By: ABP Desam | Updated at : 05 Aug 2022 07:35 PM (IST)
టీఆర్ను ప్రశ్నిస్తే ? ఇవిగో సమాధానాలు
Ask KTR : సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే కేటీఆర్ ట్విట్టర్‌లో నెటిజన్లతో ఆస్క్ కేటీఆర్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. జాతీయ రాజకీయాల దగ్గర్నుంచి ఏపీలో పోటీ వరకూ అనేక మంది అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.
ఉచిత హామీలు కాదు .. పెద్దల రుణాలపై దృష్టి పెట్టాలి !
పేదలకు అందించే ఉచిత పథకాల విషయంలో సరైన దృక్పథం, ప్రాధాన్యతలు ఉంటే మంచిదని, ఈ విషయంలో ప్రధానమంత్రి పేదలకు సహాయం చేయడంమాని కార్పొరేట్ సంస్థలకు సుమారు 12 లక్షల కోట్ల రుణాలను మాఫీ చేశారని ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు కేటీఆర్ సమాధానం ఇచ్చారు. ప్రధానమంత్రి విపక్షాలు ఉన్న ప్రభుత్వాలను కూల్చడం మానేసి, పడిపోతున్న రూపాయి పైన దృష్టి సారించాలన్నారు. సామాజిక మాధ్యమాల్లో డిపి ) మార్చడం వల్ల ఏమవుతుందని, జిడిపి మారితే దేశానికి మంచి జరుగుతుందన్నారు.
బీజేపీ నేతలు గోబెల్స్ శిష్యులు !
బిజెపి నాయకులు నోటితో రెచ్చిపోయి ప్రచారంలో దూసుకుపోతుంటే మీరెందుకు నిశ్శబ్దంగా ఉన్నారన్న ప్రశ్నకు సమాధానంగా ఖాళీ పాత్రలు ఎక్కువ శబ్దం చేస్తాయన్నారు. బిజెపి నేతలు గోబెల్స్ శిష్యులని, అబద్దాలను ప్రచారం చేయడం, ద్వేశం పెంచడంలో సిద్ధహస్తులని కేటీఆర్ అన్నారు. అయితే బిజెపి అబద్ధపు ప్రాపగాండను ఎండగట్టడంతో పాటు అదే సమయంలో తాము చేస్తున్న పనులు అభివృద్ధి ప్రజల ముందు ఉంచుతామన్నారు. బిజెపి జాతీయవాదం, మతవాదంతో రాజకీయాలు చేస్తూ ఎన్నికల్లో సునాయాసంగా గెలిచేందుకు ప్రయత్నం చేస్తుందని, ఈ విషయంలో మీరు వెనుక పడ్డారన్న ప్రశ్నకు సమాధానంగా తమది అభివృద్ధి పూర్వక జాతీయవాదమని, దానిపైననే తాము దృష్టి సారించామన్నారు.
మునుగోడు మరో ఉపఎన్నిక మాత్రమే !
మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించి తనకు తెలిసినంతవరకు మునుగోడు అంశం కేవలం మరో ఉపఎన్నిక మాత్రమే అని, దాంతో ఏం మారుతుందని కేటీఆర్ ప్రశ్నించారు. రాష్ట్రంలో వీఆర్ఏలకు సంబంధించిన జీతాలు మరియు పదోన్నతులకు సంబంధించిన అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తా అన్నారు. ఐఐటీ బాసర విద్యార్థుల సమస్యలను తామేందుకు పట్టించుకోమని ప్రశ్నించిన కెటియార్, వాటిపై ఇప్పటికే ప్రభుత్వం దృష్టి సాధించిందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారి తోపాటు వైస్ ఛాన్స్లర్, డైరెక్టర్ క్యాంపస్ లో ఉండి విద్యార్థుల సంక్షేమం కోసం పాటుపడుతున్నారని కేటీఆర్ తెలిపారు.
మాది ప్రజాస్వామ్యప్ర భుత్వం !
