అన్వేషించండి

joinings In Congress : బీజేపీపైనా ఆకర్ష్ - కాంగ్రెస్‌లో చేరిన ఇద్దరు నియోజకవర్గ ఇంచార్జులు

Telangana Politics : బీజేపీ నేతలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. సంగారెడ్డి, మక్తల్ నియోజకవర్గ ఇంచార్జులు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు.


BJP leaders are also joining Congress party  : లోక్‌సభ ఎన్నికలు దగ్గర పడుతూండటంతో కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ ప్రారంభించారు. ఇప్పటి వరకూ బీఆర్ఎస్ నేతలే కాంగ్రెస్ లో చేరుతూ వస్తున్నారు. తాజాగా  బీజేపీ నియోజకవర్గ ఇంచార్జులను కూడా పార్టీలో చేర్చుకుంటున్నారు. 

కాంగ్రెస్‌లో చేరిన సంగారెడ్డి నియోజకవర్గ ఇంచార్జ్ 

భారతీయ జనతా పార్టీకి మెదక్ పార్లమెంట్ సెగ్మెంట్ లో గట్టి షాక్ తగిలింది. ఆ పార్టీ సంగారెడ్డి నియోజకవర్గ ఇన్చార్జి పులి మామిడి రాజు హస్తం గూటికి చేరారు.   శనివారం హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసానికి ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ తో కలిసి వచ్చారు.   సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి పులి మామిడి రాజుకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.  సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుకు ఆకర్షితులై పార్టీలోకి వచ్చేవారికి వెల్కమ్ చెబుతుందన్నారు. బిజెపి నుంచి కాంగ్రెస్ లో చేరిన పులి మామిడి రాజును సీఎం అభినందించారు. బీజేపీ తరపున పోటీ చేసిన పులిమామిడి రాజు 21 వేల ఓట్లను తెచ్చుకుని మూడో స్థానంలో నిలిచారు. 

 

 

కాంగ్రెస్‌లో చేరిన మక్తల్ ఇంచార్జ్ జలంధర్ రెడ్డి 
  
మక్తల్ నియోజకవర్గానికి చెందిన బిజెపి నాయకులు మాదిరెడ్డి జలంధర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. గురువారం రోజు రాత్రి బిజెపి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన ఆయన   మాజీ ఎంపీ ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఏపీ జితేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచంద్ రెడ్డిల ఆధ్వర్యంలో  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయ‌న‌కు కాంగ్రెస్ కండువా కప్పి ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు .పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని ముఖ్యమంత్రి సూచించారు. పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని భరోసా ఇచ్చారు. నియోజకవర్గంలో పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన మాదిరెడ్డి జలంధర్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో మక్తల్ అసెంబ్లీ స్థానానికి బిజెపి అభ్యర్థిగా పోటీ చేసి మూడవ స్థానంలో నిలిచారు . 

 

 

బీజేపీ అంతర్గత రాజకీయాలతో పలువురు రాజీనామాలు

పార్లమెంట్ నియోజకవర్గాల్లో బీజేపీ అంతర్గత రాజకీయాల కారణంగా పలువురు రాజీనామాలు చేసి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. టిక్కెట్ దక్కని కారణంగా జితేందర్ రెడ్డి బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనకు మహబూబ్ నగర్ వ్యాప్తంగా పరిచయాలు ఉండటం, తన అనుచరుల్ని ఆయన కాంగ్రెస్ పార్టీలో చేర్పిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లోపు మరికొంత మందిని చేర్చుకునేందుకు కాంగ్రెస్ సిద్ధమవుతోంది. 

టాప్ హెడ్ లైన్స్

Telangana News: తెలంగాణలో వారికి గుడ్ న్యూస్.. దసరా నుంచి చేయూత కొత్త పింఛన్లు పంపిణీకి నిర్ణయం
తెలంగాణలో వారికి గుడ్ న్యూస్.. దసరా నుంచి చేయూత కొత్త పింఛన్లు పంపిణీకి నిర్ణయం
Hyderabad fake hijra extortion: హైదరాబాద్‌లో హిజ్రాల వేధింపుల దందా.. లా అండ్ ఆర్డర్ సమస్యతోనే పరిష్కారమవుతుందా?
హైదరాబాద్‌లో హిజ్రాల వేధింపుల దందా.. లా అండ్ ఆర్డర్ సమస్యతోనే పరిష్కారమవుతుందా?
Telangana 22A land list : 22A భూముల వివాదం.. నిజమైన సంక్షోభమా? బీఆర్ఎస్ మైండ్ గేమా?
22A భూముల వివాదం.. నిజమైన సంక్షోభమా? బీఆర్ఎస్ మైండ్ గేమా?
Future City land controversy: ఫ్యూచర్ సిటీ వర్సెస్ ఫార్మా సిటీ .. రేవంత్ డ్రీమ్ ప్రాజెక్టుపై కేటీఆర్ కౌంటర్ ఎటాక్ రాజకీయ వ్యూహమా?
ఫ్యూచర్ సిటీ వర్సెస్ ఫార్మా సిటీ .. రేవంత్ డ్రీమ్ ప్రాజెక్టుపై కేటీఆర్ కౌంటర్ ఎటాక్ రాజకీయ వ్యూహమా?

