News
News
X

Budget Mobile: రూ.6 వేలలోనే స్మార్ట్ ఫోన్.. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, సూపర్ ఫీచర్లు!

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ టెక్నో తన కొత్త స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో లాంచ్ చేసింది. అదే టెక్నో పాప్ 5 ఎల్టీఈ.

FOLLOW US: 

టెక్నో పాప్ 5 ఎల్టీఈ స్మార్ట్ ఫోన్ మార్కెట్లో లాంచ్ అయింది. ఇందులో 6.52 అంగుళాల డిస్‌ప్లేను అందించారు. ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు ఉన్నాయి. 5000 ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో అందించారు. ఈ ఫోన్ ప్రస్తుతానికి ఫిలిప్పీన్స్, పాకిస్తాన్‌ల్లో మాత్రమే అందుబాటులో ఉంది.

టెక్నో పాప్ 5 ఎల్టీఈ ధర
ఈ ఫోన్ ధరను ఫిలిప్పీన్స్‌లో 4,599 పెసోలుగా(సుమారు రూ.6,800) నిర్ణయించారు. పాకిస్తాన్‌లో మాత్రం 15,000 పాకిస్తాన్ రూపాయలుగా(సుమారు రూ.6,300) నిర్ణయించారు. ఇందులో కేవలం 2 జీబీ ర్యామ్ + 32 జీబీ స్టోరేజ్ వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది. డీప్ సీ లస్టర్, ఐస్ బ్లూ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. మనదేశంలో ఈ ఫోన్ ఎప్పుడు లాంచ్ కానుందో తెలియరాలేదు.

టెక్నో పాప్ 5 ఎల్టీఈ స్పెసిఫికేషన్లు
ఆండ్రాయిడ్ 10(గో ఎడిషన్) ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 6.52 అంగుళాల హెచ్‌డీ+ ఐపీఎస్ ఎల్సీడీ డిస్‌ప్లేను అందించారు. ఆక్టాకోర్ యూనిసోక్ ఎస్సీ9863 ప్రాసెసర్‌ను ఇందులో అందించారు. 2 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్‌ను ఇందులో అందించారు. దీన్ని మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 256 జీబీ వరకు పెంచుకోవచ్చు.

ఇందులో వెనకవైపు రెండు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 8 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 2 మెగాపిక్సెల్ కెమెరా కూడా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 5 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు.

News Reels

బ్లూటూత్ వీ4.2, జీపీఎస్, ఎఫ్ఎం రేడియో, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్, మైక్రో యూఎస్‌బీ పోర్టు, వైఫై, జీపీఆర్ఎస్, 4జీ ఎల్టీఈ వంటి కనెక్టివిటీ ఫీచర్లు కూడా ఇందులో అందించారు. ఫోన్ వెనకవైపు ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. ఫేస్ రికగ్నిషన్‌ను కూడా ఇది సపోర్ట్ చేయనుంది. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది. యాక్సెలరోమీటర్, గైరోస్కోప్, ప్రాక్సిమిటీ సెన్సార్లు కూడా ఇందులో అందించారు. దీని రిటైల్ బాక్సులో చార్జర్, ప్రొటెక్టివ్ షెల్, యూఎస్‌బీ కేబుల్ ఉండనున్నాయి.

Also Read: OnePlus RT: మనదేశంలో వన్‌ప్లస్ కొత్త ఫోన్.. ఫీచర్లు సూపర్.. ధర ఎంతంటే?

Also Read: Xiaomi 12: ఒకే ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ కెమెరా, మూడు 48 మెగాపిక్సెల్ కెమెరాలు.. అదిరిపోయే మొబైల్ వచ్చేస్తుంది!

Also Read: Infinix New Phone: రూ.6 వేలలోనే కొత్త స్మార్ట్‌ఫోన్.. 6000 ఎంఏహెచ్ బ్యాటరీ.. మిగతా ఫీచర్లు?

Also Read: Lava AGNI 5G: స్వదేశీ 5జీ ఫోన్ వచ్చేసింది.. ఇలా కొంటే రూ.2,000 తగ్గింపు!

Also Read: 7 అంగుళాల భారీ డిస్‌ప్లేతో హానర్ కొత్త ఫోన్.. అదిరిపోయే ఫీచర్లు.. 5జీ కూడా!

