అన్వేషించండి

Bandi Sanjay : దేవుళ్లను కించ పరిస్తే బడిత పూజ చేయండి - హిందూ సమాజం ఏకం కావాలని బండి సంజయ్ పిలుపు

హిందూ దేవుళ్లను కించ పరిస్తే దాడులు చేయాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు. హిందూ సమాజం ఏకం కావాలన్నారు.

Bandi Sanjay :   అయ్యప్ప స్వామిపై భైరి నరేష్ అనే వ్యక్తి చేసిన వ్యాఖ్యల దుమారం క్రమంగా రాజకీయం అవుతోంది.  ఈ వ్యవహారంపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు.  హిందూ ధర్మాన్ని కించపరిచే హబ్ గా రాష్ట్రం మారిందని  బండి సంజయ్  మండిపడ్డారు.  మేం రోజుకో దేవుడిని మొక్కుతం. మేము దేవుడిని మొక్కితే కొంతమందికి నొప్పి అవుతోందని ఆయన   వ్యాఖ్యానించారు. కూకట్ పల్లి లో బండి సంజయ్ మాట్లాడుతూ.. ‘‘అయ్యప్పను కించపరిచే విధంగా కొందరు మాట్లాడుతున్నారు. హిందూ ధర్మాన్ని.. హిందూ దేవుళ్లను కించపరిస్తే బీజేపీ , హిందూవాహిని తదితర హిందూ ధర్మ సంఘాలు మీకు అండగా ఉంటాయి’’ అని హామీ ఇచ్చారు.  హిందూ సమాజం అంతా ఏకం కావాలని ఆయన పిలుపునచి్చారు.  

మహిళలు కుంకుమ బొట్లు పెట్టుకోవాలి..  మగవాళ్లు షార్ట్స్ వేసుకోవద్దు : బండి సంజయ్ 

 ఏ రాజకీయ పార్టీలో ఉన్నవారైనా  హిందూ ధర్మాన్ని కించపరిస్తే ఊరుకోవద్దని పిలుపునిచ్చారు.  మన కల్చర్ ను మనమే కాపాడుకోవాలన్నారు.  సంఘటితంగా ఉంటేనే హిందూ ధర్మాన్ని కాపాడుకోగలమన్నారు. ఎవరైనా దేవుళ్లను కించ పరిస్తే  బడిత పూజ చేయండి. నాకెందుకని ఊరుకోకండనిసూచించారు.  హిందువుగా పుట్టినవాళ్లం హిందువుగానే చచ్చిపోదాం. మహిళలు బొట్టు బిళ్ళలు కాకుండా కుంకుమ బొట్టును పెట్టుకోండని సలహా ఇచ్చారు.  పురుషులు షార్ట్స్ వేసుకొని తిరగడం బంద్ చేయాలని..  దయచేసి కల్చర్ ను కాపాడండాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు.  

భైరి నరేష్ పై పీడీ యాక్ట్ పెట్టాలని బీజేపీ డిమాండ్ 

ఈ అంశంపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా స్పందించారు.  నాస్తిక సంఘం పేరుతో  హిందూ దేవతలను కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలను ఖండించారు.  హిందు దేవతలను కించపరుస్తూ మాట్లాడినా నరేష్‌పై చర్యలు తీసుకోవాలని రాజాసింగ్ డిమాండ్ చేశారు. ఓ వర్గంపై రాజాసింగ్ ఎవ్వరిపై కామెంట్ చేయకపోయినా.. పీడీ యాక్ట్ కేసు నమోదు చేసి జైల్లో పెట్టారని.. అయ్యప్పస్వాముల మీద ఘోరంగా మాట్లాడిన వ్యక్తిపై పీడీయాక్ట్ కేసు నమోదు చేయాలన్నారు.  

