు వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించి నిరసన తెలిపారు. వాయిదా అనంతరం సమావేశాలు తిరిగి ప్రారంభం కాగా.. నేతలు తమ పరిధిలోని సమస్యలను ఏకరవు పెట్టారు.

మేయర్ రాజీనామాకు డిమాండ్

బల్దియా కౌన్సిల్ సమావేశానికి కాంగ్రెస్ (Congress), బీఆర్ఎస్, ఎంఐఎం, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎక్స్ అఫీషియో సభ్యులు, బీజేపీ నేతలు హాజరయ్యారు. కాగా, మేయర్, డిప్యూటీ మేయర్లపై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు బీఆర్ఎస్ నేతలు సిద్ధమయ్యారు. మేయర్‌ గద్వాల విజయలక్ష్మితో పాటు డిప్యూటీ మేయర్ శ్రీలత, మరికొంత మంది కార్పొరేటర్లు బీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరడంతో వీరి రాజీనామాకు పట్టుబట్టాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. ఈ క్రమంలో బీఆర్ఎస్‌కు చెందిన గ్రేటర్ ప్రజా ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరు కావాలని నిర్దేశించింది. పార్టీ మారిన మేయర్ రాజీనామా డిమాండ్, ఇతర సమస్యలపై బహిరంగంగా ప్రశ్నించేందుకు బీఆర్ఎస్ నేతలు సిద్ధమయ్యారు.  150 మంది కార్పొరేటర్లలో ఇద్దరు ఎంఐఎం కార్పొరేటర్లు ఎమ్మెల్యేలు. మరో ఇద్దరు ఎర్రగడ్డ, గుడిమల్కాపూర్ కార్పొరేటర్లు చనిపోయారు. ప్రస్తుతం 47 మంది బీఆర్ఎస్ కార్పొరేటర్లతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎక్స్ అఫీషియో సభ్యులు ఉన్నారు. ఎంఐఎంకు 41 మంది, బీజేపీకి 39, కాంగ్రెస్‌కు 19 మంది సభ్యులున్నారు. 

సమస్యలు ఏకరవు

దాదాపు నాలుగున్నర నెలల తర్వాత జరుగుతున్న కౌన్సిల్ సమావేశంలో ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా అన్ని పార్టీలకు సంబంధించి 23 ప్రశ్నలతో సుదీర్ఘంగా చర్చ సాగేలా సభ సిద్ధమైంది. ఈ క్రమంలో సమావేశం ప్రారంభం కాగానే.. బీఆర్ఎస్ కార్పొరేటర్ల నిరసనతో సభ రసాభాసగా మారింది. అనంతరం నగరంలో పారిశుద్ధ్యం సరిగ్గా లేదని.. మేయర్ సహా అధికారులు చోద్యం చూస్తున్నారని బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇతర నేతలు సైతం జీహెచ్ఎంసీ పరిధిలోని సమస్యలు ఏకరవు పెట్టారు. వానా కాలం సమీపించినా నాలాల్లో పూడిక తీత పనులు జరగట్లేదని ఆందోళనకు దిగారు. చెరువులు కబ్జాకు గురవుతున్నాయని.. ఖాళీ పైపులు, గుర్రపు డెక్కలతో కొందరు కార్పొరేటర్లు నిరసన తెలిపారు. ప్రజలు అనారోగ్యాల బారిన పడుతున్నా.. అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. సమస్యల పరిష్కారానికి డిమాండ్ చేశారు.