జర్నలిస్ట్ ముసుగులో వాక్ స్వాతంత్రం పేరుతో ప్రభుత్వ కార్యక్రమాలను హేళనగా మాట్లాడుతున్న వాళ్లపై ఎందుకు చర్య తీసుకోలేకపోతున్నారన్న ప్రశ్నకు సమాధానంగా వాక్ స్వేచ్చను సమర్థించే ప్రజాసామిక ప్రభుత్వం మాదని అయితే దురదృష్టవశాత్తు ఈ మధ్యకాలంలో ఈ వాక్ స్వేచ్ఛ ఇతరులను అవహేళన చేసేందుకు, తిట్టేందుకు మాత్రమే ఉపయోగపడుతుందని దాన్ని ఎవరూ సహించాల్సిన అవసరం లేదన్నారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి లేదా ఐటీ మంత్రి అవ్వాలన్న ట్వీట్ కు స్పందిస్తూ తెలంగాణ రాష్ట్రానికి సేవ చేయడంతో సంతృప్తిగా ఉన్నట్లు, పశ్చిమబెంగాల్ విషయంలో మమతా బెనర్జీ తన బాధ్యతలను సమర్ధంగా నిర్వర్తిస్తున్నారని కితాబిచ్చారు.
దసరా నాటికి సచివాలయంప్రారంభం !
ఈ దసరా నాటికి నూతన సచివాలయం ప్రారంభమయ్యే అవకాశం ఉందని కేటీఆర్ తెలిపారు. తెలంగాణ ప్రజల ప్రేమ, ఆశీర్వాదాలతో టిఆర్ఎస్ పార్టీ తెలంగాణకు సేవ చేయడం కొనసాగిస్తుందన్నారు. సమర్థవంతమైన ముఖ్యమంత్రిగా సేవలు కొనసాగిస్తున్న కేసీఆర్ గారు తప్పకుండా ప్రజల ఆశీర్వాదంతో మూడోసారి గెలిచి హ్యాట్రిక్ సాధిస్తారని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపి లేదా కాంగ్రెస్తో పొత్తు ఉంటుందా అన్న ప్రశ్నకు సమానంగా తమ పొత్తు తెలంగాణ ప్రజలతో ఉంటుందన్నారు. రాబోయే ఎన్నికల్లో రెండు జాతీయ పార్టీలతో పోరాడాలన్న ప్రశ్నకు సమాధానం ఇస్తూ కేవలం జాతీయ పార్టీలతోనే ఎందుకు అనేక ఇతర పార్టీలు కూడా ఉన్నాయిగా అన్నారు.తన కాలి గాయం నుంచి కోరుకుంటున్నట్లు, త్వరలోనే విధులకు హాజరుకానున్నట్లు కేటీఆర్ తెలిపారు. రెండు గంటల పాటు ఆస్క్ కేటీఆర్ కార్యక్రమంలో సమాధానాలు ఇచ్చారు.
Mlc Kavitha On Bilkis Bano Case : బిల్కిస్ బానో కేసులో దోషుల విడుదలపై జోక్యం చేసుకోండి, సీజేఐకు ఎమ్మెల్సీ కవిత లేఖ
హైదరాబాద్ అధికారులకు ఎమ్మెల్యే రాజాసింగ్ 48 గంటల డెడ్‌లైన్
Munugode Bypolls : మునుగోడు లోకల్ లీడర్స్‌కు బంపర్ ఆఫర్లు - వలసల కోసం రాజకీయ పార్టీల వ్యూహాలు !
హైదరాబాద్‌లోని ఓ కాలేజీలో దారుణం- నిప్పంటించుకొని ప్రిన్సిపాల్‌ను పట్టుకున్న విద్యార్థి
Kaleswaram Issue : వరదలతో కాళేశ్వరం ప్రాజెక్టుకు ఎంత నష్టం జరిగింది? ప్రభుత్వం ఎందుకు సీక్రెట్‌గా ఉంచుతోంది ?
ఏలూరు జిల్లాలో సంచలనంగా మారిన వైసీపీ లీడర్ వీడియో!
Power Exchanges Ban : తెలుగు రాష్ట్రాలకు కేంద్రం 'విద్యుత్' షాక్, ఎక్స్ఛేంజీల్లో కొనుగోళ్లపై నిషేధం
Vijay Deverakonda: 'లైగర్'కి సీక్వెల్ - అసలు విషయం చెప్పిన విజయ్ దేవరకొండ
ABP Desam Exclusive: రూ.800 యూపీఐ లావాదేవీకి ఎంత ఖర్చవుతోంది! మనకు ఉచితం, RBIకి ఎంత నష్టం!