భైరి నరేష్ అరెస్ట్ - కొడంగల్ కోర్టులో హాజరు పరిచిన పోలీసులు 

అయ్యప్ప స్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన భైరి నరేష్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. వరంగల్‌లో అతడిని అదుపులోకి తీసుకున్నారు. కాసేపట్లో కొడంగల్‌కు తరలించనున్నారు. సోషల్ మీడియా ద్వారా ట్రాప్‌ చేసిన పోలీసులు.. వరంగల్‌ నుంచి ఖమ్మం వస్తుండగా పట్టుకున్నారు. పరారీలో ఉండి కూడా అనుచిత వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేశాడు భైరి నరేష్. భైరి నరేష్‌ను అరెస్ట్ చేశామని వికారాబాద్ ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. నరేష్‌పై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా అయ్యప్ప స్వాములు చేపట్టిన ఆందోళనలు విరమించాలని ఆయన కోరారు.  అయితే ప్రస్తుతం భైరి నరేష్ అంశం రాజకీయ దుమారం రేగుతోంది. 

ఢిల్లీలో ఉద్యోగులందరికీ వర్క్‌ ఫ్రమ్ హోమ్, దారుణంగా పడిపోయిన ఎయిర్ క్వాలిటీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Lagacherla News: వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
Nara Rammurthy Naidu: సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి
సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి
Pushpa 2 Trailer: మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
Actress Kasthuri: సినీ నటి కస్తూరికి 14 రోజుల రిమాండ్ - చెన్నై సెంట్రల్ జైలుకు తరలించిన పోలీసులు
సినీ నటి కస్తూరికి 14 రోజుల రిమాండ్ - చెన్నై సెంట్రల్ జైలుకు తరలించిన పోలీసులు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సచ్చిపోదామని యాసిడ్ తాగినా!! ఇతని స్టోరీకి కన్నీళ్లు ఆగవు!బై నాన్నా.. వెక్కివెక్కి ఏడ్చిన నారా రోహిత్Nayanthara vs Dhanush Netflix Documentary | తమిళ్ సినీ ఇండస్ట్రీలో వివాదం..నయనతార vs ధనుష్ | ABP Desamరోహిత్ కి ధోని చేసిన మేలు, తిలక్ కి సూర్య చేస్తున్నాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Lagacherla News: వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
Nara Rammurthy Naidu: సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి
సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి
Pushpa 2 Trailer: మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
Actress Kasthuri: సినీ నటి కస్తూరికి 14 రోజుల రిమాండ్ - చెన్నై సెంట్రల్ జైలుకు తరలించిన పోలీసులు
సినీ నటి కస్తూరికి 14 రోజుల రిమాండ్ - చెన్నై సెంట్రల్ జైలుకు తరలించిన పోలీసులు
Mulugu News: 'అమ్మో మా ఊరికి దెయ్యం పట్టేసింది' - 2 నెలల్లోనే 20 మంది మృతి, గ్రామస్థుల్లో భయం భయం
'అమ్మో మా ఊరికి దెయ్యం పట్టేసింది' - 2 నెలల్లోనే 20 మంది మృతి, గ్రామస్థుల్లో భయం భయం
BRS BJP Alliance: బీఆర్‌ఎస్‌తో పొత్తుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు- మూసీ ప్రక్షాళన ఆపేందుకు బీజేపీ బస్తీ నిద్ర
బీఆర్‌ఎస్‌తో పొత్తుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు- మూసీ ప్రక్షాళన ఆపేందుకు బీజేపీ బస్తీ నిద్ర
Crime News: పసికందు గుండె చీల్చిన కన్నతల్లి - తాంత్రిక విద్యలతో మళ్లీ బతికిస్తాననే మూఢ విశ్వాసం, జార్ఖండ్‌లో ఘోరం
పసికందు గుండె చీల్చిన కన్నతల్లి - తాంత్రిక విద్యలతో మళ్లీ బతికిస్తాననే మూఢ విశ్వాసం, జార్ఖండ్‌లో ఘోరం
Miss Universe 2024: విశ్వ సుందరిగా డెన్మార్క్ భామ - ఆ దేశ తొలి మహిళగా రికార్డు
విశ్వ సుందరిగా డెన్మార్క్ భామ - ఆ దేశ తొలి మహిళగా రికార్డు
Embed widget