BDL Astra Missile : ఎయిర్ పోర్స్, నేవీకి అస్త్ర క్షిపణి వ్యవస్థ, రక్షణ శాఖతో బీడీఎల్ రూ.2971 కోట్ల ఒప్పందం
BDL Astra Missile : అస్త్ర క్షిపణి వ్యవస్థ, అనుబంధ పరికరాల సరఫరా కోసం బీడీఎల్ రక్షణ శాఖతో రూ. 2971 కోట్లకు ఒప్పందం కుదుర్చుకుంది. ఈ క్షిపణులను భారత నేవీ, ఎయిర్ పోర్స్ లలో వినియోగించనున్నారు.
ఎయిర్ పోర్స్, నౌకాదళం కోసం అస్త్ర ఎంకే-I బియాండ్ విజువల్ రేంజ్ (BVR) ఎయిర్ టు ఎయిర్ మిస్సైల్ (AAM) దాని అనుబంధ పరికరాల సరఫరా కోసం భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (BDL)తో రక్షణ మంత్రిత్వ శాఖ ఇవాళ ఒప్పందం చేసుకుంది. స్వదేశీ పరిజ్ఞానం కింద రూ. 2971 కోట్లతో ఒప్పందం కుదుర్చుకుంది. బీడీఎల్ ఇండియన్ - IDDM కేటగిరీ కింద ఇండియన్ ఎయిర్ ఫోర్స్, నేవీ కోసం అనుబంధ పరికరాలు అందించనుంది. న్యూఢిల్లీలో బీడీఎల్ డైరెక్టర్(ప్రొడక్షన్) పి. రాధాకృష్ణ, జాయింట్ సెక్రటరీ, అక్విజిషన్ మేనేజర్(ఎయిర్) సంజయ్ సింగ్, రక్షణ శాఖ అధికారులు ఒప్పందంపై సంతకాలు చేశారు. ఆరేళ్లలో అనుబంధ పరికరాలు అందించాలని ఒప్పందం చేసుకున్నారు. BDL కమోడోర్ సిద్ధార్థ్ మిశ్రా (రిటైర్డ్) భారత సాయుధ దళాలు, నౌకాదళంతో పాటు, విదేశాలకు ఎగుమతి చేయడానికి అస్త్ర క్షిపణిని రూపొందిస్తున్నట్లు తెలిపారు. అస్త్ర క్షిపణి దేశీయ, విదేశీ డిమాండ్‌ను తీర్చడానికి తయారీ సామర్థ్యాన్ని పెంచుతామన్నారు.
అస్త్ర ప్రత్యేకత
అస్త్ర అనేది స్వదేశంలో అభివృద్ధి చేసిన విజువల్ రేంజ్ బియాండ్ ఎయిర్-టు-ఎయిర్ క్షిపణి. ఈ క్షిపణి 80 కి.మీ నుంచి 110 కి.మీ రేంజ్ కలిగి ఉంటుంది. 20 కి.మీ ఎత్తు వరకు పయనించగలదు. అస్త్ర క్షిపణిని డీఆర్డీవో(DRDO) రూపొందించింది. దీనిని బీడీఎల్ అభివృద్ధి చేస్తుంది. ఎయిర్ పోర్స్, నేవీలో అస్త్ర ఎంకే-1 ఆయుధ వ్యవస్థ ప్రోగ్రామ్‌ను ప్రవేశపెట్టడం వలన మౌలిక సదుపాయాల కల్పనకు మరింత ఊతం అందించినట్లు అవుతోంది. ఇప్పటి వరకు ఈ క్షిపణులను తయారు చేసే సాంకేతికత అందుబాటులో లేదు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF) అవసరాల ఆధారంగా విజువల్ రేంజ్ క్లోజ్ కంబాట్ ఎంగేజ్‌మెంట్ కోసం అస్త్ర క్షిపణిని డీఆర్డీవో రూపొందించింది. BVR సామర్థ్యంతో ఎయిర్ టు ఎయిర్ క్షిపణులు ప్రత్యర్థి ఎయిర్‌క్రాఫ్ట్ లను అడ్డుకోగలవు. తద్వారా గగనతలంలో ఆధిక్యతను పొందవచ్చు. ఈ క్షిపణి వ్యవస్థ మిగిలిన వాటి కంటే సాంకేతికంగా ముందుంది.
ఇతర మిస్సైల్స్
అస్త్ర క్షిపణితో పాటు, బీడీఎల్, దాని గ్లోబల్ ఔట్రీచ్‌లో భాగంగా ఆకాష్ వెపన్ సిస్టమ్ (సర్ఫేస్-టు-ఎయిర్ మిస్సైల్), స్మార్ట్ యాంటీ-ఎయిర్‌ఫీల్డ్ వెపన్ అండ్ హెలీనా (ఎయిర్-టు-సర్ఫేస్ వెపన్), లైట్ వెయిట్ టార్పెడో అండ్ హెవీ బరువు టార్పెడో (అండర్వాటర్ వెపన్స్), కౌంటర్ మెజర్స్ డిస్పెన్సింగ్ సిస్టమ్ & యాంటీ సబ్‌మెరైన్ వార్‌ఫేర్ సూట్ (కౌంటర్ మెజర్ సిస్టమ్స్), యాంటీ ట్యాంక్ గైడెడ్ క్షిపణులు అవి నాగ్, కొంకర్స్ - M & MILAN - 2T ఎగుమతుల కోసం అభివృద్ధి చేస్తుంది.