(Source: ECI/ABP News/ABP Majha)
Redmi Smart TV: రూ.16 వేలలోపే స్మార్ట్ టీవీ.. సూపర్ ఫీచర్లు, అదిరిపోయే డిస్‌ప్లే.. లాంచ్ చేసిన షియోమీ!
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ షియోమీ మనదేశంలో కొత్త స్మార్ట్ టీవీలు లాంచ్ చేసింది. అవే రెడ్‌మీ స్మార్ట్ టీవీ 32, రెడ్‌మీ స్మార్ట్ టీవీ 43. వీటి ధర రూ.15,999 నుంచి ప్రారంభం కానుంది.
రెడ్‌మీ స్మార్ట్ టీవీ 32, స్మార్ట్ టీవీ 43 మనదేశంలో లాంచ్ అయ్యాయి. ఈ కొత్త స్మార్ట్ టీవీలు ఆల్ రౌండ్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందించనున్నాయని కంపెనీ తెలిపింది. డాల్బీ ఆడియో, ఐఎండీబీ ఇంటిగ్రేషన్, గూగుల్ అసిస్టెంట్ సపోర్ట్ ఇందులో ఉండనున్నాయి. ఇందులో డాల్బీ 5.1 సరౌండ్ సౌండ్ ఎక్స్‌పీరియన్స్ వంటి ఫీచర్లు ఉండనున్నాయి. ప్యాచ్‌వాల్ స్కిన్‌ను కూడా ఇందులో అందించారు. ఈ టీవీ రిమోట్‌లో గూగుల్ అసిస్టెంట్‌కు ప్రత్యేకమైన బటన్ అందించారు. వన్‌ప్లస్ టీవీ వై1 32, 43, రియల్‌మీ స్మార్ట్ టీవీ 32, 43లతో ఈ టీవీ పోటీ పడనుంది.
రెడ్‌మీ స్మార్ట్ టీవీ 32, రెడ్‌మీ స్మార్ట్ టీవీ 43 ధర
రెడ్‌మీ స్మార్ట్ టీవీ 32 ధరను మనదేశంలో రూ.15,999గా నిర్ణయించారు. రెడ్‌మీ స్మార్ట్ టీవీ 43 ధర రూ.25,999గా ఉంది. అమెజాన్.కాం, ఎంఐ.కాం, ఎంఐ హోం స్టోర్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు. ఈ టీవీల సేల్ అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్‌లో జరగనుంది. ఈ సేల్ తేదీలను కంపెనీ ఇంకా ప్రకటించలేదు. పండగ సందర్భంగా వీటిపై ప్రత్యేక ఆఫర్లు కూడా అందుబాటులో ఉండనున్నాయి.
Also Read: ఓటీటీ యాప్స్‌కు ఎంత మొబైల్ డేటా అవుతుందో తెలుసా.. ఐపీఎల్ మ్యాచ్‌లు, యూట్యూబ్ వీడియోలకు ఎంత అవసరం?
రెడ్‌మీ స్మార్ట్ టీవీ 32, 43 స్పెసిఫికేషన్లు
ఇక స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే.. ఆండ్రాయిడ్ టీవీ 11 ఆధారిత ప్యాచ్‌వాల్ 4 ఆపరేటింగ్ సిస్టంపై ఈ టీవీలు పనిచేయనున్నాయి. ఐఎండీబీ ఇంటిగ్రేషన్ కూడా ఇందులో అందించారు. యూనివర్సల్ సెర్చ్, కిడ్స్ మోర్, లాంగ్వేజ్ యూనివర్స్ వంటి ఫీచర్లను కూడా కంపెనీ అందించింది. షియోమీ వివిడ్ పిక్చర్ ఇంజిన్ కూడా ఇందులో అందించారు. 20W స్పీకర్లు కూడా ఇందులో అందించారు. డాల్బీ ఆడియో, డీటీఎస్ వర్చువల్:ఎక్స్ సపోర్ట్ ఇందులో ఉంది. క్రోమ్ కాస్ట్ బిల్ట్-ఇన్, ప్రీలోడెడ్ గూగుల్ అసిస్టెంట్ సపోర్ట్‌లు కూడా ఇందులో షియోమీ అందించింది.
కొత్త ఎంఐ రిమోట్‌ను ఇందులో అందించారు. గూగుల్ అసిస్టెంట్ బటన్ కూడా ఈ రిమోట్‌లో ఉంది. క్విక్ మ్యూట్ ఫీచర్‌ను ఇందులో కంపెనీ అందించింది. వాల్యూమ్ డౌన్‌కీని డబుల్ ట్యాప్ చేస్తే.. టీవీ మ్యూట్ అయిపోతుంది. ఈ రిమోట్‌లో క్విక్ వేవ్ అనే ఫీచర్ కూడా ఉంది. దీని ద్వారా టీవీని ఆన్ చేస్తే ఐదు సెకన్లలోనే టర్న్ ఆన్ అవుతుంది.
డ్యూయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ వీ5.0 వంటి వైర్‌లెస్ కనెక్టివిటీ ఆప్షన్లు ఇందులో ఉన్నాయి. ఆండ్రాయిడ్ డివైస్‌లను కాస్ట్ చేయడానికి మిరాకాస్ట్ ఫీచర్‌ను కూడా ఇందులో అందించారు. ఇందులో ఆటో లో లేటెన్సీ మోడ్ కూడా ఉంది. టీవీని గేమ్ కన్సోల్‌గా ఉపయోగిస్తున్నప్పుడు లేటెన్సీ రేట్ తగ్గించడానికి ఇవి ఉపయోగపడతాయి.
రెండు హెచ్‌డీఎంఐ, రెండు యూఎస్‌బీ 2.0, ఒక ఏవీ, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్, ఎథర్‌నెట్, యాంటెన్నా పోర్టు కూడా ఇందులో ఉన్నాయి. ఈ రెండిటి మధ్య ఉన్న ప్రధాన తేడా డిస్‌ప్లేనే. రెడ్‌మీ స్మార్ట్ టీవీ 32లో 32 అంగుళాల హెచ్‌డీ డిస్‌ప్లేను అందించగా, రెడ్‌మీ స్మార్ట్ టీవీ 43లో 43 అంగుళాల ఫుల్ హెచ్‌డీ స్క్రీన్‌ను అందించారు.
Also Read: iPhone 14 Series: ఐఫోన్ 14 సిరీస్‌లో ఆ ఫోన్ లేనట్లే.. యాపిల్ సంచలన నిర్ణయం!
Also Read: Realme New 5G Phone: రియల్‌మీ బడ్జెట్ 5జీ ఫోన్ వచ్చేస్తుంది.. ధర రూ.15 వేలలోపే!