Also Read: Telangana:తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు కోసం ఎదురు చూస్తున్న వారికి అప్‌డేట్ వచ్చేసింది

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Breaking News: గచ్చిబౌలిలో ట్రిపుల్‌ ఐటీ విద్యార్థి ఆత్మహత్య.. ఆరో అంతస్తు నుంచి దూకడంతో విషాదం
గచ్చిబౌలిలో ట్రిపుల్‌ ఐటీ విద్యార్థి ఆత్మహత్య.. ఆరో అంతస్తు నుంచి దూకడంతో విషాదం
TRS Chief Kavitha Reaction : కొత్త పేరు ఇచ్చేది లేదు, న్యాయపోరాటం చేస్తా: ఈసీ అభ్యంతరాలపై కవిత తొలి రియాక్షన్!
కొత్త పేరు ఇచ్చేది లేదు, న్యాయపోరాటం చేస్తా: ఈసీ అభ్యంతరాలపై కవిత తొలి రియాక్షన్!
TRS Chief Kavitha: టీఆర్‌ఎస్‌ చీఫ్‌ కవితకు షాక్‌! 15 రోజు సమయం ఇచ్చిన ఈసీ!
టీఆర్‌ఎస్‌ చీఫ్‌ కవితకు షాక్‌! 15 రోజు సమయం ఇచ్చిన ఈసీ!
Telangana Police Recruitment 2026: తెలంగాణ పోలీస్‌ శాఖలో భారీ కొలువులు జాతర! ఐదు వేల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్!
తెలంగాణ పోలీస్‌ శాఖలో భారీ కొలువులు జాతర! ఐదు వేల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్!

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vijayawada Sai Krishna Case: సాయికృష్ణ లాకప్ డెత్.. విచారణకు హాజరైన వైసీపీ నేతలు, బాధిత కుటుంబసభ్యులు.. సీబీఐ విచారణకు వినతి
సాయికృష్ణ లాకప్ డెత్.. విచారణకు హాజరైన వైసీపీ నేతలు, బాధిత కుటుంబసభ్యులు.. సీబీఐ విచారణకు వినతి
Notice To Telegram: పైరసీ సినిమాలపై టెలిగ్రామ్‌కు కేంద్రం నోటీసులు! 15 రోజులే గడువు!  
పైరసీ సినిమాలపై టెలిగ్రామ్‌కు కేంద్రం నోటీసులు! 15 రోజులే గడువు!  
TRS Chief Kavitha: టీఆర్‌ఎస్‌ చీఫ్‌ కవితకు షాక్‌! 15 రోజు సమయం ఇచ్చిన ఈసీ!
టీఆర్‌ఎస్‌ చీఫ్‌ కవితకు షాక్‌! 15 రోజు సమయం ఇచ్చిన ఈసీ!
Hindu Dharma: హిందూ ధర్మం -
హిందూ ధర్మం - "దుస్తులకు సంబంధించిందా , గుణానికి సంబంధించిందా?
Rayalaseema Manufacturing Hub: పారిశ్రామిక చదరంగంలో ‘రాయల్’ సీమ.. తయారీ రంగ కేంద్రంగా మార్చేందుకు కూటమి సర్కార్ పక్కా స్కెచ్!
పారిశ్రామిక చదరంగంలో ‘రాయల్’ సీమ.. తయారీ రంగ కేంద్రంగా మార్చేందుకు కూటమి సర్కార్ పక్కా స్కెచ్!
Telangana Police Recruitment 2026: తెలంగాణ పోలీస్‌ శాఖలో భారీ కొలువులు జాతర! ఐదు వేల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్!
తెలంగాణ పోలీస్‌ శాఖలో భారీ కొలువులు జాతర! ఐదు వేల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్!
200 Rupee News: 200 రూపాయల నోటు అసలైనదో, నకిలీదో ఎలా గుర్తించాలి? ఆర్‌బిఐ చెప్పిన ట్రిక్స్‌ ఇవే!
200 రూపాయల నోటు అసలైనదో, నకిలీదో ఎలా గుర్తించాలి? ఆర్‌బిఐ చెప్పిన ట్రిక్స్‌ ఇవే!
Pragya Nagra : బంగారు కాంతుల్లో అందాల ప్రగ్యా - తమిళ బ్యూటీ క్యూట్ లుక్స్... వెయిటింగ్ ఫర్ టాలీవుడ్ ఛాన్సెస్
బంగారు కాంతుల్లో అందాల ప్రగ్యా - తమిళ బ్యూటీ క్యూట్ లుక్స్... వెయిటింగ్ ఫర్ టాలీవుడ్ ఛాన్సెస్
Embed widget