By: ABP Desam | Updated at : 16 Aug 2023 04:13 PM (IST)
పొంగులేటి శ్రీనివాసరెడ్డికి షాక్ - మళ్లీ బీఆర్ఎస్‌కు క్యూ కట్టిన కీలక అనుచరులు !
Khammam Politics : ఖమ్మం జిల్లా నుంచి కాంగ్రెస్‌లో చేరిన పొంగులేటి శ్రీనివాసరెడ్డికి అనుచరులు షాకిస్తున్నారు. ఒక్కొక్కరుగా తిరిగి బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లిపోతున్నారు. తాజాగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనుంగు అనుచరుడు, భద్రాచలం నియోజక వర్గంలో తాను పార్టీలో చేరక ముందే అభ్యర్థిగా ప్రకటించేసిన తెల్లం వెంకట్రావు పార్టీ మారేందుకు సిద్ధమయ్యారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీలో పొంగులేటితో పాటు రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. 2014 నుంచి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దిశా నిర్దేశంలో నడిచిన ఆయన షాక్ ఇచ్చి బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు. 2018లో బీఆర్ఎస్ నుంచి భద్రాచలం ఎమ్మెల్యేగా తెల్లం వెంకటరావు పోటీ చేశారు. కానీ కాంగ్రెస్ అభ్యర్థి పొదెం వీరయ్య చేతిలో పరాజయం పాలయ్యారు. పొంగులేటినే గత ఎన్నికల్లో టిక్కెట్ ఇప్పించడంతో ఈ సారి ఆయన పార్టీలో లేకపోతే టిక్కెట్ రాదేమోనన్న ఉద్దేశంతో పొంగులేటి వెంట నడిచారు. తను ఏ పార్టీలో చేరిన తన అనుచరులందరికీ టిక్కెట్లు ఇప్పిస్తానని ఆయన చెబుతూ వస్తున్నారు. అయితే కాంగ్రెస్ లో చేరిన తర్వాత అందరికీ టిక్కెట్లు ఇప్పించడం కష్టంగా మారింది. భద్రాచలం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే ఉండటంతో తనకు మళ్లీ అవకాశం రాదని తెల్లం వెంకట్రావు ఫీలయ్యారు. అదే సమయంలో బిఆర్ఎస్ కీలక నేతలు వెంకట్రావును సంప్రదించారు. దీంతో ఆయన పార్టీ మారిపోవాలని నిర్ణయించుకున్నారు.
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ లో చేరిన తర్వాత కాంగ్రెస్ లో నేతల మధ్య అసంతృప్తి పెరుగుతోంది. ఇటీవల రాష్ట్ర కాంగ్రెస్ ప్రచార కమిటీ కో చైర్మన్ గా పొంగులేటి నియమితులయ్యారు. నిజానికి కాంగ్రెస్ లో చేరే ముందే పలు నియోజకవర్గాలకు పొంగులేటి అభ్యర్థుల్ని ప్రకటించారు. అలా ప్రకటించిన చోట్ల టిక్కెట్లు కేటాయించలేరు. అశ్వారావుపేట అభ్యర్థిగా జారే ఆదినారాయణను పొంగులేటి ప్రకటించారు. కానీ అకక్కడ కాంగ్రెస్‌లో తాటి వెంకటేశ్వర్లు ఉన్నాు. పొంగులేటి 2014లో వైసీపీ తరపున ఖమ్మం ఎంపీగా గెలిచిన సమయంలో వైసీపీ తరపున అశ్వారావుపేట నుంచి తాటి వెంకటేశ్వర్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ తర్వాత పొంగులేటి వెంట టీఆర్ఎస్లో చేరారు. 