Vaccination: తెలంగాణలో రేపటి నుంచి బూస్టర్ డోస్.. రిజిస్ట్రేషన్ అవసరం లేదు
తెలంగాణలో రేపటి నుంచి బూస్టర్ డోస్ వ్యాక్సినేషన్ ప్రారంభం అవనుంది. ఈ మేరకు అధికారులు తెలిపారు.
తెలంగాణలో రేపటి నుంచి బూస్టర్ డోస్ వ్యాక్సినేషన్ ప్రారంభం అవుతుంది. హెల్త్‌కేర్ వర్కర్లు, ఫ్రంట్‌లైన్ వర్కర్లు, 60 ఏళ్లు పైబడిన వారికి బూస్టర్ డోసు ఇస్తారు. బూస్టర్ డోస్ కోసం ప్రత్యేకంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదని అధికారులు తెలిపారు. గతంలో ఉన్న రిజిస్ట్రేషన్‌తోనే బూస్టర్ డోసు తీసుకోవచ్చు. దీనికోసం కొవిన్‌లో స్లాట్ బుకింగ్ ద్వారా, లేదంటే నేరుగా.. టీకా కేంద్రానికి వెళ్లి వ్యాక్సిన్ తీసుకోవచ్చు.
కొవిడ్ వ్యాక్సిన్ రెండో డోసు వేసుకుని 9 నెలలు పూర్తైన వారికి, 60 ఏళ్లు పైబడి.. దీర్ఘకాలిగా ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి బూస్టర్ డోసు ఇస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 8.3 లక్షల మంది 60 ఏళ్లు పైబడి దీర్ఘ కాలిక వ్యాధులతో బాధపడుతున్నట్టు వైద్యారోగ్యశాఖ అంచనా వేస్తోంది.
కొవిడ్-19 వ్యాక్సిన్ యొక్క మూడో డోస్‌ను తీసుకునేవారు.. నేరుగా ఏదైనా కొవిడ్-19 టీకా కేంద్రంలో అపాయింట్‌మెంట్ తీసుకోవచ్చు. ఆ తర్వాత వ్యాక్సిన్ వేసుకోవచ్చు. అపాయింట్‌మెంట్‌తో టీకాలు వేయడం జనవరి 10 నుంచి.. ప్రారంభమవుతుందని.. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రికాషన్ కొవిడ్ వ్యాక్సిన్.. గతంలో ఇచ్చిన వ్యాక్సిన్‌గానే ఉంటుందని కేంద్రం ఇప్పటికే స్పష్టం చేసింది.
'ప్రికాషన్ COVID-19 వ్యాక్సిన్ మోతాదు గతంలో ఇచ్చిన అదే వ్యాక్సిన్‌గా ఉంటుంది. కోవాక్సిన్‌ని తీసుకున్నవారు కోవాక్సిన్‌ని అందుకుంటారు. కొవిషీల్డ్‌ని మెుదటి రెండు డోస్‌లు పొందిన వారు కోవిషీల్డ్‌ని అందుకుంటారు.' అని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మీడియా సమావేశంలో నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పాల్ తెలిపారు.
దేశంలో జనవరి 3వ తేదీ నుంచి.. 15-18 సంవత్సరాల మధ్య వయస్సు గల వారి కోసం కోవిడ్-19 టీకా డ్రైవ్‌లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. మొదటి రోజునే, 40 లక్షల మంది వరు టీకా వేసుకున్నారు. కొవిడ్-19 వ్యాక్సిన్‌ను ఇప్పటికే 15-18 సంవత్సరాల మధ్య పిల్లలకు అందించినట్లు ఆరోగ్య మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా చెప్పారు.
Also Read: Vaccination: సీనియర్ సిటిజన్లకు జనవరి 10 నుంచి ప్రికాషన్ డోస్.. రిజిస్ట్రేషన్ అవసరం లేదు
Also Read: Covid 19 3rd Wave: భయంకరంగా కరోనా థర్డ్ వేవ్.. దేశంలో రోజుకు 10 లక్షల కేసులు!
Also Read: మా ఇండస్ట్రీ నుంచి మరో బ్రిలియంట్ సినిమా.. 'శ్యామ్ సింగరాయ్'పై చరణ్ ప్రశంసలు..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి