U&i Wireless Headphones: కొత్త బ్లూటూత్ ఇయర్‌ఫోన్స్ వచ్చేశాయ్.. రూ.799 నుంచే!
మనదేశంలో యూ అండ్ ఐ కంపెనీ కొత్త వైర్ లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్‌ను మనదేశంలో లాంచ్ చేసింది.
యూ అండ్ ఐ మనదేశంలో కొత్త వైర్‌లెస్ టెక్ ఉత్పత్తులను లాంచ్ చేసింది. అవే బ్యాట్‌మాన్ సిరీస్, మిసైల్ సిరీస్, పింక్ సిరీస్, స్క్రూ సిరీస్. వీటిలో బ్యాట్‌మ్యాన్ సిరీస్ వైర్‌లెస్ ఇయర్‌ఫోన్స్ 30 గంటల బ్యాకప్‌ను అందించనున్నాయని కంపెనీ తెలిపింది.
యూ అండ్ ఐ టెక్ ఉత్పత్తుల ధర
యూ అండ్ ఐ బ్యాట్‌మ్యాన్ సిరీస్ వైర్‌లెస్ ఇయర్‌ఫోన్స్ ధర రూ.3,499గా ఉంది. మిసైల్ సిరీస్ వైర్‌లెస్ ఇయర్‌ఫోన్స్ ధర కూడా రూ.3,499గానే నిర్ణయించారు. ఇక పింక్ సిరీస్ వైర్‌లెస్ నెక్‌బ్యాండ్ ధర రూ.2,499గానూ, స్క్రూ సిరీస్ వైర్‌లెస్ సింగిల్ ఇయర్‌ఫోన్ ధర రూ.799గా ఉంది.
బ్యాట్‌మ్యాన్ సిరీస్ వైర్‌లెస్ ఇయర్ ఫోన్స్ స్పెసిఫికేషన్లు
ఇవి 30 గంటల పవర్ బ్యాకప్‌ను అందించనున్నాయి. బ్లూటూత్ వీ5.1+ఈడీఆర్ వెర్షన్‌ను ఇందులో అందించారు. దీని బ్యాటరీ సామర్థ్యం 40 ఎంఏహెచ్‌గా ఉంది. మొత్తంగా ఆరు గంటల టాక్‌టైంను ఇవి అందించనున్నాయి. ఈ ఇయర్‌ఫోన్స్, చార్జింగ్ కేస్ పూర్తిగా చార్జ్ అవ్వడానికి 1.5 గంటలు పట్టనుంది. దీని స్టాండ్ బై టైం 500 గంటలుగా ఉంది. ట్రాన్స్‌మిషన్ డిస్టెన్స్ 10 మీటర్లుగా ఉంది.
యూ అండ్ ఐ మిసైల్ సిరీస్ వైర్‌లెస్ ఇయర్‌ఫోన్స్ స్పెసిఫికేషన్లు
ఇందులో టచ్ సెన్సార్‌ను కంపెనీ అందించింది. 20 గంటల బ్యాటరీ బ్యాకప్‌ను ఇది అందించనుంది. దీని స్టాండ్‌బై టైం 400 గంటలుగా ఉంది. ఈ ఇయర్ ఫోన్ బ్యాటరీ సామర్థ్యం 30 ఎంఏహెచ్‌గా ఉంది. చార్జింగ్ టైం ఒక గంట కాగా, టాక్ టైం నాలుగు గంటలుగా ఉంది. దీని కేస్ సామర్థ్యం 260 ఎంఏహెచ్‌గా ఉంది.
పింక్ వైర్‌లెస్ నెక్ బ్యాండ్ స్పెసిఫికేషన్లు
ఈ ఇయర్‌ఫోన్స్‌లో బ్లూటూత్ వీ5.1ను అందించారు. దీని స్టాండ్‌బై టైం ఏకంగా 2100 గంటలుగా ఉండటం విశేషం. దీని మ్యూజిక్ టైం 25 గంటలుగా ఉంది. దీని బ్యాటరీ సామర్థ్యం 210 ఎంఏహెచ్ కాగా.. పూర్తిగా చార్జ్ కావడానికి మూడు గంటల సమయం వరకు పడుతుంది.
స్క్రూ సిరీస్ వైర్‌లెస్ సింగిల్ ఇయర్‌ఫోన్ స్పెసిఫికేషన్లు
దీని టాక్ టైం 24 గంటల వరకు ఉండనుంది. బ్లూటూత్ వీ5.0 వెర్షన్‌ను ఇందులో అందించారు. దీని ఫ్రీక్వెన్సీ రేంజ్ 20 హెర్జ్ నుంచి 20,000 హెర్ట్జ్ వరకు ఉంది. దీని చార్జింగ్ టైమ్ 2 గంటలుగా ఉంది. 60 ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో అందించారు.
Also Read: Tecno Camon 18: ముందు, వెనక 48 మెగాపిక్సెల్ కెమెరాలు.. ధర రూ.15 వేలలోపే.. వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ ఫ్రీ!
Also Read: Honor 60: 108 మెగాపిక్సెల్ కెమెరాతో హానర్ కొత్త ఫోన్.. వ్లాగర్ల కోసం ప్రత్యేక ఫీచర్ కూడా!
Also Read: Lost Aadhar Card: ఆధార్ కార్డు పోయిందా.. స్మార్ట్ ఫోన్‌లో ఇలా చేస్తే చాలు.. కొత్త ఆధార్ ఇంటికి!
Also Read: Moto G51 5G: అత్యంత చవకైన మోటో 5జీ ఫోన్ వచ్చేస్తుంది.. మరో వారంలో లాంచ్.. ధర ఎంతంటే?
Also Read: Redmi New Phone: రెడ్‌మీ కొత్త ఫోన్ వచ్చేసింది.. 8 జీబీ ర్యామ్.. ధర ఎంతంటే?