అన్వేషించండి

Ranganath Signature Forged Fake Fire NOC Case: హైడ్రా రంగనాథ్, ఫైర్ డీజీ సంతకాలు ఫోర్జరీ - 8 ప్రైవేట్ జూనియర్ కాలేజీలపై కేసు!

HYDRA Commissioner : హైడ్రా కమిషనర్ రంగనాథ్, ఫైర్ డీజీ సంతకాలు ఫోర్జరీ చేసి నకిలీ ఎన్‌ఓసీలు పొందిన 8 ప్రైవేట్ జూనియర్ కాలేజీలపై లేక్ పిఎస్ లో కేసు నమోదైంది. ప్రముఖ కాలేజీలు ఈ జాబితాలో ఉన్నాయి.

8 Junior Colleges Affiliation Cancellation: హైదరాబాద్ నగరంలో చెరువులు, ప్రభుత్వ స్థలాల పరిరక్షణతో పాటు ప్రజా భద్రతపై ఉక్కుపాదం మోపుతున్న హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ  పేరుతో భారీ గోల్ మాల్  యత్నం వెలుగులోకి రావడం కలకలం రేపింది. హైడ్రా కమిషనర్ ఎ.వి. రంగనాథ్ ,  అగ్నిమాపక శాఖ డీజీ సంతకాలను ఫోర్జరీ చేసి , నకిలీ ఫైర్ ఎన్‌ఓసీ  లను ఇంటర్మీడియట్ బోర్డుకు సమర్పించిన వ్యవహారంలో 8 ప్రముఖ ప్రైవేట్ జూనియర్ కాలేజీ యాజమాన్యాలపై లేక్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదైంది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన ఈ కళాశాలలపై క్రిమినల్ చర్యలతో పాటు, వాటి అనుబంధ గుర్తింపును  తక్షణమే రద్దు చేయాలని అధికారులు తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డుకు అధికారికంగా ఫిర్యాదు చేశారు.

ఇంటర్మీడియట్ విద్యాసంస్థల అనుమతులు పొందేందుకు అగ్నిమాపక శాఖ నుంచి పొందే ఫైర్ సెక్యూరిటీ ఎన్ఓసీలు అత్యంత ప్రామాణికం. అయితే, ఫైర్ సేఫ్టీ నిబంధనలను పాటించకుండా, అగ్నిమాపక యంత్రాలు అమర్చకుండానే అనుమతులు పొందాలనే దురుద్దేశంతో కొందరు ప్రైవేట్ కళాశాలల నిర్వాహకులు, మధ్యవర్తులతో చేతులు కలిపారు. ఈ క్రమంలోనే హైడ్రా కమిషనర్ రంగనాథ్ తో పాటు తెలంగాణ ఫైర్ సర్వీసెస్ డీజీ సంతకాలను హూబహూ ఫోర్జరీ చేసి, నకిలీ లెటర్ హెడ్‌లపై ఫేక్ ఫైర్ NOC సర్టిఫికేట్లను సృష్టించి బోర్డు అధికారిక పోర్టల్‌లో అప్‌లోడ్ చేసినట్లు ప్రాథమిక విచారణలో రుజువైంది.

ఫోర్జరీ అక్రమాలకు పాల్పడినట్లు నిర్ధారణ కావడంతో  హైందవీ జూనియర్ కాలేజీ, రెసోనెన్స్ జూనియర్ కాలేజీ, ప్రియాంక జూనియర్ కాలేజీ, మదర్స్ గర్ల్స్ జూనియర్ కాలేజీ, శ్రీచైతన్య జూనియర్ కాలేజీ, న్యూ ఎరా జూనియర్ కాలేజీ, షాహీన్ జూనియర్ కాలేజీ, వశిష్ట జూనియర్ కాలేజీలపై కేసులు పెట్టారు. తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు నిర్వహించిన వార్షిక తనిఖీలు ,  డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రక్రియలో ఈ నకిలీ ఎన్‌ఓసీల దందా గుట్టు రట్టయింది. క్యూఆర్ కోడ్‌లు, ఫైల్ నంబర్లు మ్యాచింగ్ కాకపోవడంతో సందేహం వచ్చిన ఇంటర్ బోర్డు అధికారులు నేరుగా హైడ్రా,  అగ్నిమాపక శాఖలకు సమాచారం అందించారు. ఈ పత్రాలు తమ శాఖ నుంచి జారీ కాలేదని, సంతకాలు సైతం ఫోర్జరీకి గురయ్యాయని ధ్రువీకరించుకున్న కమిషనర్ రంగనాథ్.. ఈ దగాకోరు చర్యలను తీవ్రంగా పరిగణించి లేక్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు సమగ్ర దర్యాప్తుకు ఆదేశించారు.

ప్రజా భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చే హైడ్రా మరియు అగ్నిమాపక శాఖల ఐపీఎస్ అధికారుల సంతకాలనే ఫోర్జరీ చేయడానికి సాహసించడంపై పోలీసు ఉన్నతాధికారులు కఠిన వైఖరి అవలంబిస్తున్నారు. ఈ కుంభకోణం వెనుక ఉన్న కళాశాల కరస్పాండెంట్లు, ప్రిన్సిపాళ్లతో పాటు ఈ నకిలీ సర్టిఫికేట్లను తయారు చేసిన ఏజెంట్లు, డెస్క్‌టాప్ పబ్లిషింగ్  సెంటర్ నిర్వాహకులను అరెస్ట్ చేసేందుకు పోలీసులు బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారు. వేలాది మంది విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతూ, ఫోర్జరీకి పాల్పడిన ఈ కాలేజీలను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టేది లేదని, కాలేజీల గుర్తింపు రద్దు చేసి సీజ్ చేసే దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ranganath Signature Forged Fake Fire NOC Case: హైడ్రా రంగనాథ్, ఫైర్ డీజీ సంతకాలు ఫోర్జరీ - 8 ప్రైవేట్ జూనియర్ కాలేజీలపై కేసు!
హైడ్రా రంగనాథ్, ఫైర్ డీజీ సంతకాలు ఫోర్జరీ - 8 ప్రైవేట్ జూనియర్ కాలేజీలపై కేసు!
Telangana Dial 112 Launch : డయల్ 100 స్థానంలో ఇక డయల్ 112 - ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డ్రోన్ టెక్నాలజీతో తెలంగాణ పోలీసింగ్‌లో సరికొత్త విప్లవం!
డయల్ 100 స్థానంలో ఇక డయల్ 112 - ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డ్రోన్ టెక్నాలజీతో తెలంగాణ పోలీసింగ్‌లో సరికొత్త విప్లవం!
Breaking News: ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
NEET UG 2026 Counselling: ఎంబీబీఎస్‌ ఆల్‌ ఇండియా కోటా కౌన్సెలింగ్‌ నేటి నుంచి ప్రారంభం! కొత్త రూల్స్‌ ఇవే!
ఎంబీబీఎస్‌ ఆల్‌ ఇండియా కోటా కౌన్సెలింగ్‌ నేటి నుంచి ప్రారంభం! కొత్త రూల్స్‌ ఇవే!
Advertisement

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PV Sindhu Sports Academy Visakhapatnam: విశాఖలో పీవీ సింధు స్పోర్ట్స్ అకాడమీకి రెండోసారి శంకుస్థాపన జరిగిందా? 
విశాఖలో పీవీ సింధు స్పోర్ట్స్ అకాడమీకి రెండోసారి శంకుస్థాపన జరిగిందా?
AP DSC 2026 Notification: డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
Breaking News: ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
Amritsar Police:జంతర్ మంతర్‌లో ఐఎస్ఐ ముఠాల రెక్కీ! దాడులకు పాకిస్తాన్‌ కుట్ర! 9 మంది అరెస్టు! నిందితుల్లో నలుగురు మైనర్లు!
జంతర్ మంతర్‌లో ఐఎస్ఐ ముఠాల రెక్కీ! దాడులకు పాకిస్తాన్‌ కుట్ర! 9 మంది అరెస్టు! నిందితుల్లో నలుగురు మైనర్లు!
కలుషిత E20 ఇంధనంతో జాగ్రత్త! వెహికల్‌ ఓనర్లకు SIAM హెచ్చరిక - కేంద్రం కీలక ఆదేశాలు
E20 పెట్రోల్‌పై కొత్త ఆందోళన.. దెబ్బతింటున్న ఇంజిన్ పార్ట్స్, పెరుగుతున్న రిపేర్లు!
PM Modi Praises Nara Lokesh: నారా లోకేష్‌కు మోదీ ప్రశంసలు - ఒక్క సారి కాదు చాలా సార్లు - భవిష్యత్ నేతల్లో ఒకరిగా చూస్తున్నారా?
నారా లోకేష్‌కు మోదీ ప్రశంసలు - ఒక్క సారి కాదు చాలా సార్లు - భవిష్యత్ నేతల్లో ఒకరిగా చూస్తున్నారా?
Telangana Cabinet Expansion 2026: కర్ణాటక కేబినెట్ అలకల సీన్‌తో రేవంత్ రెడ్డి ప్లాన్ బీ - తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై కొత్త వ్యూహం!?
2026: కర్ణాటక కేబినెట్ అలకల సీన్‌తో రేవంత్ రెడ్డి ప్లాన్ బీ - తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై కొత్త వ్యూహం!?
Donald Trump: అమెరికా అధ్యక్షుడి హత్యకు కుట్ర! భగ్నం చేసిన భద్రతా బలగాలు! నిందితుడి ఇంట్లో తూటాల డంప్!
అమెరికా అధ్యక్షుడి హత్యకు కుట్ర! భగ్నం చేసిన భద్రతా బలగాలు! నిందితుడి ఇంట్లో తూటాల డంప్!
Embed widget