Tiktok: అమెరికాలో టిక్‌టాక్ బ్యాన్? - గూగుల్, యాపిల్‌లకు గవర్నమెంట్ ఆర్డర్!
Tiktok Banned: టిక్‌టాక్ యాప్ అమెరికాలో కూడా బ్యాన్ అయ్యే ప్రమాదంలో పడింది. టిక్‌టాక్‌ను యాప్ స్టోర్ల నుంచి తీసేయాల్సిందిగా యాపిల్, గూగుల్‌లను అమెరికా చట్టసభ ఆదేశించింది.

Tiktok To Be Banned in USA: అమెరికాలో టిక్‌టాక్ కష్టాలు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. ఇది ఇప్పటికే నిషేధితం అయ్యే ముప్పును ఎదుర్కొంటోంది. ఇప్పుడు అమెరికన్ చట్టసభ సభ్యులు ఈ యాప్‌ను వారి సంబంధిత యాప్ స్టోర్ల నుండి తీసివేయవలసిందిగా యాపిల్, గూగుల్‌లను ఆదేశించారు. అంటే గూగుల్ ప్లేస్టోర్ నుంచి, యాపిల్ యాప్ స్టోర్ నుంచి ఈ యాప్‌ను తీసేయాలన్న మాట. ఇందుకోసం రెండు కంపెనీలకు జనవరి 19వ తేదీ వరకు సమయం ఇచ్చారు. ఇదే జరిగితే అమెరికాలోని ప్రజలు ఇకపై అఫీషియల్ సోర్స్‌ల నుంచి టిక్‌టాక నుంచి డౌన్‌లోడ్ చేయలేరు. అయితే ఈ నిర్ణయం ప్రస్తుత వినియోగదారులపై పెద్దగా ప్రభావం చూపదు.
నిషేధితం అయ్యే ప్రమాదం ఎందుకు ఉంది?
చైనా కంపెనీ బైట్‌డాన్స్ యాజమాన్యంలో టిక్‌టాక్ ఉంది. ఇప్పుడు బైట్‌డ్యాన్స్ అమెరికాలో తన కార్యకలాపాలను కొనసాగించాలనుకుంటే టిక్‌టాక్‌ను విక్రయించాల్సి ఉంటుంది. జనవరి 19వ తేదీలోగా టిక్‌టాక్‌ను వేరే దేశానికి చెందిన కంపెనీకి విక్రయించకపోతే దాన్ని నిషేధించే ప్రమాదం ఉంది. టిక్‌టాక్‌ని పౌరుల భద్రతకు ముప్పుగా అమెరికా పరిగణిస్తోంది. బైట్‌డ్యాన్స్ తన యాప్ ద్వారా ప్రజల వ్యక్తిగత డేటాను దొంగిలించి చైనా ప్రభుత్వానికి ఇచ్చిందని ఆరోపించింది.
Also Read: గూగుల్ పేలో ట్రాన్సాక్షన్లు డిలీట్ చేయడం ఎలా? - సింపుల్ స్టెప్స్‌తో పని అయిపోతుంది!
అమెరికా ఎంపీలు లేఖలో ఏం రాశారు?
యూఎస్ పార్లమెంట్ కమిటీలోని ఇద్దరు సభ్యులు జాన్ ముల్నర్, భారతీయ అమెరికన్ రాజా కృష్ణమూర్తి యాపిల్ సీఈవో టిమ్ కుక్, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్‌లకు లేఖ రాశారు. ఇందులో బైట్‌డ్యాన్స్‌కు కావాల్సిన చర్యలు తీసుకునేందుకు తగిన సమయం ఇచ్చామని తెలిపారు. ఇప్పుడు అది చట్టాన్ని అనుసరించకపోతే అమెరికాలో అలాంటి యాప్‌లను యాక్సెస్ చేయడానికి, నిర్వహించడానికి, అప్‌డేట్ చేసే హక్కు దానికి ఉండదు. అందువల్ల చట్టాన్ని గౌరవిస్తూ గూగుల్, యాపిల్ అవసరమైన చర్యలు తీసుకోవాలి.
ఉపశమనం కోసం చూస్తున్న బైట్‌డ్యాన్స్
అమెరికా కోర్టు ఆదేశాల తర్వాత అమెరికా చట్టసభ సభ్యులు రాసిన ఈ లేఖ వెలుగులోకి వచ్చింది. ఈ నిర్ణయాన్ని బైట్‌డ్యాన్స్ సుప్రీంకోర్టులో సవాలు చేసింది. ఇక్కడి నుంచి ఉపశమనం పొందవచ్చని బైట్‌డ్యాన్స్ భావిస్తోంది. ఇక్కడి నుంచి కంపెనీకి ఉపశమనం లభించకపోతే అమెరికాలో వ్యాపారం చేయడం కష్టంగా మారుతుంది. అయితే ఇప్పటికే ఉన్న వినియోగదారులు యాప్‌ని ఉపయోగించడం కొనసాగించగలరు. కానీ వారికి ఎలాంటి అప్‌డేట్‌లు లేదా సపోర్ట్ లభించదు.
Also Read: విమానంలో ఫోన్ ఎందుకు ఫ్లైట్ మోడ్‌లో పెట్టాలి? - పెట్టకపోతే ఏం జరుగుతుంది?
Biden did vote for TikTok to be banned in the USA on Jan. 19, 2025. I’m a big fan and have already downloaded Lemon8 as its replacement. President Trump joined TikTok June 2024 and already has 22 million followers. TikTok is really strict with their rules so I do hope Lemon8 will… pic.twitter.com/TW4bOZVuhC
— BEATRIZ (@ORCI_deGon) December 7, 2024
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