వీడియోలు

Gundenininda Gudigantalu Serial September 11
India vs Afghanistan T20I Series 2026 | అఫ్గానిస్తాన్‌ సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు బిగ్ రిలీఫ్
India Vs Afghanistan T20 | టీ20 మ్యాచ్‌ నిర్వహణకు ఢిల్లీ పోలీస్ గ్రీన్ సిగ్నల్
Women's Asia Cup 2026 IND vs BAN Semifinal | ఆసియా కప్‌ ఫైనల్లో టీమిండియా
Ashish Nehra India Head Coach Rumors | టీమిండియా కోచ్ పోస్ట్ పై నెహ్రా ఫన్నీ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan On DSC: ఈ ముగ్గురికి జాబ్స్ ఎలా ఇచ్చారు.. 7 దశల్లో వెరిఫికేషన్ అంటే ఇదేనా? డీఎస్సీపై జగన్ ప్రశ్నలు
ఈ ముగ్గురికి జాబ్స్ ఎలా ఇచ్చారు.. 7 దశల్లో వెరిఫికేషన్ అంటే ఇదేనా? డీఎస్సీపై జగన్ ప్రశ్నలు
AP Rains: ఏపీలో వర్ష బీభత్సానికి కొట్టుకుపోయిన వంతెన.. 15 గ్రామాలకు రాకపోకలు బంద్!
ఏపీలో వర్ష బీభత్సానికి కొట్టుకుపోయిన వంతెన.. 15 గ్రామాలకు రాకపోకలు బంద్!
Telangana News: తెలంగాణలో వారికి గుడ్ న్యూస్.. దసరా నుంచి చేయూత కొత్త పింఛన్లు పంపిణీకి నిర్ణయం
తెలంగాణలో వారికి గుడ్ న్యూస్.. దసరా నుంచి చేయూత కొత్త పింఛన్లు పంపిణీకి నిర్ణయం
Gannavaram MLA Yarlagadda: డబ్బులిస్తేనే పోలీసులు పనిచేస్తారా?.. కేసరపల్లి ఘటనపై ఎమ్మెల్యే యార్లగడ్డ ఫైర్
డబ్బులిస్తేనే పోలీసులు పనిచేస్తారా?.. కేసరపల్లి ఘటనపై ఎమ్మెల్యే యార్లగడ్డ ఫైర్
BRICS Summit 2026: ఏడేళ్ల తర్వాత భారత్‌కు చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్, నేడు మోదీతో కీలక భేటీ
బ్రిక్స్ సమ్మిట్ 2026.. ఏడేళ్ల తర్వాత భారత్‌కు చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్, నేడు మోదీతో కీలక భేటీ
Shobha Shetty: రాఘవేంద్ర స్వామి సన్నిధిలో శోభా శెట్టి... మంత్రాలయంలో స్వామి దర్శనం
రాఘవేంద్ర స్వామి సన్నిధిలో శోభా శెట్టి... మంత్రాలయంలో స్వామి దర్శనం
Rithu Chowdary: తనూజ వెబ్ సిరీస్‌పై రీతూ చౌదరి కామెంట్స్... కళ్యాణ్ పాటపై ఏమన్నారంటే?
తనూజ వెబ్ సిరీస్‌పై రీతూ చౌదరి కామెంట్స్... కళ్యాణ్ పాటపై ఏమన్నారంటే?
Avengers End Game Advance Bookings : విశ్వాన్ని కాపాడే సూపర్ హీరోస్ - సిల్వర్ స్క్రీన్‌పై మరోసారి అవెంజర్స్ ఎండ్ గేమ్... అడ్వాన్స్ బుకింగ్స్ షురూ
విశ్వాన్ని కాపాడే సూపర్ హీరోస్ - సిల్వర్ స్క్రీన్‌పై మరోసారి అవెంజర్స్ ఎండ్ గేమ్... అడ్వాన్స్ బుకింగ్స్ షురూ
Embed widget