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 28 Nov 2021 04:38 PM (IST) Tags: Tecno New Phone Tecno POP 5 LTE Tecno POP 5 LTE Launched Tecno POP 5 LTE Price Tecno POP 5 LTE Specifications Tecno POP 5 LTE Features Affordable Smartphone టెక్నో టెక్నో పాప్ 5 ఎల్టీఈ

సంబంధిత కథనాలు

Samsung Galaxy S23 Series: త్వరలోనే Galaxy S23 సిరీస్ లాంచింగ్,  ఫీచర్లు మామూలుగా లేవుగా!

Samsung Galaxy S23 Series: త్వరలోనే Galaxy S23 సిరీస్ లాంచింగ్, ఫీచర్లు మామూలుగా లేవుగా!

Jio Network Outage: యూజర్లకు జియో షాక్‌! ఆగిపోయిన కాలింగ్‌, ఎస్‌ఎంఎస్‌, డేటా సేవలు!

Jio Network Outage: యూజర్లకు జియో షాక్‌! ఆగిపోయిన కాలింగ్‌, ఎస్‌ఎంఎస్‌, డేటా సేవలు!

స్మార్ట్‌వాచ్‌లు సేఫా లేక డేంజరా? ఇంతకూ నిపుణులు ఏం అంటున్నారు.!

స్మార్ట్‌వాచ్‌లు సేఫా లేక డేంజరా? ఇంతకూ నిపుణులు ఏం అంటున్నారు.!

WhatsApp: మీరు వాట్సాప్‌ వాడుతున్నారా - ప్లీజ్‌, హెల్ప్‌ అంటూ రిక్వెస్ట్‌లు వస్తే బీ కేర్‌ ఫుల్‌ !

WhatsApp: మీరు వాట్సాప్‌ వాడుతున్నారా - ప్లీజ్‌, హెల్ప్‌ అంటూ రిక్వెస్ట్‌లు వస్తే బీ కేర్‌ ఫుల్‌ !

Vivo Y76s T1 Version: వివో బడ్జెట్ 5జీ ఫోన్ వచ్చేసింది - మిగతా బ్రాండ్ల బడ్జెట్ 5జీ మొబైల్స్‌కు పోటీ!

Vivo Y76s T1 Version: వివో బడ్జెట్ 5జీ ఫోన్ వచ్చేసింది - మిగతా బ్రాండ్ల బడ్జెట్ 5జీ మొబైల్స్‌కు పోటీ!

టాప్ స్టోరీస్

Bandi Sanjay : భైంసా పేరు మహిషాగా మారుస్తాం, పీడీయాక్ట్ లు ఎత్తేసి ఉద్యోగాలిస్తాం - బండి సంజయ్

Bandi Sanjay :  భైంసా పేరు మహిషాగా మారుస్తాం, పీడీయాక్ట్ లు ఎత్తేసి ఉద్యోగాలిస్తాం - బండి సంజయ్

Ys Vijayamma Comments : ఆ రాష్ట్రంతో మనకేంటి ? - ఏపీ గురించి వైఎస్ విజయమ్మ సంచలన కామెంట్స్ !

Ys Vijayamma Comments : ఆ రాష్ట్రంతో మనకేంటి ? - ఏపీ గురించి వైఎస్ విజయమ్మ  సంచలన కామెంట్స్ !

Tirumala Update: భక్తులకు టీటీడీ అలర్ట్ - డిసెంబర్ 1 నుంచి తిరుమల శ్రీవారి బ్రేక్ దర్శన సమయాల్లో మార్పు

Tirumala Update: భక్తులకు టీటీడీ అలర్ట్ - డిసెంబర్ 1 నుంచి తిరుమల శ్రీవారి బ్రేక్ దర్శన సమయాల్లో మార్పు

Ram Gopal Varma Tweet పుట్టినరోజు ఆయనదైతే నాకు దండేశారేంటి : వైరల్ అవుతోన్న ఆర్జీవి ట్వీట్

Ram Gopal Varma Tweet పుట్టినరోజు ఆయనదైతే నాకు దండేశారేంటి : వైరల్ అవుతోన్న ఆర్జీవి ట్వీట్