Weak Password: ‘password’యే పాస్‌వర్డా.. ఏం క్రియేటివిటీ సార్ ఇది.. ఈ లిస్ట్‌లో ఉన్నవి వాడితే వెంటనే మార్చాల్సిందే!
ప్రస్తుతం మనదేశంలో సైబర్ భద్రత మీద అవగాహన పెరుగుతోంది. అయినా చాలామంది బలహీనమైన పాస్‌వర్డ్‌లు ఉపయోగిస్తున్నారు. దేశంలో ఎక్కువమంది ఉపయోగించే పాస్‌వర్డ్‌ల జాబితాను ఒక సెక్యూరిటీ సంస్థ తెలిపింది.
మనదేశంలో ఎక్కువమంది ఉపయోగించే పాస్‌వర్డ్ ఏంటో తెలుసా? ‘password’యేనంట. ఈ విషయం ఒక రీసెర్చ్‌లో తేలింది. దీంతోపాటు ‘iloveyou’, ‘krishna’, ‘sairam’ and ‘omsairam’ పాస్‌వర్డ్‌లు కూడా మనదేశంలో చాలా ఎక్కువమంది ఉపయోగిస్తున్నారంట.
చాలా సింపుల్‌గా ఊహించదగిన న్యూమరికల్, కీబోర్డ్ సీక్వెన్స్‌లను మనదేశంలో ఎక్కువగా ఉపయోగిస్తారని తెలుస్తోంది. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. జపాన్‌లో కూడా ఎక్కువమంది ‘password’నే పాస్‌వర్డ్‌గా ఉపయోగిస్తున్నారని తెలుస్తోంది.
12345, qwerty పాస్‌వర్డ్‌లను మనదేశంలో ఎక్కువగా ఉపయోగిస్తున్నారని తెలుస్తోంది. దీంతోపాటు 'iloveyou', 'sweetheart', 'sunshine', 'lovely' పాస్‌వర్డ్‌లను కూడా ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అయితే ఈ రీసెర్చ్‌లో బయటకు వచ్చిన విషయాలు ఇవి మాత్రమే కాదు.
మనదేశంలో ఉన్న బలహీనమైన పాస్‌వర్డ్‌లను క్రాక్ చేయడానికి హ్యాకర్లకు ఎంత టైం పడుతుందో కూడా చెప్పారు. ప్రస్తుతం సగటున ఒక వ్యక్తికి 100 వరకు ఆన్‌లైన్ అకౌంట్లు ఉంటున్నాయి. పాస్‌వర్డ్‌లు రిపీట్ అయితే తప్ప వాటిని గుర్తు పెట్టుకోవడం అంత సులభం కాదు.
ఈ సమస్యకు సొల్యూషన్‌గా పాస్‌వర్డ్ మేనేజర్లను ఉపయోగించాలని ఈ రీసెర్చ్‌లో చెబుతున్నారు. దీని వల్ల మీ పాస్‌వర్డ్‌లకు అదనపు సెక్యూరిటీ దొరుకుతుందని నార్డ్‌పాస్ సీఈవో జోనాస్ కార్క్‌లిస్ అన్నారు. దురదృష్టవశాత్తూ పాస్‌వర్డ్‌లు అత్యంత బలహీనంగా అవుతున్నాయని తెలిపారు. బలమైన పాస్‌వర్డ్‌ను ఉపయోగించడానికి ప్రజలు కూడా ప్రయత్నించడం లేదని పేర్కొన్నారు. సైబర్ సెక్యూరిటీని ప్రజలు సీరియస్‌గా తీసుకోవాల్సిన సమయం వచ్చిందన్నారు. ఒకవేళ మీ పాస్‌వర్డ్ కూడా ఈ జాబితాలో ఉంటే వెంటనే మార్చుకోండి. మోస్ట్ కామన్ పాస్‌వర్డ్‌ల జాబితాను చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి.
Also Read: Infinix New Phone: రూ.6 వేలలోనే కొత్త స్మార్ట్‌ఫోన్.. 6000 ఎంఏహెచ్ బ్యాటరీ.. మిగతా ఫీచర్లు?
Also Read: రూ.10 వేలలోనే ఒప్పో కొత్త ఫోన్.. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?
Also Read: Lava AGNI 5G: స్వదేశీ 5జీ ఫోన్ వచ్చేసింది.. ఇలా కొంటే రూ.2,000 తగ్గింపు!
Also Read: రూ.18 వేలలోపే 5జీ ఫోన్.. భారీ డిస్‌ప్లే కూడా!
Also Read: 7 అంగుళాల భారీ డిస్‌ప్లేతో హానర్ కొత్త ఫోన్.. అదిరిపోయే ఫీచర్లు.. 5జీ కూడా!