2018 ఎన్నికల్లో ఆ పార్టీ తరపున పోటీచేసి ఓడిపోయారు. అక్కడ టీడీపీ తరపున గెలిచిన మెచ్చా నాగేశ్వరరావు ఆ తర్వాత బీఆర్ఎస్ లో చేరగా, తనకు పార్టీలో ప్రాధాన్యత లేదంటూ గతేడాది తాటి వెంకటేశ్వర్లు కాంగ్రెస్‌లోలో చేరారు. బీఆర్ఎస్‌లో ఉన్నప్పటి నుంచే పొంగులేటిని విభేదించి ఆయనకు దూరంగా ఉన్నారు. దీంతో తన వర్గం అభ్యర్థిగా జారే ఆదినారాయణను పొంగులేటి ప్రకటించారు. ఆ తర్వాత పరిణామాల్లో ఆయన కూడా కాంగ్రెస్ లో చేరారు. అయినా గత విభేదాల దృష్ట్యా తాటిని పొంగులేటి దూరం పెడ్తున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇక సత్తుపల్లి లీడర్ డాక్టర్ మట్టా దయానంద్ పరిస్థితి కూడా దాదాపు ఇలాగే ఉంది. 2014లో సత్తుపల్లిలో వైసీపీ తరపున పోటీ చేసి, కొద్ది ఓట్ల తేడాతో సండ్రపై ఓడిపోయారు. తర్వాత పొంగులేటి వెంట అప్పటి టీఆర్ఎస్ చేరారు. 2018లో టీఆర్ఎస్ తరపున టికెట్ ఆశించినా దక్కలేదు. కొద్ది నెలల క్రితం పొంగులేటితో విభేదించి, ఆయన కంటే ముందుగానే దయానంద్ కాంగ్రెస్ లో చేరారు. సత్తుపల్లి పర్యటనకు రెండ్రోజుల ముందు కూడా పొంగులేటిని దయానంద్ కలిసి సన్మానించారని, అయినా కావాలనే పొంగులేటి దూరం పెట్టారని ఆయన అనుచరులు చెబుతున్నారు. దీనిపై 8 ప్రశ్నలతో సోషల్ మీడియాతో పోస్టింగులు పెట్టారు.
అటు పొంగులేటి అనుచరులు.. ఇటు కాంగ్రెస్ నేతలు కూడా... ఉక్కపోతకు గురి అవుతూండటంతో.. ఖమ్మం కాంగ్రెస్‌లో ఏం జరుగుతుందా అన్న చర్చ ప్రారంభమయింది.
BRS Politics: చంద్రబాబు అరెస్టుపై రూటు మార్చేసిన బీఆర్ఎస్ అగ్రనేతలు, సీమాంధ్ర ఓటర్ల ఎఫెక్టేనా ?
IITH: ఐఐటీ హైదరాబాద్‌లో పీహెచ్‌డీ ప్రోగ్రామ్, ఈ అర్హతలు అవసరం
JNTUH: జేఎన్‌టీయూ హైదరాబాద్‌లో అకడమిక్ అసిస్టెంట్/ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు
TS EAMCET: ఎంసెట్ బైపీసీ స్పాట్ ప్రవేశాల గడువు పొడిగింపు, ఎప్పటివరకు అవకాశం ఉందంటే?
KTR in Mancherial: మంచిర్యాల జిల్లాకు కేటీఆర్ - పర్యటన వివరాలు వెల్లడించిన ఎమ్మెల్యే బాల్క సుమన్
Bigg Boss Season 7 Telugu: శివాజీ అనర్హుడు అని ప్రకటించిన కంటెస్టెంట్స్ - దీంతో నాగార్జున అలాంటి నిర్ణయం!
HCA Election Notification: హెచ్‌సీఏ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేసింది, ముఖ్యమైన తేదీలివే
Hari Teja: నటి హరితేజకు విడాకులు- కూల్ గా ఆన్సర్ ఇచ్చిన బిగ్ బాస్ బ్యూటీ
కూతురితో కనిపించిన మాజీ ప్రపంచ సుందరి - తల్లికి తీసిపోని అందం!
/body>